పేదరికం నివారణ చర్యలు

Adhvith
0

Poverty Alleviation Measures in India

Poverty alleviation measures in India in Telugu పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు భావించారు. ఫలితంగా 1970వ దశకం నుండి కొన్ని పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి అవి:

  1. గ్రామీణ ఉపాధి పథకాలు
  2. పట్టణ ఉపాధి పథకాలు
  3. అఖిల భారత స్థాయి పథకాలు
  4. సామాజికభద్రతా పథకాలు
  5. ఇతర పథకాలు

2. పట్టణ ఉపాధి పథకాలు

  • పట్టణాలలో స్వయం ఉపాధి, వేతనోపాధి పథకాలు ఒక్కటే.

1.SEPUP (Self Employment Programme for Urban Poor) - 1986:

  • IRDP అమలు కాని 10,000 జనాభా మించని పట్టణ ప్రాంతాలలో దీనిని అమలుపరిచెను. తర్వాత ఇది NRY లో భాగం అయినది

2. నెహ్రూ రోజ్‌గారి యోజన (NRY) -1989:

  • పట్టణ పేదల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు దీన్ని ప్రారంభించెను. ఇది స్వయం ఉపాధి మరియు వేతనోపాధి పథకం.

3. UBSP (Urban Basic Services for Poor) 1990-91:

  • పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో ఉన్న ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రారంభించబడెను

4. PMIUPEP (Prime Minister Integrated Urban Poverty Eradication Programme) -1995

  • పట్ట ఆపంతాలలో పేదరికానికి గల మూలకారణాలను పరిశీలించి నిర్మాలించుటకు ఉద్దేశించబడినది.

5. స్వర్ణజయంతి సహారి రోజ్‌గార్‌ యోజన (SJSRY):

  • దాని అనుబంధ పథకాలైన NRY + UBSP + PMIUPEP లను విలీనం చేసి 1997 డిసెంబర్‌ 16న ప్రవేశపెట్టెను. దీనిని కేంద్ర, రాష్ట్ర నిధులు 75:25. 2009 ఏప్రిల్‌లో దీన్ని పునర్నిర్మించెను/ప్రక్షాళన చేశారు.దీనిలో ఐదు అంశాలు కలవు.

a) USEP (Urban Self Employment Programme) :

  • పట్టణ పేదలకు సబ్సిడీపై రుణాలు అందించుట ద్వారా స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునేందుకు ఉద్దేశించబడింది.

b) UWSP (Urban Women Selfhelp Programme)

  • పట్టణ పేద మహిళల స్వయం ఉపాధికి చెందినది.

c) STEP (Skilled Training for Employment Promotion amongst Urban Poor) :

  • పట్టణ పేదలకు వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు, అధిక వేతనాన్ని పొందేందుకు శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించబడినది.

d) UWEP (Urban Wage Employment Programme) :

  • పట్టణాలలో సాంఘిక, ఆర్థిక పబ్లిక్‌ ఆస్తులను ఏర్పాటు చేయుట ద్వారా పేదలకు వేతపోపాధి అందించేందుకు ఉద్దేశించబడింది

e) UCDN (Urban Community Development Network):

  • పేదరికాన్ని తగ్గించేందుకు, పేదల్లో చైతన్యాన్ని కలిగించేందుకు స్వయంగా నిర్వహించబడే కమ్యూనిటీ నిర్మాణానికి ' సంబంధించినది

6. VAMBAY (Valmiki Ambedkar Aawas Yojana) -2001 :

  • పట్టణాలలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండి మురికివాడల్లో జీవించేవారికి గృహవసతి కల్పించే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. పట్టణాలలో సామాజిక మరుగుదొడ్లు నిర్మించి ఆరోగ్యకర వాతావరణాన్ని ఏర్పరిచేందుకు “నిర్మల్‌ భారత్‌ అభియాస్‌”ను కూడా దీనిలో భాగంగా ఏర్పరిచారు.

