జాతీయాదాయ భావనలు

Adhvith
0
Indian Economy National Income Study Material in Telugu

జాతీయాదాయ భావనలు (Concepts of National Income):

స్థూల, నికర ఉత్పత్తి, దేశీయ, జాతీయ ఉత్పత్తుల సహాయంతో ఆర్థికవేత్తలు 4 రకాల జాతీయాదాయ భావనలు వ్యక్తపరిచిరి

  1. స్థూల దేశీయోత్పత్తి - Gross Domestic Product (GDP)
  2. స్థూల జాతీయోత్పత్తి - Gross National Product (GNP)
  3. నికర దేశీయోత్పత్తి - Net Domestic Product (NDP)
  4. నికర జాతీయోత్పత్తి - Net National Product (NNP)

  • ప్రతి భావనను మరల మార్కెట్‌ ధరలలోను, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టా గణిస్తారు. అట్లాంటప్పుడు మొత్తం 8 భావనలు వస్తాయి.

  1. మార్కెట్‌ ధరలలో స్థూల దేశీయోత్పత్తి (GDPMP)
  2. మార్కెట్‌ ధరలలో స్థూల జాతీయోత్పత్తి (GNPMP)
  3. మార్కెట్‌ ధరలలలో నికర దేశీయోత్పత్తి (NDPMP)
  4. మార్కెట్‌ ధరలలో నికర జాతీయోత్పత్తి (NNPMP)
  5. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి (GDPFC)
  6. ఉత్పత్తికారకాల ఖరీదు దృష్ట్యా దృష్ట్వాస్థూల జాతీయోత్పత్తి (GNPFC)
  7. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి (NDPFC)
  8. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి (NNPFC)

1. మార్కెట్‌ ధరలలో స్థూల దేశీయోత్పత్తి (GDPMP)

  • ఒక దేశంలో (ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల (లేదా) ఒక ఆర్థిక వ్యవస్థలోపల) ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన. అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటారు.

            GDPMP = C + I + G + (X-M)

ఇందులో C = వినియోగం (Consumption)

I = పెట్టుబడి (లేదా) స్థూల దేశీయాదాయం పెట్టుబడి (లేదా) సమగ్ర దేశీయ పెట్టుబడి (లేదా) మొత్తం దేశీయ పెట్టుబడి (Investment)

G = ప్రభుత్వ సేవల విలువ (లేదా) ప్రభుత్వ వ్యయం

X = ఎగుమతులు (Exports)

M = దిగుమతులు (Imports)

X - M అనగా నికర ఎగుమతులు (లేదా) నికర విదేశీ వ్యాపార రాబడి (లేదా) నికర విదేశీ పెట్టుబడి GDP = C + I + G + (X-M) లో

మొత్తం పెట్టుబడి = సమగ్ర దేశీయ పెట్టుబడి + నికర విదేశీ పెట్టుబడి.

మొత్తం పెట్టుబడి = I + (X-M)

  • GDP ని లెక్కించేటప్పుడు వస్తు సేవల స్థూల ఉత్పత్తి విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువను (Value of Inputs) తీసివేస్తే కలుపబడిన స్థూల విలువ (GVA) తెలుస్తుంది.
  • కలుపబడిన స్థూల విలువ = స్థూల ఉత్పత్తి విలువ - ఉత్పాదకాల విలువ
  • GVA = GVO (Gross Value Output) - Value of Inputs
  • ఒక దేశంలో GVA అనగా GDP
  • ఒక రాష్ట్రంలో GVA అనగా GSDP (Gross State Domestic Product)
  • ఒక జిల్లాలో GVA అనగా GDDP (Gross District Domestic Product)
  • సాధారణంగా GVA అనగా GDP

2. మార్కెట్‌ ధరలలో స్థూల జాతీయోత్పత్తి (GNPMP)

  • ఒక దేశ పౌరుల చేత (ఒక జాతీయుల) చేత ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే స్థూల జాతీయోత్పత్తి అంటారు.

