అభివృద్ధి దశలు (Stages of Development)
ఈ అభివృద్ధి దశలను వివరించింది
- 1. కార్ల్ మార్క్స్
- 2. W.W. Rostow
- 3. సైమన్ కుజ్ నట్స్
కార్ల్ మార్క్స్ వృద్ధి దశలు
కార్ల్ మార్క్స్ రచించిన గ్రంథాలు
1) Das Capital (ఈ గ్రంథాన్ని ఏంగిల్స్ సహాయంతో రచించారు)
2) Communist Manifesto
- సామ్యవాద ఆర్థిక వ్యవస్థ పితామహుడు - కార్ల్ మార్క్స్
- ఇతను చారిత్రాత్మక దృష్టితో విశ్లేషించాడు.
- ఇతను వర్గ పోరాటం ద్వారా అభివృద్ధి దశలు ఏవిధంగా పరిణామం చెందునో వివరించాడు.
- చివరకు ఈ ఆర్థిక వ్యవస్థ ఎటు వైపు పయనిస్తుందో వివరించాడు.
కార్ల్స్ మార్క్స్ సిద్ధాంతానికి నాలుగు ప్రధాన సూత్రాలు గలవు. అవి
- గతి తార్మిక భౌతిక వాదము (Dialectical Materialism)
- మిగులు విలువ సిద్ధాంతం (Theory of Surplus)
- వర్గ పోరాటం (Class Struggle)
- శ్రామిక నియంతృత్వము.
ఇతను వృద్ధి దశలను 6 దశలుగా వివరించాడు.
- ఆదిమ సమాజం (Primitive Communism)
- బానిస దశ (Slave Society)
- భూస్వామ్య దశ (Fedalism)
- పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ (Capitalism)
- సామ్యవాద దశ (Socialism)
- కమ్యునిజం (Communism)
1. ఆదిమ సమాజం (Primitive Communism):
- సామాజిక పరిణామాలలో మొదటి దశ
- సమ సమాజం, స్వేచ్చ, ఆర్థిక దోపిడి లేని వ్యవస్థ ఉంటుంది.
- ఉత్పత్తి కారకాలు ఎవరి సొంతం కావు. ఉత్పత్తి కారకాలపై ఎవరికి ఆధిపత్యం ఉండదు.
- అందరూ కలిసి పనిచేస్తారు. అందరూ అవసరాలకై పంచుకుంటారు.
- వీరికి శ్రమ విభజన గురించి తెలియదు.
- సమానత్వాన్ని కలిగి ఉంటారు.
- ఉత్పత్తి కారకాలను సమాజ సంపదగా భావించి, ప్రజలందరు కలిసి, తమకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేసి, సమానంగా పంచుకునేవారు.
2. బానిస దశ (Slave Society):
- ఈ దశలో శ్రమ విభజన ఏర్పడుతుంది. ఆర్థిక శక్తి కేంద్రీకరణ ప్రారంభం అవుతుంది.
- ఉత్పత్తి అవసరాల కంటే ఎక్కువగా చేస్తారు. ఈ మిగులు బానిస దశకు కారణం.
- ఈ దశలో దోపిడి చేయు విధానం ప్రారంభం అవుతుంది.
- ఉత్పత్తి సాధనాలు కొందరి వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అవుతాయి.
- మనిషిని మనిషి దోచుకునే ప్రయత్నంలో ఆర్థిక శక్తి కేంద్రీకరణకు దారితీస్తుంది.
- శ్రమ విభజన, పట్టణాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి మొదలయినవి ఈ దశలో చేసుకుంటాయి.
3. భూస్వామ్య దశ (Fedalism):
- వ్యవసాయం, చేతి వృత్తులు, చేనేత మొదలైనవి అభివృద్ధి చెందిన కొలది భూస్వామ్య దశ ప్రారంభమవుతుంది.
- ఈ దశలో గ్రామీణ వ్యవస్థ భూస్వాములుగా, రైతాంగంగా చీలిపోవును.
- భూములు అన్ని భూస్వాముల చేతిలో ఉండును,
- రైతులు కష్టించి పనిచేయగా ప్రతిఫలాలు భూస్వామ్యులకు చెందును.
