వృద్ధి-అభివృద్ధి

Adhvith
0
Indian Economy Study Materian in Telugu

Growth & Development

ప్రతి దేశం ఆర్థికాభివృద్ధిని చేరుకున్న తర్వాత మాత్రమే వృద్ధిని చేరుకోవడం జరుగుతుంది. ఉత్పత్తిలోని పెరుగుదలనే వృద్ధి అంటారు. ఆర్థికాభివృద్ధిలో అవస్థాపన సౌకర్యాలు, వ్యవస్థాపనా సౌకర్యాలు, సాంకేతిక సౌకర్యాలు కల్పించవలసి ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా నిదాన మరియు సత్వర వృద్ధిని సాధించాలంటే తప్పకుండా ఆర్థికాభివృద్ధిని చేరుకోవాల్సిందే. వృద్ధి అనే పదంలో ఒకే ఒక అంశం (ఆదాయం) పరిగణనలోకి తీసుకుంటారు. దీనిని ఏకముఖ వ్యూహం అంటారు. ఆర్థికాభివృద్ధిలో అనేక అంశాలు (బహుముఖ వ్యూహం) ఉంటాయి. కాబట్టి వృద్ధి కంటే ఆర్థికాభివృద్ధి సమస్యాత్మకమైనది. వర్ధమాన దేశాలన్నీ ఆర్థికాభివృద్ధిలోనే ఉన్నాయి. కిండ్లే  బర్గర్‌ ప్రకారం వృద్ధి అనేది మనిషి యొక్క శారీరక పెరుగుదలతో పోల్చబడితే,.. ఆర్థికాభివృద్ధిని మనిషి శారీరక మరియు మానసిక అంశాలతో పోల్చబడుతుంది. అనేక మంది ఆర్థికవేత్తలు వృద్ధి, ఆర్ధికాభివృద్ధికి మధ్య తేడా లేదని భావించారు. షుంపీటర్‌ & ఉర్సుల హిక్స్‌ ప్రకారం రెండింటి మధ్య తేడా ఉంది. చమురు దేశాలు ఆర్థికాభివృద్ధిని సాధించకుండానే వృద్ధిని చేరుకున్నాయి.

ఆర్ధికవృద్ధి (Growth):

  • దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల.
  • ఇది పరిమాణాత్మక మార్పును తెలుపును.
  • ఉదా : దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల.
  • దీర్ధకాలంలో తలసరి వాస్తవ స్టూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదల.
  • జాతీయోత్పత్తి 'పెరుగుదల వ్యాపార చక్రాల వలన తాత్కాలికంగా పెరగవచ్చు కాని, అసలైన వృద్ధి కాదు. జాతీయోత్పత్తి పెరుగుదల దీర్ధకాలంగా కొనసాగాలి.

ఆర్ధికాభివృద్ధి(Development)

  • దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పు - ఆర్థికాభివృద్ధి
  • ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఉత్పాదక 'పెరుగుదల

                                = ఆర్థికవృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పంపిణీ

                                = వృద్ధి + సంక్షేమం

ఆర్ధికాభివృద్ధి నిర్వచనాలు 

  1. గున్నార్‌ మిర్దాల్‌ : మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతిపథంలో ముందుకు సాగడమే ఆర్థికాభివృద్ధి
  2. జూన్‌ రాబిన్‌సన్‌ : దేశం ఆర్థికాభివృద్ధిని దాటి వృద్ధిని చేరుకుంటే అది స్వర్ణయుగం
  3. గెరాల్డ్‌ మేయర్‌ : దీర్హకాలంలో తలసరి. ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థికాభివృద్ధి
  4. హేగెన్‌ : ఆర్థికాభివృద్ది అంతులేకుండా నిత్యం జరిగే ప్రక్రియ
  5. కొలిన్‌ క్లార్క్‌ : వ్యవసాయరంగంలో ప్రజలు పారిశ్రామిక, సేవల రంగానికి నిరంతరంగా తరలిపోవడం 
  6. సి ఇ బ్లాక్‌ అనేక ఆధునీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి
  7. ఆచార్య మైఖేల్‌ పి.తోడారో : ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ
  8. జె.ఇ.మేయర్‌, జె.ఇరాచ్‌: తలసరి జాతీయదాయం దీర్ధకాల పెరుగుదల ఆర్థికాభివృద్ధి ప్రక్రియ 
  9. డడ్లీ శీర్స్‌: పేదరికాన్ని అసమానతలను, నిరుద్యోగితను వాటి అధిక స్థాయిల నుంచి తగ్గించితే దానిని అభివృద్ధి కాలమంటారు

ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉన్న అంశాలు

  1. తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల
  2. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం
  3. పేదరికం ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరుగుట
  4. సంస్థాగత సాంకేతిక మార్పులు వచ్చుట
  5. పైవన్నీ దీర్హకాలంలో కొనసాగుట
  • ఉదా : లాటిన్‌ అమెరికాలోని లైబిరియా అరటిపండ్ల ఎగుమతి ద్వారా, అరబ్‌ దేశాలు పెట్రోలియం ఎగుమతి ద్వారా జాతీయాదాయం తలసరి ఆదాయం పెరిగినప్పటికి స్వయం సమృద్ధి సాధించలేదు.
  • రాబర్ట్‌ క్లేవర్‌ Growth without Development అనే గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఎలా జరుగుతుందో చెప్పాడు. దీని వలన ఆ దేశ ప్రతిఫలాలు కొద్దిమందికే అందుచున్నవి. సామాన్య ప్రజానీకం పేదరికంలో మగ్గుచున్నారు.

ఆర్థికవృద్ధి- ఆర్థికాభివృద్ధి మధ్య గల వ్యత్యాసాలు

  • ప్రారంభంలో ఈ పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించేవారు.
  • శ్రీమతి హిక్స్‌ & షుంపీటర్‌ ఈ పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సూచించారు.
  • వృద్ధి అభివృద్ధి అనే పదాలు 1960లో ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఆర్థికవృద్ధి

  1. ఉత్పత్తి పెరుగుదలలో మార్పులు
  2. ఇది పరిమాణాత్మకమైనది
  3. దీనిని కొలవవచ్చు
  4. ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు.
  5. ఇది దుగ్విషమైనది/ఏకముఖమైనది.
  6. ఇది సంకుచితమైనది/ఇది సూక్ష్మ (Micro) స్వభావం కలది.
  7. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుంది 
  8. సంస్థాగత మార్పులు లేకుండా పెరుగుదలను సూచిస్తుంది
  9. కిండర్ బర్గర్‌ ప్రకారం వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్చు తెలిపేది.
  10. ఇది స్వల్ప కాలానికి సంబంధించినది.
  11. పంపిణీని సూచించదు. 
  12. ఆదాయం, సంపద మొదలైనవాటి పంపిణీని తెలుపదు.
  13. ప్రభుత్వం యొక్క జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను ఆర్థికవృద్ధిగా వర్ణించవచ్చు.
  14. ఆర్థికవృద్దిని ఆదాయం లేదా సంపదతో అంచనా వేస్తారు. 
  15. ఆర్థికవృద్ధితో ఆర్థిక మార్పులను సాధించవచ్చు. కాని సామాజిక మార్పులను సూచించదు. 