GN{P_{MP}}\; = \;{\rm{ }}GD{P_{MP}}\; + \left( {R - P} \right)\;
GN{P_{MP}}\; = {\rm{ }}C + I + \left( {X - M} \right) + \left( {R - P} \right)
GD{P_{MP}}\; = {\rm{ }}GN{P_{MP}}\; - {\rm{ }}\left( {R -  - P} \right)
GD{P_{MP}}\; = {\rm{ }}GN{P_{MP}}\; - {\rm{ }}\left( {R + P} \right)
GN{P_{MP}}\; - {\rm{ }}GD{P_{MP}}\; = {\rm{ }}R - P\;\;

  • R = విదేశాల నుంచి వచ్చిన కారక ఆదాయం (Factor)
  • P = విదేశాలకు చేసే కారక చెల్లింపులు (Factor payments to abrade)
  • R-P = నికర విదేశీ కారక ఆదాయం అనగా NFIA
  • NFIA = Net Factor Income from Abrade in the from of wages interest, Profits and Dividends
  • GN{P_{MP}}\; = \;{\rm{ }}GD{P_{MP}}\; + {\rm{ }}NFIA\;
  • GD{P_{MP}}\; = \;{\rm{ }}GN{P_{MP}}\; - {\rm{ }}NFIA
  • GN{P_{MP}}\; - {\rm{ }}GD{P_{MP}}\; = {\rm{ }}NFIA  (లేదా) (R-P) (లేదా) నికర విదేశీ కారక ఆదాయం
  • నికర విదేశీ కారక ఆదాయం GNPMP లో వుంది GDPMP లో లేదు.
  • స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తికి మధ్యగల వ్యత్యాసమే నికర విదేశీ కారక ఆదాయం.
  • స్థూల దేశీయోత్పత్తికి నికర విదేశీ కారక ఆదాయాన్ని చేర్చితే స్థూల జాతీయోత్పత్తికి తెలుస్తుంది.
  • స్థూల జాతీయోత్పత్తి నుండి నికర విదేశీ కారక ఆదాయాన్ని తీసివేస్తే జాతీయోత్పత్తి తెలుస్తుంది.
  • నికర విదేశీ కారక ఆదాయం GNPMPలో చేర్చబడి వుంది, GDPMP లో తొలగించబడి వుంది.
  • నికర విదేశీ కారక ఆదాయం శూన్యమయితే GNPMP, GNPMP లు సమానం
  • GN{P_{MP}}\; = {\rm{ }}GD{P_{MP\;}}\left( {R - P = O} \right)
  • నికర విదేశీ కారక ఆదాయం ధన్మాతకమయితే  GNPMP > GDPMP (స్థూల దేశీయోత్పత్తి కన్నా స్థూల జాతీయోత్పత్తి ఎక్కువ)
  • నికర విదేశీ కారక ఆదాయం రుణాత్ముకమైతే GNPMP < GDPMP (స్థూల దేశీయోత్పత్తి కన్నా స్థూల జాతీయోత్పత్తి తక్కువ)

GNP, GDP మధ్య తేడా

GDPMP 

  1. దేశీయ భూభాగంలో జరిగే ఉత్పత్తిని తెలుపును
  2. దీనిని దేశీయులు గాని, విదేశీయులు గాని చెప్పవచ్చు 
  3. ఇది సంకుచిత భావన
  4. ఇది ప్రదేశానికి ప్రాధాన్యత ఇచ్చును.
  5. GDP = Value of Output in Domestic Territory Value of Intermediate Consumption
  6. GDP = GNP - NFIA
  7. NFIA విలువ రుణాత్మకమైతే GDP > GNP (Payments exceed receipts P>R)

GNPMP 

  1. ఆదేశ ప్రజలచే జరుపబదే ఉత్పత్తిని తెలుపును,
  2. ఇది Normal resident of a country అయి ఉండి ప్రపంచంలో ఎక్కడైనా ఉత్పత్తి కాబడవచ్చు.
  3.  ఇది విశాలమైన భావన
  4. ఇది పౌరులకు ప్రాధాన్యత ఇచ్చును.
  5. GNP = GDP + Net Factor Income from Abroad 
  6. GNP = GDP + NFIA
  7. NFIA విలువ ధనాత్మకమైతే GNP > GDP (Receipts exceed payments R>P)

మార్కెట్‌ ధరలలో స్థూలదేశీయోత్పత్తి (GDMMP ) నుంచి స్థిరమూలధన వినియోగం (తరుగుదల), తీసివేస్తే నికర దేశీయోత్పత్తి వచ్చును.