- నూతన సాంకేతిక పద్ధతుల వలన ఉత్పత్తి బాగా పెరుగును.
- నూతన సాంకేతిక పద్ధతుల వలన కొత్త ఉత్పత్తి సంబంధాలు అవసరం అయి భూస్వామ్య వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
- నూతన సాంకేతిక పరిజ్ఞానం భూస్వామ్య వ్యవస్థను దెబ్బతీసి పెట్టుబడిదారి విధానానికి కారణం అవుతుంది.
4. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ (Capitalism):
- ఈ దశను అత్యధికంగా అభివృద్ధి చెందిన దశగా కార్ల్ మార్క్స్ పేర్కొన్నారు.
- ఆర్థిక వ్యవస్థ రెండుగా చీలిపోవును.
- పెట్టుబడిదారి వర్గం
- కార్మిక వర్గం
- పారిశ్రామిక విప్లవం వలన శ్రాస్తీయ భావాలు ప్రజలలో వృద్ధి చెందును.
- ఈ దశలో ఉత్పత్తి సాధనాలు పెట్టుబడిదారుల చేతుల్లో ఉండును.
- శ్రామికుడి వద్ద శ్రమశక్తి ఉంటుంది. ఈ శక్తిని పెట్టుబడి దారులు దోచుకుంటారు.
- “చరిత్ర అంటే నిరంతరం రెండు వర్గాల మధ్య పోరాటమే” - కార్ల్ మార్క్స్
- “లాభాలు చట్టబద్ధమైన దోపిడి” - కార్ల్స్ మార్క్స్
- పెట్టుబడిదారి వ్యవస్థలో నూతన యంత్రాలు ప్రవేశపెట్టడం వలన నిరుద్యోగం పెరుగుతుంది.
- ఈ నిరుద్యోగితనే “Industrial Reserved Army” (పారిశ్రామిక రిజర్వ్‌సేన) అంటారు.
- పెట్టుబడిదారులు అధిక లాభాలను పొందుటకు శ్రామికుల వేతనాలను తగ్గించి శ్రమ దోపిడికి పాల్పడుతారు. దీని వలన వర్గ సంఘర్షణ ఏర్పడుతుంది.
- శ్రామికులు అధికారాన్ని హస్తగతం చేసుకుంటారు. దీనితో పెట్టబడిదారి వ్యవస్థ అంతరించి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది.
5. సామ్యవాద దశ (Socialism) :
- పెట్టుబడిదారి విధానం పరిపక్వమునకు చేరినపుడు శ్రామిక వర్గానికి, పెట్టుబడిదారి వర్గానికి
- వైవిధ్యం ఏర్పడును.
- ప్రజలు సంఘటితం అయి విప్లవం ద్వారా రాజ్యాలపై ఆధిపత్యం వహిస్తారు.
- శ్రామికులు రాజ్యంను నియంత్రించి ఉత్పత్తి సంస్థలను స్వాధీనం చేసుకుంటారు.
- ఈ దశలో ప్రణాళికలు ప్రారంభించబడతాయి.
6. కమ్యూనిజం (Communism):.
- ఈ దశ మొదటిదశ వలె ఉంటుంది.
- ఉత్పత్తి సాధనాలు సమాజపరం అవుతాయి.
- వ్యక్తుల ఆదాయం వారి వారి అవసరాల బట్టి తీరును.
- చివరకు సామ్యవాదం కమ్యూనిజంగా మారును. ఇక్కడ రాజ్యం అంతరించును.
- పూర్తి సమానత్వం సొధించబడుతుంది.
- ప్రపంచంలో పాక్షిక అసమానతలు ఉన్న సామ్యవాదం వరకే రష్యా, చైనా, వియత్నాం, పోలండ్
- దేశాలు చేరాయి. పూర్తి స్థాయి సమానత్వాన్ని ఏ దేశం చేరుకోలేదు.
