పేదరికం-కారణాలు

Adhvith
0
Causes of Poverty in India in Telugu

పేదరికం-కారణాలు 

  • పేదరికం ఒక సాంఘీక, ఆర్థిక సమస్య,
  • పేదరికానికి అనేక సాంఘీక, ఆర్థిక, రాజకీయ, వ్యవస్థాపక కారణాలు . ఉన్నాయి.
  • పేదరిక ప్రభావం ఒక విషవలయం లాంటిది.
  • నిరుద్యోగం వల్ల పేదరికం, పేదరికం వల్ల నిరుద్యోగం సంభవిస్తుంది. అందువలన ఏది కారణమో,ఏది ఫలితమో కచ్చితంగా చెప్పలేము.

1. జనాభా పెరుగుదల

  • 1951లో దేశ జనాభా 36.11 కోట్లు ఉంది. ఇది 2011 నాటికి 121.02 కోట్లకు చేరినది. ప్రస్తుతం సుమారు 140  కోట్లు. దేశజనాభా సుమారుగా 4 రెట్లు పెరిగినది.
  • ఈ జనాభా పెరుగుదల వలన ప్రజలకు అవసరం అయిన ఆహారం,వస్త్రాలు, గుహ వసతి మొ॥నవి లభించక పోవడంతో పేదరికం పెరుగుతున్నది.
  • పిల్లలను ఆస్తులుగా భావించే భారతదేశ ప్రజలు అధిక సంతానం కోరుకుంటారు. పేదరికం వలన సరియయిన వైద్య సదుపాయాలు పిల్లలకు అందక పోవటం వల్ల, బలవర్దకమైన ఆహారం సమకూర్చక పోవటం వలన శిశు మరణాలు అధికంగా ఉంటున్నాయి. అందువల్ల అధిక సంతానం పొందటానికి ఇష్టపడతారు.
  • పైవిధంగా పేదరికానికి మరియు జనాభాకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది.
  • అందువలన పేదరికం మరియు జనాభాను కారణం మరియు ఫలితంగా చెప్పవచ్చును.
  • ఉదా:- పేదరికానికి కారణం జనాభా పెరుగుదల.
  • జనాభా పెరుగుదలకు కారణం పేదరికం.

2. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత: (Low Productivity in Agriculture Sector)

  • వ్యవసాయ రంగంలో మూలధనం కొరత,సాంప్రదాయ ఉత్పత్తి పద్దతులు, నిరక్షరాస్యత, నీటిపారుదల సౌకర్యాలు లేమి మొ॥నవి అల్ప ఉత్పాదలకతకు కారణాలు.
  • అల్ప ఉత్పాదకత అల్ప ఆదాయానికి దారితీయడం వలన పేదరికం గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు,వ్యవసాయ కూలీల మధ్య ఉంటుంది.

3. నిరుద్యోగిత (Unemployment)

  • జనభా విస్పోటనం వల్ల శ్రామిక శక్తి దేశంలో వేగంగా పెరుగుతుంది.
  • భారతదేశ ఆర్థిక వ్యవస్థలో శ్రమశక్తి పెరుగుదలకు సమానంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు.
  • దేశంలో మూలధన సాంధ్రత పద్దతులు ఎక్కువగా ఉపయోగించటం వలన నిరుద్యోగిత పెరుగుతుంది.
  • పైవిధంగా నిరుద్యోగులు అయిన వారికి ఆదాయం లేక పేదరిక బోనులో చిక్కుకుంటున్నారు.

4. వనరుల అల్ప వినియోగం

  • మనదేశంలో సహజవనరులు,మానవ వనరులు. సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు.
  • మూలధన కొరత, యాజమాన్య నైపుణ్యం లోపించడం, మొదలైన కారణంవల్ల ప్రజలు లాభదాయకమైన ఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టడం లేదు.
  • అందువల్ల మనదేశంలో ప్రజల ఆదాయం తక్కువగా ఉండి ప్రజలు ఎక్కువగా పేదరికంలో ఉన్నారు.