ఆర్థికాభివృద్ధి

  • 1. ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత, సాంకేతిక, అవస్థాపక, వ్యవస్థాపక సూచిస్తుంది.
  • 2. ఇది గుణాత్మకమైనది.
  • 3. దీనిని కొలవలేము.
  • 4. ప్రభుత్వ ప్రమేయం అవసరం.
  • 5.ఇది బహుముఖమైనది.
  • 6. విస్సతమైనది/ఇది స్థూల (Macro) స్వభావం కలది
  • 7. ఇది అభివృద్ధి చెందుతున్న (వర్ధమాన దేశాలకు) దేశాలకు వర్తిస్తుంది 
  • 8. సంస్థాగత, సాంకేతి మార్పులు సూచిస్తుంది
  • 9. శారీరక పెరుగుదలతో పొటు మానసిక పరిపక్వతను కూడా సూచిస్తుంది 
  • 10. ఇది దీర్ఘకాలానికి సంబంధించినది.
  • 11. ఫంపిణిని సూచిస్తుంది
  • 12. ఆదాయం, సంపద మొదలైనవాటి పంపిణీని ఆర్థికాభివృద్ధి తెలియజేస్తుంది.
  • 13. ప్రభుత్వం యొక్క విధానాల ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా వివిధ మార్పులు చేసి సాధించే దానినే ఆర్థికాభివృద్ధిగా వర్ణించవచ్చు.
  • 14. ఆర్థికాభివృద్ధిని గుణాత్మకంశాలైన నిరుద్యోగము, పేదరికం, మానవ వనరుల అభివృద్ధి, జీవన ప్రమాణస్థాయి మొదలైన వాటిలో వచ్చిన మార్పుల ఆధారంగా అంచనా వేస్తారు.
  • 15. ఆర్థికాభివృద్ధితో ఆర్థిక మార్పులతో పాటు కానీ సామాజిక మార్పులు సాధించవచ్చు లేదా మార్పు సాధించవచ్చును.

అల్పాభివృద్ధి దేశాల లక్షణాలు (Characteristics of Under Development Countries)

1) మూలధనం కొరత: అల్పాభివృద్ధి/ అభివృద్ధి చెందుతున్న / వెనుకబడిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువ కాబట్టి పొదుపు సామర్థ్యం కూడా తగ్గును. ఫలితంగా మూలధనం కొరత ఏర్పడును.

  • షుంపీటర్‌: ఆర్థికాభివృద్ధికి అవసరమైన చొరవతో ముందుకు వచ్చే వ్యవస్థాపకుల కొరత వల్ల కూడా పెట్టుబడి తక్కువ స్థాయిలో ఉండును అన్నాడు.
  • కొద్దిమంది ధనవంతులకు వడ్డీలు, భాటకం రూపంలో ఆదాయం వచ్చిన వారు ఆడంబర వినియోగంపై ఖర్చు చేస్తారు. కొని పొదుపు చేసి పెట్టుబడులు పెట్టరు.
  • India లో తక్కువ (తలసరి) ఆదాయం వల్ల, అధిక వినియోగ వ్యయం వల్ల పొదుపుస్థాయి తక్కువగా ఉంది.
  • మన దేశంలో తలసరి మూలధన లభ్యత తక్కువగా ఉంది.
  • మూలధన కల్పన రేటు కూడా తక్కువగా ఉంది.
  • ఈ మధ్య కొలంలో మూలధన కల్ఫన రేటు పెరిగింది. ఇది కోరదగిన మంచి పరిణామంగా చెప్పవచ్చు.
  • 1950-51 GDPలో పొదుపు శాతం 8.6% గా ఉండేది.
  • 2007-08 GDPలో పొదుపులు గరిష్టంగా 36.8% పెరిగింది.
  • 2012-13 GDP లో పొదుపులు 31.8% కు చేరింది.
  • స్థూల దేశీయ పొదుపుకి ప్రభుత్వరంగం, కార్పొరేట్‌ రంగం, గృహ రంగం నుండి పొదుపు వనరులు లభ్యమవుతున్నాయి. వీటిలో ఎక్కువ గృహరంగం నుండి లభిస్తుంది.
  • 2013-14లో స్టూల దేశీయ పొదుపు 30.6% కాగా - ఇందులో మొదటి స్థానం గృహ రంగానిది 18. 2%గా
  • ఉంది. 10.9% కొర్పారేట్‌ రంగానిది 2వ స్థానం.
  • స్ధిర మూలధన కల్పన పెట్టుబడి కూడా పెరుగుతూ వస్తుంది.
  • 2013-14 నుండి పెట్టుబడిలో అత్యధిక వాటా కార్పొరేట్‌ రంగానిదే (12.6%) తర్వాత స్థానం గృహ రంగానిది (10.7%).