NDPMP =  GDMMP - తరుగుదల

NDPMP =  GDPMP - Consumption of Fixed Capital

GDPMP = NDPMP + తరుగుదల

NDPMP =  C+I+G+(X-M)-D

4. మార్కెట్‌ ధరలలో నికర జాతీయోత్పత్తి NNPMP

  • మార్కెట్‌ ధరలలో స్టూల జాతీయోత్పత్తి (GNPMP) నుంచి తరుగుదలను మినహాయిస్తే మార్కెట్‌ ధరలలో నికర జాతీయోత్పత్తి వచ్చును.
  • నికర అనగా తరుగుదల మినహాయించబడును.
  • జాతీయ అనగా NFIA దీనిలో చేరి ఉండును.
  • NNPMP = GNPMP - D తరుగుదల
  • NNPMP = NDPMP + NFIA
  • NNPMP = GDPMP + NFIA - D

NNP, GNP కి తేడా

NNPMP 

  • తరుగుదల మినహాయించబడును
  • NNPMP = GNPMP - D

GNPMP  

  • తరుగుదల కలిసి ఉండును.
  • GNPMP = NNPMP + D

NDPMP  NNPMP కి తేడా

NDPMP

  1. దేశీయ భూభాగంలో జరుగును
  2. దీనిలో NFIA చేరి ఉండదు
  3. NDPMP = NNPMP - NFIA     

 NNPMP

  1. ఆ దేశీయులచే దేశంలోపలగాని, వెలుపలగాని జరుగును
  2. దీనిలో NFIA కలిసి ఉండును.
  3. NNPMP = NDPMP + NFIA   

5. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయ ఉత్పత్తి GDPFC 

  • మార్కెట్‌ ధరల్లో స్టూల దేశీయోత్పత్తి నుండి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే లభించేదే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టా స్థూల దేశీయోత్పత్తి.
  • GDPFC  = GDPMP  - నికర పరోక్ష పన్నులు
  • GDPFC  = GDPMP  - Indirect Taxes + Subsidies
  • GDPFC = C+I+G+(X-M)- Indirect  Taxes + Subsidies

6. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి NDPFC 

  • ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టా స్థూల దేశీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా లభించేదే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్టా నికర దేశీయోత్పత్తి
  • NDPFC  = GDPFC  - తరుగుదల

7. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి GNPFC 

  • మార్కెట్‌ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి నుండి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే ఉత్పత్తి కారకాల దృష్ట్వా స్థూల జాతీయోత్పత్తి వచ్చును.
  • GNPFC = GNPMP - నికర పరోక్ష పన్నులు
  • GNPFC = GNPMP - పరోక్ష పన్నులు + సబ్సిడీలు

8. నికర జాతీయోత్పత్తి  (ఉత్పత్తి కారకాల దృష్ట్యా ) / జాతీయాదాయం NNPFC 

  •  NNPFC నే జాతీయాదాయం అందురు.
  • దేశీయ కారక ఆదాయానికి NFIA చేరిస్తే జాతీయాదాయం వస్తుంది.
  •  NNPMP  నుంచి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే  NNPFC / జాతీయాదాయం వచ్చును.
  •  GNPFC నుంచి తరుగుదల తీసివేస్తే  NNPFC వచ్చును.
  •  NNPMP కంటే,  NNPFC నిజమైన కొలమానంగా చెప్పవచ్చు. కారణం ఇది పరోక్ష పన్నుల మార్పు వల్ల ప్రభావితం కాదు.

నోట్‌: పరోక్ష పన్నులు పెరిగితే, వాస్త ఉత్పత్తి పెరగకపోయినా  NNPMP  పెరుగును. కానీ  NNPFC అనేది ఈ పరోక్ష పన్నుల వల్ల ప్రభావితం కాదు.

  •  NNPFC  = దేశీయ కారక ఆదాయం ( NDPFC ) + NFIA
  •  NNPFC =  NNPMP - నికర పరోక్ష పన్నులు
  •  NNPFC =  GNPFC - D 

జాతీయాదాయానికి సంబంధించి కొన్ని సర్టుబాట్లు చేయుట ద్వారా ప్రైవేటు రంగానికి చెందిన కొన్ని భావనలు పొందవచ్చును అవి -

  1. వ్యష్టి ఆదాయం (Personal Income)
  2. వ్యయార్దదాయం (Personal Disposable Income)

1. వ్యష్టి ఆదాయం (Personal Income)

  • ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు పొందిన ఆదాయాల మొత్తాన్ని వ్యష్టి ఆదాయం / వ్యక్తి ఆదాయం అంటారు అనగా వ్యక్తుల చేతికి వచ్చిన ఆదాయాల మొత్తం.
  • వ్యష్టి ఆదాయం = ఆర్జిత ఆదాయం + అనార్జిత ఆదాయం
  • వ్యష్టి ఆదాయం = ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వ్యక్తులకు లభించేది + ఉత్పత్తిలో పాల్గొనకుండానే వ్యక్తులకు ఉచితంగా లభించేంది.
  • వ్యష్టి ఆదాయం = ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వ్యక్తులకు లభించేది + బదిలీ చెల్లింపులు.
  • ఉత్పత్తిల్లో పాల్గొడం వల్ల వ్యక్తులకు లభించే ఆదాయం = జాతీయాదాయం - సాంఘిక భద్రత విరాళాలు -పంచిపెట్టబడని లాభాలు.
  • వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం - సాంఘిక భద్రతా విరాళాలు - పంచిపెట్టబడని లాభాలు + బదిలీ చెల్లింపులు,
  • PI = NI -SSC - U + TP
  • NI = National Income (జాతీయాదాయం)
  • SSC = Social Security Contributions (సాంఘిక భద్రత విరాళాలు)
  • U = Undistributed Properties (పంచిపెట్టబడని లాభాలు)
  • TP = Transfer of Payments (బదిలీచెల్లింపులు)
  • భవిష్యత్తు భద్రతా కొరకు ప్రజలు తమ ప్రస్తుత సంపాదనలో మినహాయించుకునే భాగమే సాంఘిక భద్రతా విరాళాలు.
  • ఉదా: భవిష్యనిధి జమలు, బీమా నిధి ప్రీమియంలు.
  • ఒక సంస్థ వాటాదారులకు లాభం ప్రకటించినప్పటికీ జాతీయాదాయం లెక్కలు తయారు చేసేనాటికి లాభం పంచనట్లయితే వాటిని పంచిపెట్టబడని లాభాలు అంటారు.
  • జాతీయాదాయంలో భాగంగా ఉండి, వ్యష్టి ఆదాయంలో లేనివి: 1) సాంఘిక భద్రత విరాళాలు 2) పంచిపెట్టబడిన లాభాలు

బదిలీ చెల్లింపులు (Transfer of Payments)

ప్రభుత్వం నుంచి ప్రజలకు ఉచితంగా లభించేవే బదిలీ చెల్లింపులు అంటారు. అవి:

  1. వృద్ధాప్య పింఛన్లు 
  2. పదవీ విరమణ అనంతరం పింఛన్లు థి
  3. వికలాంగుల పింఛన్లు 
  4. విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ షిప్‌లు
  5. నిరుద్యోగ భృతి 
  6. ప్రభుత్వ రుణంపై వడ్డీ
  7. విరాళాలు 
  8. బహుమతులు
  9. ప్రైవేటు బదిలీలు

2. వ్యయార్హ వృష్టి ఆదాయం / వ్యయార్హ ఆదాయం (Disposable Personal Income - DPI)

వ్యక్తులు చేతికొచ్చిన ఆదాయమంతా ఖర్చుచేసే అర్హత ఉండదు. ఖర్చు చేసే అర్హత గల వ్యయాన్ని వ్యయార్హ ఆదాయం అంటారు.

వ్యష్టి ఆదాయం నుంచి వ్యష్టి పన్నులుపోగా మిగిలిన దానిని వ్యయార్హ ఆదాయమందురు.

వ్యష్టి పన్నులు అనగా వ్యక్తులు చెల్లించే ప్రత్యక్ష పన్నులు.

ఉదా: వృత్తి పన్ను, సంపద పన్ను, ఆదాయపన్ను.

వ్యయార్దదాయం = వ్యష్టి ఆదాయం- వ్యష్టి పన్నులు

DPI = PI - TD (TD = Direct Taxes)

వ్యష్టి పొదుపు (Personal Saving - PS)

  • ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు చేసిన పొదుపుల మొత్తాన్ని వ్యష్టి పొదుపు అంటారు.
  • వ్యయార్హ ఆదాయం నుంచి వినియోగాన్ని తీసివేస్తే వ్యక్తి పొదుపు వస్తుంది.
  • PS = DPA-C, C= Consumption (వినియోగం)
  • వ్యష్టి పొదుపు = వ్యయార్హ ఆదాయం -వినియోగం
  • వ్యయార్హ ఆదాయం = వ్యష్టి పొదుపు + వినియోగం
Keywords: Tspsc economy notes in telugu,tspsc indian economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,economy notes,tspsc indian economy notes in telugu,group 2 indian economy notes in telugu,tspsc indian economy study material in telugu,group 2 indian economy study material in telugu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)