5. అల్ప ఆర్థిక అభివృద్దిరేటు

  • వనరుల అల్ప వినియోగిత, నిరుద్యోగం, జనాభా విస్ఫోటనం, అల్ప మూలధన సంచయనం సృష్టించే ప్రభావాల వల్ల దేశంలో అర్ధిక అభివృద్దిరేటు పెరుగుతుంది. దీనినే రాజ్‌ కృష్ణ గారు హిందూ వృద్దిరేటుగా వర్ణించారు.
  • దేశంలో గల అల్ప వృద్దిరేటు వల్ల ప్రజలు తమకు అవసరమైన వస్తువులను పొందలేక పేదరికానికి గురవుతున్నారు.

6. ఆర్థిక అసమానతలు

  • మనదేశంలో గ్రామీణ ప్రాంతంలో భూకమతాలు ఎక్కువగా ధనిక రైతుల అధీనంలో ఉన్నాయి.
  • పట్టణ భూములను సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన వారు కొన్ని తరాలకు పూర్వ స్వాధీనం చేసుకొన్నారు.
  • మన దేశంలో ఎలాంటి స్థిర ఆస్తులు లేని బలహీన వర్గాలకు చెందిన ప్రజలు పేదరికంలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

7. ద్రవ్యోల్పణం

  • సమాజంలో క్రమంగా పెరుగుతున్న ధరలు స్వల్ప ఆదాయ వర్గాలకు,వ్యవసాయ కూలీలను, ఇతర కూలీలను ఎంతగానో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
  • వీరికి ప్రభుత్వ ఉద్యోగులలాగా ధరల పెరుగుదలను అతి క్రమించడానికి కరువు భత్యం లభించదు.

8. సరిపడని అభివృద్ది వ్యూహం

  • భారతదేశంలో మొదటి 20సం॥లు ప్రణాళిక బద్దమైన అభివృద్ది ప్రక్రియలో ఆర్థికవృద్దికి ప్రాముఖ్యత ఇచ్చారు కాని పేదరికానికి, నిరుద్యోగులకు ప్రాముఖ్యత ఇవ్వలేదు.
  • మూలధన సాంధ్రత పద్దతులు ఉపయోగించడం వల్ల, శ్రమకు తగ్గిన ఆదాయం లేకపోవడంతో ప్రజలు పేదరికానికి గురయ్యారు.

9. సాంఘీక కారణాలు

  • దేశంలో కుల వ్యవస్థ, ఉమ్మడి కుటుంబ విధానం, వారసత్వ చట్టాల వల్ల ఆర్థికాభివృద్ధి, ఆదాయ పెరుగుదల తక్కువగా ఉన్నాయి.
  • దేశంలో సామాజిక వ్యవస్థ ఆలోచన సరళి వల్ల దేశంలో ఆర్థికాభివృద్ది తగ్గి ప్రజలు ఎక్కువగా పేదరికంలో కొనసాగడానికి కారణమైనాయి.

10. రాజకీయ,వ్యవ స్థాపక కారణాలు

  • మన దేశంలో బ్రిటిష్‌ వారు అనుసరించిన ఆర్థిక విధానాలవల్ల ఆర్థికవ్యవస్థ క్షీణించి పోయి పేదరికానికి గట్టి పునాదులు ఏర్పడ్డాయి.
  • స్వాతంత్రానంతరం మనదేశంలో రాజకీయ నాయకులు అనుసరించిన విధానాలవల్ల దేశంలో పేదరికం తగ్గలేదు.
  • దేశంలో కులమత సంస్కారాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విధానాల వల్ల దేశంలో పేదరికం కొనసాగడానికి కారాణాలుగగా పేర్కొనవచ్చు.

పేదరిక నిర్మూలన చర్యలు -Millenium Development Goals (Poverty alleviation measures)

  • UNO వారు 2000 సం॥రం, సెప్టెంబర్ నెలలో మిలినియం శిఖరాగ్ర సమావేశంలో 189 ప్రపంచదేశ నాయకులు ప్రపంచ పేదరికానికి ముగింపు పలకాలనే  లక్ష్యంతో కొన్ని లక్ష్యాలను ఏర్పర్చుకున్నారు.
  • భారతదేశం మూడు దశాబ్దాల పూర్వమే పేదరికాన్ని నిర్మూలించడానికి ఆర్థికాభివృద్ధి లాంటి పరోక్ష చర్యలు నిరుపయోగమని గుర్తించింది.
  • మనదేశంలో బలహీన ఆర్థిక స్థోమతవల్ల పేదవారు ఎలాంటి కారకాలను సమకూర్చలేక పోతున్నారు.
  • భారత ప్రభుత్వం 1970 సం॥రం ప్రారంభంలో వివిధ వర్గాలకు చెందిన పేదవారిని లక్ష్యంగా పెట్టుకుని లక్ష్య వర్గాల వ్యూహం (Target group settings) ద్వారా పేదరిక నిర్యూలనకు కృషిచేసింది.