భివృద్ధి - ఆటంకాలు

  1. దేశీయ ఆటంకాలు - 2 రకాలు 
  2. విదేశీ ఆటంకాలు

దేశీయ ఆటంకాలు

ఎ) ఆర్థిక అంశాలు/ కారకాలు

బి) ఆర్థికేతర కారకాలు/ అంశాలు

1. సహజవనరులు - అల్పవినియోగం

2. మానవ వనరులు- నైపుణ్యత కొరవడి

3. మూలధనం కొరత

4. పేదరిక విషవలయాలు

5. అల్ప సాంకేతిక పరిజ్ఞానం

6. మార్కెట్‌ అసంపూర్ణతలు.

  • శ్రమ విభజన లేకపోవుట
  • ఉత్పత్తి కారకాల గమన శీలత లేకపోవుట
  • ఏకస్వామ్య ధోరణులు.
  • ధరల ధృడత్వం ఉండుట.
  • మార్కెట్‌ సమాచారం అందుబాటులో లేకపోవుట.

1. కులతత్వం

2. మతతత్వం

3. సాంఘీక ఆచార వ్యవహారాలు

4. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

5. సుస్థిర ప్రభుత్వాలు లేకపోవుట

2) విదేశీ కారకాలు :

  1. గతంలో వలసవాదానికి గురి కాబడటం.
  2. ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం.
  3. అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం.

ఆర్థికాభివృద్ధికి ఆధారాలు

ఆర్థిక కారకాలు/అంశాలు:

  1. సహజ వనరులు 
  2. మూలధనం (Human Capital)
  3. మూలధన కల్పన - (Capita Formation)
  4. సాంకేతిక పరిజ్ఞానం (Technology)
  5. ఉత్పాదకత - (Productivity)
  6. వ్యాపారం - (Trade)
  7. సహాయం - (Aid)

ఆర్థికేతర అంశాలు:

  1. సాంఘీక ఆచార వ్యవహారాలు 
  2. సాంస్కృతిక దృక్పధాలు 
  3. రాజకీయ పరిస్థితులు
  4. నైతిక విలువలు మొ.నవి

విదేశీ వ్యాపారం :

  • సాదారణంగా అల్పాభివృద్ధి దేశాలు ముడిసరుకులు, ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేసి వినియోగ వస్తువులు/మూలధన వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. దీని వలన దేశీయ పరిశ్రమలు దెబ్బతినును
  • మనదేశం ముడిసరుకులు ఎగుమతి చేసే స్థాయి నుండి ఇంజనీరింగ్‌ వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
  • భారత ఆర్థికవ్యవస్థలో అల్పాభివృద్ధి ఆర్థికవ్యవస్థ లక్షణాలు ఉన్నప్పటికీ, ప్రణాలికలు అమలుపరచి అభివృద్ధి దిశగా పయనించుట వల్ల పరిమాణాత్మక, వ్యవస్థాపూర్వక మార్పులు వచ్చాయి. అందుకు మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలువవచ్చును.

ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు :

  • 1) అభివృద్ది చెందిన దేశాలు
    • ఉదా: USA, U.K, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌ మొ.వి
  • 2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
    • ఉదా: భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌
  • 3) తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు
    • ఉదా: భూటాన్‌, నేపాల్‌, ఆఫ్ఘనిస్థాన్, సూడాన్ మొ.వి

Keywords: Tspsc economy notes in telugu,tspsc indian economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,economy notes,tspsc indian economy notes in telugu,group 2 indian economy notes in telugu,tspsc indian economy study material in telugu,group 2 indian economy study material in telugu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)