- కార్ల్స్ మార్క్స్ ప్రకారం వస్తువు విలువను నిర్ణయించే అంశాలు : 3
- స్థిరమూలధనం (Constant Capital) = C
- చరమూలధనం (Variable Capital) = V
- మిగులు విలువ (Surplus Value) = S
కార్ల్స్ మార్క్స్ భావనలు
పై అంశాల ఆధారంగా 3 భావనలను ప్రతిపాదించెను అవి.
1. శ్రామిక దోపిడి రేటు = S/V = మిగులు విలువ
- శ్రామిక దోపిడి రేటు (S/V) అనేది మిగులు విలువకు, వేతనాలకు గల నిష్పత్తి
- S/V శ్రామికుడు పనిచేసే రోజును రెండు విభాగాలుగా విభజించాడు. ఒక భాగం శ్రామికుడు తన కోసం అంటే తనకు వచ్చే వేతన విలువకై పని చేస్తాడు. మరొక భాగంలో శ్రామికుడు పెట్టుబడిదారుని కోసం పని చేస్తాడు.
- ఒక వేశ S/V విలువ 3/2 కి సమానం అయితే, శ్రామికుడు రోజుకు 10 గంటలు పనిచేస్తే అతడు 4 గంటలు తన కోసం మరియు 6 గంటలు అతనికి ఉపాథి కల్పించిన పెట్టుబడిదారుడి కోసం శ్రమిస్తాడు.
- శ్రామిక దోపిడి రేటుకు సంబంధించిన ఈ నిష్పత్తికి Marks విశ్లేషణలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.
- శ్రామిక దోపిడి రేటు = S/V = 6/4 = 3/2
- శ్రామికుడు మొత్తం 10 గంటలు పని చేసాడు. దీనిలో 6 గంటల పని వల్ల పెట్టుబడిదారునికి మిగులు లభించగా, 4 గంటలు తన కోసం పని చేశాడు.
- S →పెట్టుబడిదారునికి లభించే మిగులు విలువ
- V → శ్రామికునికి చెల్లించే వేతనాలు.
2. OCC (Organic Composition of Capital): OCC = C/V
- OCC స్థిర మూల ధనానికి, చర మూలధనానికి మధ్య గల నిష్పత్తి తెలుపుతుంది.
- కాల గమనంలో ఈ నిష్పత్తి పెరగడం ద్వారా నిరుద్యోగిత ప్రబలుతుంది.
- OCC పెరగటం అనేది సాంకేతిక ప్రగతిపై ఆధారపడి ఉంటుంది.
- సాంకేతిక ప్రగతి స్థిర మూలధనాన్ని పెంచుతుంది. అనగా సాంకేతిక ప్రగతి ఉత్పత్తి ప్రక్రియలో శ్రామికుల అవసరాన్ని తగ్గించి, మూలధన పరిమాణాన్ని అధికం చేసి, నిరుద్యోగితను పెంచుతుంది.
- సాంకేతిక ప్రగతి ద్వారా అధిక పెట్టుబడులను యంత్రాలు, ముడిసరుకులపై పెట్టడం వలన మొత్తం పెట్టుబడిలో స్థిరమూలధన నిష్పత్తి (C/C+V) పెరుగుతుంది.
- C → Constant Capital → స్థిర వ్యయం
- V → Variable Capital → చరవ్యయం
- స్థిర మూలధనం లేదా స్థిర వ్యయం (C) మరియు చరమూలధనం లేదా చరవ్యయం (V) మార్పుల వలన OCC లో మార్పు సంభవిస్తుంది. ఈ మార్పులను ఈ క్రింది విధంగా వివరించవచ్చును.
- 1. స్థిర మూలధనం లేదా స్థిర వ్యయం (C) పెరిగితే, OCC పెరుగుతుంది
- 2. స్థిర మూలధనం లేదా స్థిర వ్యయం (C) తగ్గితే OCC తగ్గుతుంది.
- Constant Capital (C) కి మరియు OCC కి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.
- 3. చర మూలధనం లేదా.చర వ్యయం (V) పెరిగితే, OCC తగ్గుతుంది.
- 4. చర మూలధనం లేదా చర వ్యయం (V) తగ్గితే OCC పెరుగుతుంది.
- Variable Capital (V) కి మరియు OCC కి మధ్య విలోమ సంబంధం ఉంటుంది.
