మానవాభివృద్ధి సూచిక

Adhvith
0
National Human Development Index in Telugu

మానవాభివృద్ధి సూచిక (National Human Development Index - HDI)

  • హెచ్‌డిఐ మూలాలు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ (యుఎన్‌డిపి), మానవ అభివృద్ధి నివేదిక (హెచ్‌డిఆర్‌)లలో కనిపిస్తాయి
  • మానవాభివృద్ధి సూచికను 1990 సం॥లో పాకిస్తాన్‌ ఆర్ధిక శాస్త్రవేత్త అయిన మహబూబ్‌-ఉల్‌హక్‌ రూపొందించారు
  • మానవాభివృద్ధి సూచి లెక్కించుటకు ఈ క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు

ఎ) ఆరోగ్య అంశం:

  • దీనిని దీర్ఘకాల ఆరోగ్యవంతమైన అయుర్ధాయం ఆధారంగా కొలుస్తారు
  • కనిష్ట విలువ 20 సం॥లు
  • గరిష్ట విలువ 85 సం॥లు
  • భారతదేశ ఆయు ప్రమాణం - 70 సం॥లు

బి) విద్యా అంశం:

దీనిని రెండు సూచికల చేత గణిస్తారు

  • i) Mean Years of Schooling (MYS) కనిష్ట విలువ -0 సం॥లు, గరిష్ట విలువ.- 15 సం॥లు, భారతదేశ MYS - 5.4 సం॥లు
  • ii) Expected Years of Schooling (EYS) - కనిష్ట విలువ - 0 సం॥లు, గరిష్ట విలువ - 18 సంవత్సరాలు (బాల్యం నుండి మొత్తం జీవితకాల సగటు విద్యాకాలం), భారతదేశ EYS - 11.7 సం॥లు

సి) జీవన ప్రమాణ అంశం:

  • తలసరి ఆదాయం ఆధారంగా దీనిని రూపొందిస్తారు.
  • కనిష్ట విలువ -$100 న
  • గరిష్ట విలువ -$ 75,000
  • India - GNI per Capita (PPP) - $7220
  • HDI గణనకు సూత్రము :
  • అంశపు సూఛీ = (నిజ విలువ - కనిష్ట విలువ)/(గరిష్ట విలువ - కనిష్ట విలువ)
  • మానవాభివృద్ధి సూచిక విలువ 0.8 కంటే అధికంగా ఉన్న వాటిని అత్యధిక అభివృద్ధి గల దేశాలుగా గుర్తిస్తారు
  • మానవాభివృద్ధి సూచిక విలువ 0.7 నుండి 0.799 మధ్య గల దేశాలను అధిక అభివృద్ధి గల దేశాలుగా గుర్తిస్తారు
  • మానవాభివృద్ధి సూచిక విలువ 0.5 నుండి 0.699 వరకు గల దేశాలను మధ్య అభివృద్ధి గల దేశాలుగా గుర్తిస్తారు
  • మానవాభివృద్ధి సూచిక విలువ 0.5 కంటే తక్కువగా గల దేశాలను అత్యల్ప అభివృద్ధి గల దేశాలుగా గుర్తిస్తారు
  • నోట్‌ : హెచ్‌డిఐ విలువ ఎల్లప్పుడు 0-1 మధ్య ఉంటుంది

మానవాభివృద్ధి ఆవశ్యకత :

  1. మానవాభివృద్ధి సాధించడానికి ఆర్థికాభివృద్ధి అవసరం. ఆర్థికాభివృద్ధి మానవాభివృద్ధి సాధించడానికి ఒక సాధనంగా పని చేస్తుంది. సాధించిన ఆర్థికాభివృద్ధిని సమ పంపిణీ ద్వారా మానవాభివృద్ధి సాధించవచ్చు.
  2. మానవాభివృద్ధి అధిక ఉత్పాదకతను ప్రోత్సహిస్తుంది
  3. మానవాభివృద్ధి, జనాభా నియంత్రణ, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మొదలగు సంక్షేమ సూచికల మెరుగును సూచిస్తుంది
  4. భౌతిక పర్యావరణంలో మెరుగుదల - పేదరిక నిర్మూలన, అడవుల నరికివేత, ఎడారి విస్తీర్ణం మొదలగు వాటిని అరికట్టడంలో మానవాభివృద్ధి ముఖ్య పాత్రను పోషిస్తుంది
  5. ఆరోగ్యకరమైన పౌర సమాజ నిర్మాణానికి తోడ్చడుతుంది

మానవాభివృద్ధి అంశాలు

  1. సమానత్వం
  2. సుస్థిరాభివృద్ధి
  3. ఉత్పాదకత
  4. సాధికారిత

మానవాభివృద్ధికి చెందిన వివిధ సూచీలను యుఎన్‌డిపి వివిధ సంవత్సరాలలో ప్రవేశపెట్టింది

  1. మానవాభివృద్ధి సూచిక - 1990
  2. లింగ సంబంధిత అభివృద్ధి సూచి & లింగ సాధికారత కొలమానం - 1995
  3. మానవ పేదరిక సూచిక -1, 1997
  4. మానవ పేదరిక సూచీ - 2, 1998

2010 సం॥లో యుఎన్‌డిపి(UNDP) మానవాభివృద్ధికి సంబంధించి వివిధ సూచీలను ప్రవేశపెట్టింది. అవి:

  1. అసమానతల, మిళిత మానవాభివృద్ధి సూచిక-2010
  2. బహుళ పార్శ్య పేదరిక సూచిక - 2010
  3. అసమానతల మిళిత లింగ సంబంధిత సూచిక - 2010

మానవాభివృద్ధి నివేదిక -2019

  • ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (యుఎన్‌డిపి) మానవ అభివృద్ధి సూచీ (హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌ ఇందెక్స్‌-హెచ్‌డిఐ) నివేదిక 2019 సంవత్సరానికి ర్యాంకులను విడుదల చేసింది.
  • ప్రపంచంలోని 189 దేశాల మాన వనరుల అభివృద్ధి సూచీ-2019 (హెచ్‌డీఐ) జాబితాలో భారత్‌ 131వ స్థానంలో నిలిచింది.
  • భారత్‌లో తలసరి ఆదాయం, సగటు ఆయుర్ధాయం అంశాల్లో భారత్‌ కాస్త మెరుగుపడింది.
  • భారతీయుని సగటు ఆయుర్ధాయం 71 ఏళ్లకు పెరిగింది. 1980లో ఇది 58.9. ఏళ్లుగానే ఉంది 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)