7. JNNURM (Jawaharlal Nehru National Urban Renewal Mission) :

  • దీనిని 2005-006లో 7 సంలు అమలులో ఉండేట్లు ప్రారంభించెను. దీనిలో 2 భాగాలు కలవు

i) BSUP (Basic Services for Urban Poor):

  • ఇది ఎంపిక చేసిన 65 నగరాల్లో గృహ నిర్మాణానికి, అవస్థాపనా సౌకర్యాలకు ఉద్దేశించబడినది

ii) IHSDP(Integrated Housing and Slum Development Programme):

  • BSUP క్రిందకు రాని నగరాలలో గృహ నిర్మాణానికి, మురికివాడల అభివృద్ధికి ఇది ఉద్దేశించబడినది

8. RAY (Rajiv Aawas Yojana):

  • గ్రామాల్లో ఇందిరా ఆవాస్‌ యోజన ఉన్నట్టే పట్టణ పేదలకు ముఖ్యంగా మురికివాడల్లో నివసించేవారి ఇండ్ల నిర్మాణానికి ఇది ఉద్దేశించబడింది
3. అఖిల భారత స్థాయి పథకాలు  (All India Programmes)

1. SEEUY (Self Employment to Educated Unemployed Youth) -1983 :

  • అఖిల భారత స్థాయిలో విద్యావంతులైన నిరుద్యోగులకు స్వయం ఉపాధినందించడానికి దీన్ని ప్రారంభించారు.

2. ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన (PMRY) :

  • SEEUY ని పునర్నిర్మించి 1993లో PMRY గా ఏర్పాటు చేసెను. ఇది కూడా స్వయం ఉపాధి పథకమే. తర్వాత ఇదిPMEGP లో విలీనమైంది

3. PMEGP (Prime Minister Employment Generation Programme):

  • PMRY (1993), REGP (1995) పథకాలను విలీనం చేసి 2008 సెప్టెంబర్‌లో PMEGP ని ప్రారంభించెను. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు ఇది సహాయపడెను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీన్ని Ministry of Micro Small Medium Enterprises వారు మరియు Khadi Village Industries Commission వారు కలిసి అమలు చేస్తున్నారు.

నోట్‌ : ఎ). Khadi Village Industries Act (1956) ప్రకారం  Khadi Village Industries Commission ఏర్పడింది.

బి) ఈ కమీషన్‌ 1995లో Rural Employment Generation Programme (REGP) ప్రారంభించింది. ఇది 2008లో PMEGP విలీనమైంది

4. సామాజికభద్రతా పథకాలు

1. జాతీయ సామాజక సహాయక పథకం (NSAP - National Social Assistance Programme) (1995):

  • ఇది 100% కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిలో ౩ భాగాలు కలవు.

a) NOAPS - National Old Age Pension Scheme

  • దీనిలో పేదరికపు రేఖకు దిగువన ఉన్న వృద్ధులకు నెలకు 200/- చొప్పున పింఛనుగా ఇవ్వబడుతోంది. దీని అర్హత వయసు 2011-12 బడ్జెట్‌లో 60 సం॥లకు తగ్గించారు. 80 సం॥లు దాటిని వారికి రూ. 500/  పింఛను. ఇస్తారు

b) NFBS (National Family Benefit Scheme) :

  • కుటుంబాలలో ప్రధాన ఆహార సంపాదకుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తారు 
  • నోట్‌ : మన రాష్ట్రంలో “ఆపద్బాందు” పథకం, కింద ఆకస్మిక మరణాలకు రూ: 1,00,000లు ఇచ్చేవారు. తరువాత దీన్నే రూ.50,000లకు తగ్గించారు.

c) National Maternity Scheme:

  • 19 సం॥లు దాటిన స్త్రీకి ఇద్దరు పిల్లల వరకు కాన్పుల సమయంలో రూ. 500/- ఆర్థిక సహాయం అందిస్తారు

2) అన్నపూర్ణ (2000):

  • ఇది 100% కేంద్ర ప్రభుత్వ పథకం. దీనిలో పేదలైన వృద్ధులకు 10 కేజీల ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వబడతాయి

3) అంత్యోదయ అన్నయోజన (AAY 2000 December):

  • పేదల్లో నిరుపేదలను గుర్తించి అధిక సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందిస్తారు. బియ్యం కేజీ ౩ రూ॥లు, గోధుమ కేజీ రూ.2

4) రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన (RSBY):

  • 2007 అక్టోబర్‌ 1న ఇది ప్రారంభమైంది. అవ్యవస్థీకృత రంగంలో ఉన్న బిపిఎల్‌ కుటుంబాల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఇది. దీనిలో రూ.80,000 బీమా అందిస్తారు. కేంద్ర రాష్ట్రాలు నిధులను 75:25 నిష్పత్తిలో అందిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 90:10

5) ఆమ్‌ ఆద్మీ బీమా యోజన (AABY):