- 5. టెక్నాలజీ పెరిగితే OCC కూడా పెరుగుతుంది.
- టెక్నాలజీకి మరియు OCC కి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.
- 6. OCC పెరగడం వలన నిరుద్యోగిత పెరుగుతుంది.
- OCC కి నిరుద్యోగితకు మధ్య అనులోమ సంబంధం ఉంటుంది.
3. లాభాల రేటు = (S/C + V)
- లాభాల రేటు మిగులు విలువకు మరియు స్థిర, చర మూలధన మొత్తాలకు గల నిష్పత్తిని తెలియజేస్తుంది.
- సాంకేతిక ప్రగతి ద్వారా OCC పెరుగుతున్నప్పుడు లాభాల రేటు పడిపోతుందని కార్ల్స్ మార్క్స్ భావించాడు.
- నిజానికి కార్ల్స్ మార్క్స్ అభిప్రాయంలో దోపిపి రేటు స్థిరంగా ఉండి, OCC పెరుగుతున్నప్పుడు లాభాలా రేటు పడిపోతుంది. దీనితో పెట్టుబడిదారులు .నష్టపోతారు. ఇదే సమయంలో యంత్రాల వినియోగం. పెరిగి నిరుద్యోగిత పెరుగుతుంది. ఈ విధంగా డిమాండ్ క్షీణించి, పెట్టుబడిదారి వ్యవస్థ తనంతటతాను సంక్షోభంలో చిక్కుకుంటుంది.
విమర్శ :
- USSR విచ్చిన్నం అవటం
- సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో సరళత్వం తక్కువ. అందుకే USSR విచ్చిన్నం అయింది.
- విద్యావంతులయిన/ మేధావి వర్గ శ్రామికులను విస్మరించెను.
II. W.W. Rostow
- ఇతని గ్రంథం - “The Stages of Economic Growth (1960)
- దీనినే "Non-Communist Manifesto Subtitle" తో పిలుస్తున్నారు.
- ఇది కార్ల్‌మార్క్స్ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయమైనది.
ఇతను '5' దశలను వివరించాడు.
- సాంప్రదాయ సమాజం (Traditional Society)
- ఫ్లవన దశకు ముందున్న దశ (Pre-Conditions for Take-Off)
- ఫ్లవన దశ (Take off Stage)
- పరిపక్వ దశ (Drive to Maturity Stage)
- భారీవినియోగ దశ (High Mass Consumption Stage)
1. సాంప్రదాయ సమాజం :
- దీనినే “Pre Industrial Stage" అంటారు.
- ఇది న్యూటన్‌కు పూర్వం ఉన్న వ్యవస్థను తెలుపుతుంది.
- భూస్వామ్య లక్షణాలు, అల్ప అక్షరాస్యత, అల్ప సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సమాజం.
- ఈ దశలో 75% వరకు వ్యవసాయంపై ఆధారపడతారు.
- పరిమితమైన ఉత్పత్తి ఫలం ఆధారంగా నిర్మించబడిన సమాజం.
- శ్రమ, సాంద్రత పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. (అధిక మానవశక్తి (Labour Intencive Method))
- భూమి, రాజకీయ అధికారం గల భూకామందుల చేతిలో ఉంటుంది.
- ప్రజల కనీస వినియోగ అవసరాలకు మించి ఉన్న ఆదాయం విలాస జీవితానికై ఖర్చు చేస్తారు. లేదా అనుత్పాదక అంశాలపై ఖర్చు చేస్తారు. ఉదా: పండుగలు, వివాహాలు.
2. ప్లవన దశకు ముందున్న దశ :
- దీనినే Pre-Conditions for Take-off అంటారు. (Transitional Stage అంటారు.)
- దీనినే “Period of Transition” అని కూడా అంటారు. అనగా సాంప్రదాయ. సమాజం నుండి ఆధునిక శాస్త్రీయ సమాజానికి మారే క్రమం లేదా పారిశ్రామికీకరణ ప్రారంభదశ.
- ఈ దశలో వ్యాపారం, వాణిజ్యం విస్తరిస్తుంది. పెట్టుబడులు పెరుగుతాయి.