పేదరిక నిర్మూలనలో స్వయం సహాయక బృందాల పాత్ర

  • భారతదేశంలో 1982సం॥రం సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల స్త్రీలు, పిల్లలు, అభివృద్ది (DWCRA-Development of Women and Child in Rural Area) అనే పథకం ఆవిర్భవించింది.
  • ఈ పథకం ప్రకారం కొంతమంది స్త్రీలు ఒక బృందంగా ఏర్పడి తమ అల్ప ఆదాయంలో కొంత డబ్బును పొదుపు చేస్తారు. పొదుపు మొత్తాన్ని బ్యాంకులో దాచుకొని అవసరం ఉన్న సభ్యులకు రుణాలుగా అందిస్తారు.
  • ఈ విధంగా లభించిన రుణాన్ని వినియోగ అవసరాలకు, పిల్లల ఆరోగ్యం వంటి కార్యకలాపాలకు ఖర్చు చేస్తారు.
  • పేదరిక నిర్మూలనకోసం ప్రభుత్వం అనుసరించే లక్ష్య వర్గాల  పద్దతి ఒక స్వల్పకాలిక చర్యలుగాను, స్వయం సహాయక బృందాల మద్యమకాల చర్యలుగాను భావించవచ్చు.
  • దేశంలో భూసంస్కరణలు, గ్రామీణ పారిశ్రామికరణ, నిరక్షరాస్యత నిర్మూలన, జనాభా పెరుగుదల నియంత్రణ, GDP పెరుగుదల మొదలయిన లక్ష్యాలను దీర్ఘకాలిక లక్ష్యాలుగా పేర్కొంటారు.

పేదరికం నివారణ చర్యలు

పేదరికపు నివారణా చర్యలను 3 రకాలుగా 'చెప్పవచ్చు

  1. స్వల్పకాలిక చర్యలు
  2. మధ్యకాలిక చర్యలు (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ ద్వారా పేదరికం తగ్గించడం. బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్‌ నమూనా వలే)
  3. దీర్ఘకాలిక చర్యలు

  • జనాభా తగ్గించుట 
  • వృద్ధిని వేగవంతం చేయటం
  • ఆదాయ అసమానతలు తగ్గించుట 
  • భూసంస్కరణల అమలు
  • అక్షరాస్యత పెంచుట 
  • గ్రామీణ పారిశ్రామికీకరణ

స్వల్పకాలిక చర్యలు:

పేదరికాన్ని తగ్గించేందుకు ప్రత్యక్షంగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికవేత్తలు భావించారు. ఫలితంగా 1970వ దశకం నుండి కొన్ని పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి అవి:

  1. గ్రామీణ ఉపాధి పథకాలు
  2. పట్టణ ఉపాధి పథకాలు
  3. అఖిల భారత స్థాయి పథకాలు
  4. సామాజికభద్రతా పథకాలు
  5. ఇతర పథకాలు

1. గ్రామీణ ఉపాధి పథకాలు:

ఇవి రెండు రకాలు ఎ) వేతన ఉపాధి పథకాలు బి) స్వయం ఉపాధి పథకాలు

ఎ) వేతన ఉపాధి పథకాలు:

  • ఉద్యమిత్వ సామర్థ్యం లేని, నైవుణ్యం లేని వ్యక్తులకు వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధినందించటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికపై అవస్థాపనా సౌకర్యాల నిర్మాణానికి ఉద్దేశించబడినవే “వేతన ఉపాధి పథకాలు.

1. FWP (Food for work program)

  • 1977-78లో భారత ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధినందించి శాశ్వత ప్రాతిపదికపై గ్రామాల్లో ఆస్తులను సృష్టించేందుకు దీన్ని ప్రారంభించారు. 1980లో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని పునర్నిర్మించి NREP గా పేరు మార్చారు.