  • 2007 అక్టోబర్‌ 2న ప్రారంభించారు
  • భూమి లేని పేద కుటుంబాలకు ఇది వర్తిస్తుంది
  • సహజ మరణాలు, ప్రమాదవశాత్తు మరణాలకు, పాక్షిక లేదా పూర్తి అంగవైకల్యం పొందినవారికి వర్తిస్తుంది.
  • దీనిలో సహజ మరణానికి .రూ.80,000లు, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యానికి రూ.37,500 ప్రమాదవశాత్తు సంభవించే మరణానికి, పూర్తి అంగవైకల్యానికి రూ. 75,000లు బీమా సౌకర్యం అందిస్తారు. సం॥నకు చెల్లించే ప్రీమియంలో కేంద్ర, రాష్ట్రాలు 50:50గా భరిస్తాయి.

6) ఉజ్వల :

  • లైంగిక వృత్తిలో వున్న మహిళలకు పునరావాసం కల్పించేందుకు 2007లో దీన్ని ప్రారంభించారు

7) "Unorganized Works Social Security Act-2008"

  • అవ్యవస్థీకృత రంగంలో పని చేసే వారి రక్షణకై "Unorganized Works Social Security Act-2008" చేయడం జరిగింది. ఇది 2009 నుండి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం జాతీయస్థాయిలో జాతీయ సాంఘిక భద్రతా బోర్డు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సాంఘిక భద్రతా బోర్డు ఏర్పడి అవ్యవస్థీకృత రంగంలో పని చేసే శ్రామికులను రక్షణ కల్పిస్తుంది

5. ఇతర పథకాలు

1.CDP (Community Development Programme)- (సామాజిక అభివృద్ధి పథకం):

  • మొదటి ప్రణాళికలో 1952లో సిడిపిని ప్రారంభించారు

2. SFDA  (Small Farmers Development Agency)-1969-70:

  • చిన్న రైతులకు పరపతి సౌకర్యాలను అందించేందుకు ఇది ఉద్దేశించబడింది.
  • నోట్‌: ఉపాంత రైతులు : 0-1 హెక్టారు భూమిగలవారు, చిన్న రైతులు : 1-2 హెక్టార్లు భూమి కలిగినవారు.

3. EGS  (Employment Gurantee Scheme)-1972-73:

  • పని హక్కును గుర్తిస్తూ ఉపాధి హామీ కల్పించి మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది

4. MFAL (Marginal Farmers and Agricultural Labour)-1973-74:

  • సబ్సిడీ ద్వారా పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమల ఏర్పాటుకు ఇది సహాయపడును

5. DPAP (Drought Prone Area Programme)-1973: 

  • కరవు ప్రాంతాల అభివృద్ధి కోసం

6. RWP (Rural Work Programme)-1970-71:

  • క్షామ పీడిత ప్రాంతాల్లో రైతుల అభివృద్ధి కోసం

7. CADP (Command Area Development Programme):

  • భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల క్రింద నీటిపారుదల సౌకర్యాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు ఉద్దేశించబడింది. ప్రస్తుతం ఇది Command Area Development and Water Management Programme)6 గా మార్చబడింది

8. MNP (Minimum Need Programme)-1974:

  • గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కనీస అవసరాలైన త్రాగునీరిఉ, రోడ్ల నిర్మాణం, ఆరోగ్య సదుపాయాలు, డైనేజీ వ్యవస్థ ఏర్పాటు, విద్యుత్‌ సౌకర్యాల కల్పన వంటివి తీర్చేందుకు ఇది ఉద్దేశించబడింది

9. Twenty Points Programme(TPP 20 సూత్రాల పథకం ) :

  • పేదరిక నిర్మూలనకు, ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు 1975లో ఇందిరాగాంధీ తొలిసారిగా దీన్ని ప్రవేశపెట్టారు. 1982, 1986 2006లో దీనిని సవరించారు.

10. DDP (Desert Development Programme)(ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం 1977-78):

  • ఎడారిగా మారుతున్న ప్రాంతాల అభివృద్ధికి ఇది ఉద్దేశించబడింది.

11. అంత్యోదయ కార్యక్రమం (1977):

  • గ్రామీణ ప్రాంతాల పేదల్లో నిరుపేదలను గుర్తించి వారి అభివృద్ధికి ఉద్దేశించబడినది. ఇది రాజస్థాన్‌లో ప్రవేశపెట్టబడింది.

