ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరణ (వృద్ధి-అభివృద్ధి )

Adhvith
0
Indian Economy Study Materian in Telugu

ప్రపంచ బ్యాంక్‌ వర్గీకరణ

  • ప్రపంచ అభివృద్ది నివేదిక (WDR) 2022 ప్రకారం ప్రపంచ బ్యాంక్‌ 02 జూన్ 2022న విడుదల చేసింది.
  • తలసరి జిడిపి ఆధారంగా వర్గీకరణ.
  • ప్రపంచ అభివృద్ది నివేదిక సారాంశం - డిజిటల్‌ డివిడెంట్‌ (ఇంటర్నెట్‌, ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ. వృద్ధి, ఉద్యోగిత మరియు సేవలు).
  • ప్రపంచ బ్యాంక్‌ ప్రస్తుత అధ్యక్షుడు - ఇండెర్మిట్ గిల్
  • ప్రపంచ బ్యాంక్‌ GNI, PCI ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది
  • GNI తలసరి ఆదాయాన్ని గణించడానికి ప్రపంచ బ్యాంక్‌ “వరల్డ్‌ అట్లాస్‌ మెథడ్‌”ను ఉపయోగిస్తుంది.

1. ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు (Upper Income Countries) :

  • $12,476 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగివున్న దేశాలు
    • ఉదా : USA, యూకే, ఆస్ట్రేలియా, ఓఇసిడి దేశాలు, రష్యా, సింగపూర్‌, జపాన్‌

2. మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు. (Middle Income Countries):

  • $1,025 నుంచి $12,475

ఎ) ఎగువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు

  • $4036 నుంచి $12,475
    • ఉదా.  చైనా, మెక్సికో, బ్రెజిల్ 

బి) దిగువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు

  • $1,025 నుండి $4,035
    • ఉదా : భూటాన్‌, భారతదేశం, పాకిస్తాన్‌, శ్రీలంక మొ॥ని

3. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు [

  • $1025 లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన దేశాలు
    • ఉదా.  ఆఫ్ఘనిస్థాన్ , నేఫాల్‌, సట్‌ సహరా దేశాలు
  • భారతదేశం దిగువ, మధ్యస్థ ఆదాయం జావీతాలో వస్తుంది, ఇండియా తలసరిGNI $లో 6,020 GNI. GNI  తలసరి $ 1,590
  • ఇండియా ప్రపంచ జనాభాలో 17.6%ను మరియు ప్రపంచ స్టూల జాతీయాదాయంలో 2.5% వాటాను కలిగియున్నది, చైనా ప్రపంచ జనాభాలో 19%, స్థూల జాతీయ ఆదాయంలో 12% వాటా కలిగియున్నది.
  • వేగవంతంగా ఆర్థికాభివృద్ధి మరియు పారిశ్రామికీకరణం చెందే దేశాలను ఎమర్జింగ్‌ మార్కెట్‌ అంటారు.
    • ఉదా : భారతదేశం, చైనా

ఐక్యరాజ్యసమితి వర్గీకరణ 

1. మొదటి ప్రపంచ దేశాలు:

  • పెట్టుబడిదారీ ఆర్టిక వ్యవస్థ లేదా మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ గల దేశాలను మొదటి ప్రపంచ దేశాలుగా పిలుస్తారు
  • ఉదా : యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా,

2. రెండవ ప్రపంచ దేశాలు:

  • సామ్యవాద లేదా కమ్యూనిస్ట్‌ దేశాలనైన పూర్వ రష్యా, క్యూబా, చైనాలను రెండవ ప్రపంచ దేశాలుగా పిలుస్తారు

3. మూడవ ప్రపంచ దేశాలు:

  • అఖివృద్ధి చెందుతున్న మరియు అలీన దేశాలు,
  • ఉదా: ఇండియా, ఇండోనేషియా, ఈజిస్ట్‌ మొ!!వి.

4. నాల్గవ ప్రపంచ దేశాలు:

  • అల్ప అభివృద్ధి చెందిన దేశాలు లేదా అభివృద్ధి చెందని దేశాలు.
  • ఉదా: నేపాల్‌, భూటాన్‌, సట్‌-సహారా దేశాలు, సూడాన్‌, చాద్ మొ. వి.

5. ఐదవ ప్రపంచ దేశాలు :

  • వివిధ దేశాలలోని గిరిజన తెగల ప్రజలను ఐదవ ప్రపంచం అంటారు.

వృద్ధి రేటు

వార్షిక జాతీయ ఆదాయ వృద్ధిరేటు ఆధారంగా ఆర్థికవృద్ధిని లెక్కిస్తారు.