2. NREP (National Rural Employment Programme)

  • 1980లో' పూర్వమున్న FWP ని పునర్నిర్మించి NREP గా మార్చారు. దీనికి కేంద్ర, రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో నిధులందిస్తాయి. ఉద్యమిత లక్షణాలు లేనివారికి ఉపాధిని అందించడం, సామాజిక ఆస్తులను సృష్టించుటయే దీని లక్ష్యం. తరువాతి కాలంలో ఇది JRY లో విలీనమైంది

3. RLEGP (Rural Landless Employment Gurantee Programme)

  • గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలకు 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో 1983లో దీన్ని ప్రారంభించారు. దీనికి నిధులు మొత్తం కేంద్రమే భరిస్తుంది. తరువాత కాలంలో ఇది JRY లో విలీనమైంది.

4. JRY (Jawahar Rozgar Yozana)

  • NREP + RLEGP ల లక్ష్యం ఒకే విధంగా ఉండటంతో ఈ రెండింటిని విలీనం చేసి 1989లో JRY గా ఏర్పాటు చేశారు. దీనికి కేంద్ర రాష్ట్రాలు నిధులను 80:20 నిష్పత్తిలో సమకూరుస్తాయి. తరువాత దీని పేరును JGSY గా మార్చారు.

5. EAS (Employment Assurance Scheme), SGRY 

  • ఎడారి కొండ ప్రాంతాల్లో, క్షామపీడిత ప్రాంతాల్లో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధినందించేందుకు 1998లో దీన్ని ప్రవేశపెట్టారు. తరువాత కాలంలో ఇది SGRY లో విలీనం అయింది.

6. JGSY (జవహర్‌ గ్రామ్‌ సమృద్ధి యోజన) :

  • గతంలో ఉన్న JRY ను పునర్నిర్మించి 1999లో JGSY ను ప్రారంభించారు.

7. SGRY (సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్‌ యోజన) :

  • JGSY + EAS లను విలీనం చేసం 2001 సెప్టెంబర్‌ 25న SGRY గా ప్రారంభమైంది. దీనికి కేంద్ర, రాష్ట్రాల నిధుల నిష్పత్తి 75:25. తరువాతి కాలంలో ఇది NREGS లో విలీనం అయ్యింది.

8. NFFWP (జాతియ పనికి అహార పథకం):

  • 2004 నవంబర్‌లో ప్రణాళికా సంఘంచే గుర్తించబడ్డ 150 వెనకబడ్డ జిల్లాలలో దీనిని ప్రారంభించారు. ఆహార భద్రతను అందించుట, గ్రామాలలో సామాజిక ఆస్తులు సృష్టించుట దీని లక్ష్యం. ఇది NREGS లో విలీనం అయ్యింది.

9. NREGS (National Rural Employment Gurantee Scheme)

  • అంతకుపూర్వం గల NFFWP + SGRP లను విలీనం చేసి NREGS Act-2005 ను రూపొందించారు. దీని ఆధారంగా 2006 ఫిబ్రవరి 2న ఏపీ (బండ్లపల్లి - అనంతపురం జిల్లా) లో దీన్ని ప్రారంభించారు. ప్రారంభంలో 200 జిల్లాల్లో అమలు చేసినప్పటికీ తరువాత సం॥లో 330 జిల్లాలకు, 2008-09 బడ్జెట్‌ నుండి దేశంలోని అన్ని గ్రామీణ జిల్లాలకూ విస్తరించెను. ఏపీలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 22 జిల్లాల్లో అమలయింది. 