- ఆధునిక ఉత్పత్తి పద్ధతులు వస్తాయి.
- ఆర్థిక వనరుల సమీకరణకు బ్యాంకులు నెలకొల్పబడి వృద్ధి చెందుతాయి.
- విద్యా, వైద్య, శ్రాస్త సాంకేతిక ప్రగతి ఏర్పడుతుంది.
- నష్టభయం భరించగలిగిన ఉద్యమ దారులు ఏర్పడుతారు.
- సుమారు 200 సం॥ ఈ మార్పులు జరుగుతాయి.
- ఫ్లవన దశకు కావలసిన అన్ని నిబంధనలు ఏర్పడుతాయి. అంతర్గత బహిర్గత వ్యాపారం విస్తరిస్తుంది.
- ఇంగ్లాండ్‌లో 15-17 శతాబ్దాల సమయంలో ఈ మార్పులు జరిగాయి.
3. పవన దశ (Take-off) :
- ఇది అతి ముఖ్యమైన దశ.
- దేశ అభివృద్ధికి లేదా ఆర్థికాభివృద్ధికి ముఖ్య దశ
- ఆధునిక పారిశ్రామిక రంగం పట్టణాలు విస్తరిస్తుంటాయి.
- నూతన సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందును.
- ఆహార మిగులు ఏర్పడి వేగంగా విస్తరించే పరిశ్రమలు ఏర్పడును.
- పొదుపు పెట్టుబడులు 5-10% పెరుగుతాయి.
- ఈ దశను Rostow ఏమని వర్గీకరించాడంటే
- “The Greatest Water Sheds in the Life of Modern Society”
- ఈ దశను చేరిన కొన్ని దేశాలు .
- బ్రిటన్ → 1783-1802
- USA → 1843-1860
- జపాన్ → 1878-1900
- రష్యా → 1890-1914
- చైనా → 1952
- భారత్ → 1952 (రోస్టో అభిప్రాయం ప్రకారం)
- భారతదేశం 1964-65 లో ఫ్లవన దశను దాటి ఉండవచ్చని కొందరూ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాని, HDI ప్రకారం 1991 India Takeoff Stage ను చేరింది.
1964-65 సం॥ సమీప కాలంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగాల ప్రగతి చాలా పుంజుకున్నాయి. కాబట్టి ప్లవనదశను దాటిందని చెప్పవచ్చు.
4) పరిపక్వ దశకు గమనం (Drive to Maturity Stage)
- దీనినే “Stage of Self Sustained Growth” అంటారు.
- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను సమర్థవంతంగా వినియోగించుకునే దిశ.
- నూతన పురోగామి రంగాలు సృష్టించబడతాయి.
- జాతీయ ఆదాయంలో నికర పెట్టుబడి 10%ని మించి ఉంటుంది.
- సంపూర్ణ ఉద్యోగిత పొందే దశ
- వ్యాపార చక్రాలు, ద్రవ్యోల్బనం, ప్రతి ద్రవ్యోల్బనం, ఆర్థిక మాంద్యంను తట్టుకునే దశ,
- ఈ దశ చేరిన కొన్ని దేశాలు
- బ్రిటన్ → 1850
- USA → 1900
- జర్మనీ → 1910
- జపాన్ → 1940
- రష్యా → 1950
5) సామూహిక వినియోగ దశ (High Mass Consumption Stage) :
- పూర్తిగా అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంది.
- పట్టణ జనాభా పెరుగుతుంది.
- మన్నిక గల వినియోగ వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది.
- సంక్షేమం పెరుగుతుంది. సంక్షేమం పంపిణీకి ప్రాధాన్యం ఇస్తారు.
- సాంఘిక భద్రత, సంక్షేమం, సంపూర్ణ ఉద్యోగిత, జీవన ప్రమాణ పెరుగుదల, లింగ వివక్షత తగ్గుదల,
- అధిక ఉత్పత్తి మొ. ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
- అధిక జీవన ప్రమాణం గల వస్తువుల వినియోగం పెరుగుతుంది.
- ఈ దశను చేరిన దేశాలు
- USA → 1920
- UK → 1930
- జపాన్ → 1950