వృద్ధి రేటును లెక్కించే పద్ధతి

                gt = [(Qt – Q(t-1)) /Q(t-1) ] x 100

దీనిలో Qt  = ప్రస్తుతం సంవత్సరం ఉత్పత్తి (Current Year)

Q(t-1) = గత సంవత్సరం ఉత్పత్తి (Previous Year)

ఉదా: 2006లో జాతీయాదాయం 1150 కోటు భావిస్తే

2005లో జాతీయాదాయం 1100 కోట్లు భావిస్తే

వృద్ధిరేటు = 4.8% గాఉంది.

అల్ఫా భివృద్ధి గల ఆర్థిక వ్యవస్థ(Under Development Economy)

అర్ధశాస్త్రంలో అభివృద్ధిని పేద దేశాల్లో పిలిచే పేర్లు:

    • - వెనుకబడిన దేశాలు
    • - అల్పావృద్ధి దేశాలు
    • - అభివృద్ధి చెందుతున్న దేశాలు
    • - తక్కువ ఆదాయం గల దేశాలు
    • - మూడవ ప్రపంచ దేశాలు
    • - వర్ధమాన దేశాలు
  • 2013-14 లో స్థూల దేశీయ పొదుపులో గృహరంగం వాటా అత్యధికంగాను, మొదటి స్థానం- కాగా, రెండవ స్థానం - కార్పొరేట్‌ రంగానిది.
  • 2013-14లో స్థిర మూలధన కల్పనలో అత్యధిక వాటా ప్రైవేట్‌ కార్పొరేట్‌ రంగానిది కాగా రెండవ స్థానంలో - గృహ రంగానిది, 3వ స్థానం - ప్రభుత్వ రంగానిది.

1) ఆదాయ అసమానతలు:

    అల్పాభివృద్ధి గల దేశాల్లో ఆదాయ అసమానతలు ఎక్కువ. ఉదా: భారతదేశం

  • అభివృద్ధి ప్రారంభ దశలో అసమానతలు పెరుగును, తర్వాత దశలో. అసమానతలు తగ్గును. అని సైమన్‌ కుజ్‌నట్స్‌ రేఖపై చూపితే తిరగవేసిన  U ఆకారం వస్తుందని, తిరగవేసిన U పరికల్పన (Inverted U hypothesis) ను ప్రతిపాదించాడు.
  • కొద్దిమంది ధనవంతులకు వడ్డీలు, భాటకం రూపంలో ఆదాయం వచ్చినా వారు ఆడంబర వినియోగంపై ఖర్చు చేస్తారు. కాని పొదుపు చేసి పెట్టుబడి చేయరు.
  • ఆదాయ, సంపద పంపిణీలోని అసమానతలను గణించుటకు లారెంజ్‌ రేఖను ఉపయోగిస్తారు.
  • లారెండ్‌ వక్రరేఖపై OX అక్షంపై జనాభా శాతాన్ని OY అక్షంపై ఆ జనాభా పొందే ఆదాయ శాతాన్ని తీసుకుంటారు. ఆదాయ సమ పంపిణి రేఖను మధ్య దూరం పెరుగుతుంటే అసమానతలు పెరుగుతున్నట్లు, ఈ రెండు రేఖలు ఒకదానికొకటి కలిసిపోతే అక్కడ సంపూర్ణ సమానత్వం ఉండును.
  • ఈ లారెంజ్‌ వక్రరేఖ నుండి గిని గుణకాన్ని నిర్వచిస్తారు. ఈ గిని గుణకం ఆదాయ అసమానతల స్థాయిని తెలుపును.
  • గిని గుణకం 0 కి, 1 కి మధ్య ఉంటుంది.

            0 - సంపూర్ణ సమానత్వాన్ని

            1 - సంపూర్ణ అసమానత్వాన్ని తెల్పును.

  • గిని గుణకాన్ని శాతంలో లెక్కిస్తే వ్యక్తపరిస్తే గిని సూచీ వస్తుంది. గిని సూచీ 0 -100 మధ్యలో ఉంటుంది.
  • కారిడోగిని (ఇటలీ) పేరు మీదుగా దీనిని “గిని గుణకం” అంటారు.
  • మన భారత్‌లో 1994లో గిని గుణకం 0.297 కాగా, 2004-05లో గిని గుణకం 0.368 కాగా, 1990లో ఆర్థిక సంస్కరణల వలన అసమానతలు పెరిగాయి.