ముఖ్యాంశాలు :

  • ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యంలేని పనులలో కనీసం 100 రోజులు పని కల్పించుట. 
  • 15 రోజుల్లోగా పని కల్పించకపోతే మొదటి 30 రోజులకు 1/4 వంతు, మిగిలిన రోజులకు 1/2 వంతు (వేతనాలలో)ను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. 
  • NREGS కు నోడల్‌ ఏజెన్సీగా గ్రామ పంచాయతీ ఉంటుంది.
  • 5 కి.మీ దాటి పని కల్పిస్తే 10% రవాణా ఖర్చులు ఇవ్వాలి.
  • కనీస వేతన చట్టం - 1948 క్రింద కనీస వేతనం అందించాలి.
  • స్త్రీ పురుషులకు సమాన వేతనం ఇవ్వాలి
  • లబ్ధిదారుల్లో 1/3 వంతు స్త్రీలు ఉండాలి
  • గ్రామసభలు సోషల్‌ ఆడిట్‌ చేస్తాయి.
  • కేంద్ర రాష్ట్రాలు 90:10 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి
  • పని చేసే స్థలాల్లో త్రాగునీరు, నీడ, పిల్లలకు సంరక్షణ వంటి సౌకర్యాలు కల్పించాలి
  • 2009 అక్టోబర్‌ 2 నుండి “మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం”గా పేరు మార్చారు.
  • ఈ పథకం క్రింద చేపట్టిన పనులలో ఎక్కువ పనులు నీటి సంరక్షణకు సంబంధించినవే
  • 2011 జనవరి నుంచి MGNREGS క్రింద చెల్లించే వేతనాలు CPI (AL) తో ముడిపెట్టెను.
  • NREGS సక్రమంగా అమలైతే
  • గ్రామీణ ప్రాంత భాగస్వామ్యం ఉండటం వల్ల ప్రజాస్వామ్యం బలోపేతమగును
  • వలసలు నిరోధించబడును
  • హెచ్‌ఐవి వ్యాప్తిని నిరోధించవచ్చు
  • మహిళా భాగస్వామ్యం (ఎస్సీ, ఎస్టీ). ద్వారా Social and Financial Inclusions.సాధించవచ్చు

బి) స్వయం ఉపాధి పథకాలు

1. సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం (IRDP - Integrated Rural Development Programme)

  • అప్పటివరకు ఉన్న SFDA, MFAL వంటి పథకాలను ఒకే గొడుగు క్రిందకు తీసుకురావాలని భావించి 1978-79లో 2300 బ్లాకులలో దీన్ని ప్రారంభించెను. 1980 అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించెను. దీనికి కేంద్ర, రాష్ట్ర నిధులు 50:50 కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ గ్రామీణ మంత్రిత్వశాఖ, జిల్లాలలో డిఆర్‌డిఎ దీనిని అమలుపరుచును. “5” ఉపపథకాలతో కలిసి ఇది 1999లో SGSY లో విలీనమైనది.

a) TRYSEM (Training to Rural Youth for Self Employment)

  • పేదరికపు రేఖకు దిగువనున్న గ్రామీణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికై శిక్షణ ఇచ్చేందుకు 1979 ఆగస్టు 5న ప్రారంభించబడెను

b) DWCRA (Development of women and children in rural area act-1982)

  • DWCRA సహకారంతో 1982లో గ్రామీణ స్త్రీల, పిల్లల అభివృద్ధికై దీన్ని ప్రారంభించెను

c) MWS (Million Wells Scheme):

  • 10 లక్షల బావులను తీసేందుకు (Open irrigation) 1988-89లో ప్రవేశపెట్టెను

d) SITRA (Supply of improved tool kits to rural articians-1992)

  • గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక నైపుణ్యం గల కళాకారులకు మెరుగైన పరికరాలు అందించుట ద్వారా స్వయం ఉపాధి కల్పనకు ఉద్దేశించబడింది

e) గంగాకళ్యాణ్‌ యోజన (GKY)

  • భూగర్భ జలాలను వెలికి తీసేందుకు 1997లో ప్రవేశపెట్టెను

2. స్వర్ణజయంతి గ్రామస్వరాజ్‌గార్‌ యోజన (SGRY) -1999 :

  • IRDP దాని అనుబంధ పథకాలైనTRYSEM + DWCRA + MWS + SITRA + GKY లను విలీనం చేసి 1999 ఏప్రిల్‌ 1 నుండి దీన్ని ప్రారంభించెను. 2009-10 బడ్జెట్‌ నుంచి దీని పేరును “జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం” (NRLM)గా. మారుస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ ప్రకటించారు. 2011లో హర్యానాలో సోనియాగాంధీ దీనిని ప్రారంభించెను. 2010 డిసెంబర్‌ నాటికి 40 లక్షల 5116 లు ఏర్పడినవి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)