12. CAPART (Council for Advancement Peoples and Rural Technology)-1986:

  • గ్రామీణ ప్రాంతాల్లో పరిశోధన డిజైనింగ్‌ సాంకేతిక పరిజ్ఞాన విభాగంలోసహాయానికై దీనిని ప్రారంభించారు.

13. IAY (ఇందిరా ఆవాస్‌ యోజన)-1985-86:

  • RLEGP కి ఉపపథకంగా ప్రారంభమైంది. తర్వాత ౮గ/లో భాగం అయింది. 1996 నుండి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. గృహనిర్మానానికి అందించే ఆర్థిక సహాయాన్ని 2010-11 బడ్జెట్‌లో మైదాన ప్రాంతాల్లో రూ.45,000లకు, కొండ ప్రాంతాల్లో రూ.48,500/-లకు పెంచెను

14. PMGSY (ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన) 2000 డిసెంబర్‌: 

  • గ్రామీణ ప్రాంతాల్లో అన్ని కాలాల్లో పనికివచ్చే విధంగా రోడ్లు నిర్మించడం దీని ప్రధానోద్దేశం మైదాన ప్రాంతాల్లో 500 జనాభా గల నివాసాలను అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మించగా, కొండ ప్రాంతాల్లో 250 జనాభా గల నివాసాలను అనుసంధానం చేస్తూ రోడ్లు నిర్మిస్తారు. డీజిల్‌ సెస్‌ ద్వారా వచ్చే ఆదాయం నుండి దీనికి నిధులు సమకూరుస్తారు.
  • నోట్‌ : భారత్‌ నిర్మాణ్‌ పథకంలో మైదాన ప్రాంతాల్లో 1000 మంది, గిరిజన ప్రాంతాలలో 500 మంది కంటే ఎక్కువ ఉంటే అక్కడ రోడ్లు నిర్మిస్తారు.

15: PMGSY (ప్రధానమంత్రి గ్రామోదయ యోజన-2000) :

  • ఐదు రంగాల్లో మానవాభ్యుదయాన్ని సాధించేందుకు “దీన్ని ప్రారంభించారు. విద్య,ఆరోగ్యం, పౌష్టికాహారం,త్రాగునీరు, గృహా నిర్మాణం, గ్రామీణ విద్యుదీకరణ (తర్వాత కాలంలో 6వ అంశాన్ని చేర్చారు)

16. భారత్‌ నిర్మాణ్‌ (2005-06):

  • గ్రామీణ, పట్టణాల మధ్య అంతరాలను తగ్గిస్తూ (గ్రామాల్లో 6 అంశాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఇది ఉద్దేశించబడింది. 2010-11 బడ్జెట్‌లో దీనికి 48 వేల కోట్లు కేటాయించెను. 2011-12లో 58,000 కోట్లకు పెంచెను. 6 అంశాలు : త్రాగునీరు, నీటిపారుదల, గ్రామీణ గృహవసతి, గ్రామీణ రోడ్డు, గ్రామీణ విద్యుత్‌, గ్రామీణ టెలిఫోన్‌

17. BRGF (Backward Region Grand Fund):

  • స్థానిక అవస్థాపనా సౌకర్యాలలో గల వ్యత్యాసాలు తొలగించేందుకు, ప్రాంతీయ అసమానతలు తగ్గించేందుకు దీన్ని ప్రారంభించెను

18. స్వావలంబన్‌:

  • 2010-11 బడ్జెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ దీన్ని ప్రకటించారు
  • అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారికి పొదుపును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. 
  • దీని ద్వారా లబ్ధి పొందాలంటే నూతన పింఛను పథకంంలో అకౌంట్‌ కలిగి వుండాలి
  • సంవత్సరానికి కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.12,000లు పొదుపు చేయాలి. వీరికి ప్రభుత్వం సం॥నకు రూ. 1000లు డిపాజిట్‌ చేస్తుంది.

19. PMAGA (ప్రధానమంత్రి ఆదర్శ గ్రామయోజన) :

  • 2009-10 బడ్జెట్‌లో ప్రణబ్‌ ముఖర్జీ ప్రకటించారు.
  • ఎస్సీ జనాభా అధికంగా గల వెయ్యి గ్రామాల అభివృద్ధికి చెందినది.

విన్నపం: మీకు ఇంకా ఏమైనా పథకాల గురుంచి తెలిస్తే adhvithkiran@gmail.com కు మెయిల్ చేయగలరు లేదా కామెంట్ సెక్షన్ లో పేర్కొనగలరు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)