2) నిరుద్యోగిత :

  • అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయాలన్న కోరికతో పాటు, పని చేయగలిగే శక్తి కూడా ఉన్నప్పటికీ పని లభించని పరిస్థితిని “నిరుద్యోగిత" అంటారు. ;

శ్రామిక శక్తి (Labour Force) :

  • ILO - 15-60సం॥ మధ్య వయసు కలవారిలో పనిచేయాలనే కోరికతో పాటు పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే వారిని శ్రామిక శక్తి గా  భావించవచ్చు.
  • USA లో 16 సం॥ కంటే ఎక్కువ వయసు గల వారిని శ్రామిక శక్తి  లో తీసుకుంటారు.
  • India లో 15-59 సం॥ ల మధ్య వయసు గల వారిని శ్రామిక శక్తి లో తీసుకునేవారు. కాని ఇపుడు 64సం॥ వరకు చేర్చారు.

కార్మిక శక్తి (Work Force):

  • 15-64సం॥ మధ్య గల వారు ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే వారిని కార్మిక శక్తి అంటారు.
  • కార్మిక శక్తి నుండి శ్రామిక శక్తిని తీసేస్తే నిరుద్యోగిత వస్తుంది.
      • LF - WF = Unemployment
  • Labour Force = Work Force + Unemployment
  • నిరుద్యోగిత రేటు (Unemployment Rate) = (No of Unemployment Persons / Labour Force)
  • NSSO వారి 61వ Round లో - 8.28 గా ఉన్న నిరుద్యోగిత
  • 66వ Round (2009-10) లో - 6.6కి (2009-10)
  • 68వ Round (2011-12)లో - 5.6 కి తగ్గినది (2011-12).

3) వ్యవసాయరంగ ఆధిక్యత :

  • వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువగా ఉండుటచే తమ ఆదాయంలో ఎక్కువ భాగం వ్యవసాయంపై (పెట్టుబడి) ఖర్చు పెడతారు. కావున పారిశ్రామిక రంగం వెనుకబడుతుంది.
      • ఉదా: India

ఆల్పాభివృద్ధి దేశాల్లో-

  • ఎ) జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా సగం కంటే ఎక్కువగా ఉండును.
  • బి) మొత్తం ఉపాధిలో 3/4 వంతు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది.
  • సి) విదేశీ వ్యాపారంలో ప్రాథమిక రంగం నుండి ఎక్కువ ఎగుమతులుండును.
  • ఇంగ్లాండ్‌లో అయితే 2006లో జాతీయాదాయం వాటాలో 1% వ్యవసాయం గాను, ఉపాధిలో వ్యవసాయ రంగం అందించేది కేవలం 1%
  • India లో జాతీయాదాయంలో వ్వవసాయ రంగం
      • 1950-51లో = 55%
      • 2005-06 నాటికి 21%
      • 2013-14 నాటికి 18% గా తగ్గింది.
  • 2013-14  NI లో పంటలు - 11.8
      • పశుసంపద - 3.9
      • అడవులు - 1.4
      • మత్స్యసంపద - 0.9
  • మొత్తం శ్రామిక జనాభాలో వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామిక జనాభాను పరిశీలిస్తే
    • 1951లో = 72% కాగా,
      • 2004-05 నాటికి 52% పైగా ఆధారపడినారు.
      • 2011-12 నాటికి వ్యవసాయంపై = 48.9%
      • పరిశ్రమలపై - 24.3%
      • సేవలుపై  - 26.94 ఆధారపడినారు.
  • 1950లో ప్రణాళిక సంఘం, ప్రణాళికలు అమలు పరచిన 5 దశాబ్దాల్లో ఈ మార్పు చెప్పుకోదగ్గదికాదు.
    • NI లో వ్యవసాయ రంగం వాటా -
      • 1950-51లో 55%పైనే,
      • 2005-06 నాటికి 21%
      • 2013-14 నాటికి 18% గా తగ్గింది.

4) అధిక జనాభా ఒత్తిడి: ఆల్భాభివృద్ధి దేశాలు అధిక జనాభా వృద్ధిరేటును కల్గి ఉంటాయి.

  • జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండవ దశలో ప్రవేశించి ఉంటాయి.
  • మరణరేటు తగ్గించాయి, కానీ జననరేటును తగ్గించలేవు.
  • అల్ప మరణరేటు, అధిక జననరేటు వల్ల జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉండును. ఫలితంగా అనుత్పాదక జనాభా పెరిగి, ఆధారపడే వారి శాతం పెరిగి, తిరిగి జీవన ప్రమాణాలు పడిపోవును.
  • India లో 1921 నుండి జనాభా పరిణామ సిద్ధాంతంలో 2వ దశలోకి ప్రవేశించినది.
      • 1911-21 మధ్య భారత్‌లో జననరేటు 49, మరణరేటు 49 గానే ఉంది.
      • 1991-2001 మధ్య జననరేటు 25.8, మరణరేటు 8.5 గా నమోదైంది.
      • 2011లో మన దేశంలో జననరేటు 21.8 కాగా, మరణరేటు 7.1.
      • 2001-11 మధ్య జనాభా పెరుగుదల వృద్ధిరేటు - 17.7%
      • 2001-11 మధ్య సాంవత్సరిక వృద్ధిరేటు - 1.6%

5) వెనుకబడిన ఆర్థిక సంస్థలు: ఈ దేశాల్లో పొదుపును సమీకరించే ద్రవ్య సంస్థలు సరిపడినంతగా లేవు.

    • కావున బ్యాంకింగ్‌ రంగం, ద్రవ్య సంస్థలు అభివృద్ధి చెందకపోవుటచే పొదుపు సమీకరణ జరగలేదు.

6) వనరుల అల్బ వినియోగం:

  • అల్పాభివృద్ది దేశాల్లో వనరులను ఉపయోగించక పోవడం గాని, అల్పవినియోగం గాని జరుగును.
  • మూలధనం కొరత వలన గాని, నూతన సాంకేతిక పద్ధతులు వాడక పోవడం వల్ల కానీ, పరిమిత మార్కెట్‌ వలన కాని, దేశాలు ఉన్న వనరులను పూర్తిగా ఉపయోగించుకోలేవు.

7) తక్కువ మానవాభివృద్ధి : వెనుకబడిన దేశాల్లో మానవాభివృద్ధి అల్పంగా ఉంటుంది.

  • విద్య, ఆరోగ్యస్థాయి తక్కువగా ఉండును.
  • విద్య, శిక్షణ, పరిశోధనా, ఆరోగ్యంపై చేసే పెట్టబడులను మానవ మూలధనం అందురు. 
  • India తక్కువ మానవాథివృద్ధిని కల్గి ఉంది.
  • India ని పరిశీలిస్తే 2021 HDR ప్రకారం 189 ప్రపంచ దేశాల్లో 0.609 విలువతో 131వ ర్యాంక్‌ను కలిగి ఉంది. 

8) అల్ప సాంకేతిక పరిజ్ఞానం & ఉత్పాదకత:

  • వెనుకబడిన దేశాలు మూలధనం కొరత వలన అల్ప సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తాయి.
  • మన దేశంలో హరితవిప్లవానికి సంభవించిన ప్రాంతాలల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో రైతులు  పేదరికం వల్ల నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నారు 
  • పారిశ్రామిక రంగంలో కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. అల్ప సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆర్థిక వ్యవస్థలో, పేదరికం వల్ల వ్యక్తుల్లో అల్ప ఉత్పాదకత ఏర్పడును.
9) తక్కువ తలసరి ఆదాయం: కొనుగోలు శక్తి (PPP) ప్రకారం భారత తలసరి ఆదాయం $53560. దీని కంటే USA .తలసరి ఆదాయం 10 రెట్లు ఎక్కువ. (USA PCI PPP ప్రకారం $53,350)
  • అయితే వినిమయ రేటు (Exchange Rate) కంటే PPP ప్రకారం దేశాల మధ్య తలసరి ఆదాయ వ్యత్యాసాలు తక్కువగా ఉన్నాయి.
  • 2013లో India PCI - 1570 US$
  • అల్పాభివృద్ధి దేశాల్లో తలసరి ఆదాయం (తలసరి GNP) తక్కువగా ఉండును.
  • తక్కువ తలసరి ఆదాయం వలన అల్పజీవన ప్రమాణం, అపౌప్టిక ఆహారం, అపరిశుభ్రత ఏర్పడి
  • వ్యాధులు పెరిగి ఆయుర్ధాయం తగ్గును.
  • భారత ఆర్థిక వ్యవస్థలో అల్పాభివృద్ధి లక్షణాలు ప్రతిబింబిస్తున్నాయి.
  • ప్రపంచ అభివృద్ధి నివేదిక. (WDR) ప్రకారం India PCI వినిమయరేటు (Exchange Rate) 1570$. దీని కంటే USA PCI 134 రెట్లు ఎక్కువ ($ 53,470).

10) తక్కువ జీవన ప్రమాణ స్థాయి : 

  • అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు పేదరికం, అపౌష్టిక ఆహారం, వ్యాధులు, నిరక్షరాస్యతతో బాధపడుతూ అల్పజీవన ప్రమాణం కలిగి ఉంటారు.
  • మనదేశంలో కూడా ఈ లక్షణం కనబడను. మన ఆహారంలో మాంసకృత్తుల విలువ తక్కువగా ఉంది.
  • అభివృద్ధి చెందిన దేశాల్లో సగటున 3400 కాలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోగా 1999 నాటికి భారతదేశంలో 2496 కాలరీలు సగటున తీసుకుంటున్నారు.
  • 2011-12లో రంగరాజన్‌ కమిటీ ప్రకారం 20.5% ప్రజలు పేదరికంలో ఉన్నారు. 
  • 2011 జనాభా లెక్కల ప్రకారం 85.5% కుటుంబాలకు మాత్రమే సురక్షితమైన నీరు అందుతుంది.(ఎక్కువ పంజాబ్‌ (97.6), తక్కువ కేరళ (33.6)
  • సురక్షిత నీరు కొరత వల్ల వ్యాధులతో పోరాడే శక్తి తగ్గి శ్రామికుని సామర్థ్యం తగ్గును.

11) అధిక పేదరిక ప్రభావం: India లో పేదరికం

  • NSSO వారి 68వ అంచనాలో 21.9%
  • రంగరాజన్‌ నివేదిక 2011-12లో 29.5%

12) జనాభా సంబంధ లక్షణాలు :

  • అధిక జనసాంద్రత, అధిక శిశుమరణాల రేటు, అల్ప ఆయుర్దాయం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. 
  • అధిక జనసాంద్రతనూ కల్లి ఉంటాయి. ప్రపంచ సగటు జనసాంద్రత - 50, చైనాలో - 141, India లో - 324 మంది కలరు.
  • సగటు ఆయుర్ధాయం తక్కువగా ఉండును. (భారతదేశంలో 2011-15 68.45సం.లు)
  • శిశుమరణాల రేటు ఎక్కువగా ఉండును. (భారతదేశంలో 2013 నాటికి 40)
  • 0-15 సం॥ల మధ్య పిల్లలు, 60 పైన ఉన్న వృద్ధుల అనుపాతం ఎక్కువగా ఉండుటచే అధారపడే
  • వారి భారం ఎక్కువగా ఉండును.
  • 4 సం॥ల లోపు పిల్లల మరణరేటు 2007 నాటికి 16గా ఉంది.

13) ఆర్థిక ద్వందత్వం:

  • అభివృద్ధి చెందిన మరియు వెనుకబడిన దేశాల లక్షణాలు ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో కనబడును.
  • ఒకవైపు ఎడ్లబండి, మరోవైపు మోటర్‌కారు, ఒకబైపు పురాతన సాంకేతిక పద్దతులు, మరోవైపు ఆధునిక సాంకేతిక పద్ధతులు పక్కపక్కనే సహజీవనం చేస్తాయి.
  • సాంప్రదాయ రంగంలోని ఉత్పాదకత కంటే ఆధునిక రంగంలోని ఉత్పాదకత ఎక్కువగాఉండును,
  • బెంజిమెన్‌ హిగ్గిన్స్‌ - “సాంకేతిక ద్వంద్వత్వం” పేర్కొన్నాడు.
  • బోకే - “సామాజిక ద్వంద్వత్వం” పేర్కొన్నాడు.
  • మింట్‌ - “విత్త ద్వంద్వత్వం” పేర్కొన్నాడు.
  • భారతదేశంలో కూడా ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ లక్షణం కనబడును.

14) సాంఘీక, ఆర్థిక అవస్థాపనా సదుపాయాల కొరత

15) తక్కువ వ్యవస్థాపనా నైపుణ్యం

  • షుంపీటర్‌ - “నవకల్పనకు, వ్యవస్థాపకుని పాత్రకు ప్రాధాన్యత ఇచ్చినా

16) భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని క్రింది కారణాల వలన చెప్పవచ్చు:

1) పరిమాణాత్మక మార్పులు :

  • 1) జాతీయాదాయం పెరిగింది (N.I)
  • 2 తలసరి ఆదాయం పెరిగింది (P.C.I)
  • ౩) పొదుపు - పెట్టుబడులు పెరిగినాయి(Saving & Investment)

Keywords: Tspsc economy notes in telugu,tspsc indian economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,economy notes,tspsc indian economy notes in telugu,group 2 indian economy notes in telugu,tspsc indian economy study material in telugu,group 2 indian economy study material in telugu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)