పేదరికం

Adhvith
0
Committees on Poverty in India in Telugu

పేదరికం

పరిచయం
  • Poverty అనే పదం Pauper అనే లాటిన్‌ పదం నుండి వచ్చింది. Pauper అనగా బీడుభూమి/పునరుత్పత్తి సామర్థ్యం లేని పశువు అర్ధం.
  • పేదరికం అనే పదానికి ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రామాణిక నిర్వచనం లేదు. దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ప్రజల స్థితిగతులను బట్టి నిర్వచనం మారుతుంది.
  • పేదరికం అనగా “లేమి స్థితి” ఇది ఆర్ధిక, సాంఘిక సమస్య,
  • కనీస అవసరాలు కూడా లభించని స్థితి “పేదరికం” అని అంటారు.
  • మానవ కుటుంబాలకు మౌళిక అవసరాలైన ఆహారం, గృహవసతి, వస్త్రము కూడా పొందలేని వారిని పేదవారిగా పేర్కొంటారు.
  • UNO వారు “మానవ పేదరికం” అనే నూతన భావనను ప్రవేశపెట్టారు.

 నిర్వచనాలు 

  • UNO: ప్రజల కనీస అవసరాలతోపాటు స్వేచ్చ, సమానత్వం, గౌరవం పొందలేని పరిస్థితి పేదరికం
  • World Bank: కనీస జీవన ప్రమాణాన్ని కూడా పొందలేని స్థితియే పేదరికం”
  • HDR: దీర్హకాల ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు, సౌకర్యాలు కొరవడడం, స్వేచ్చ, స్వాఖిమానం, ఇతరుల నుండి గౌరవం కొరవడడమే పేదరికం ళ్లు
  • అమర్త్యసేన్‌:  “పేదరికం అనుభవించే వాడి బాధను గుడ్దివాడు సైతం చూడగలడు.”
  • ఎం.ఎస్‌. స్వామినాథన్‌: పేదరికం అనే సముద్రంలో మనం ఒక్కరం ఒక దీవిలో సంతోషంగా జీవించలేం.
  • పేదరికాన్ని సాధారణంగా ప్రతి 5 సం॥లకి ఒకసారి లెక్కిస్తారు.
  • పేదరికాన్ని నిరుద్యోగాన్ని NSSO వారు లెక్కిస్తారు, NSSO మరియు CSO ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO)గా ఏర్పడ్డాయి. NITI Aayog అధికారికంగా ప్రకటిస్తుంది. 
  • భారతదేశంలో 1990 దశాబ్దం నుండి పేదరిక తీవ్రత తగ్గుముఖం పట్టినది.

పేదరికం-భావనలు/రకాలు 

  1. నిరపేక్ష పేదరికం
  2. సాపేక్ష పేదరికం

1) నిరపేక్ష పేదరికం (Absolute Poverty) : 

  • కనీస అవసరాలు కూడా తీరని స్థితిని, కనీస వినియోగాన్ని కూడా పొందలేని స్థితిని నిరపేక్ష పేదరికం.
  • ఉదా॥ ధాన్యం, పప్పులు, పాలు, వెన్న మొ॥నవి.
  • ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
  • దీనిని HCR పద్ధతిలో కొలవవచ్చు
  • ఉదా : పాకిస్థాన్‌, అఫ్టనిస్తాన్‌, భారత్‌

2) సాపేక్ష పేదరికం (Relative Poverty): 

  • కనీస అవసరాలు తీరినప్పటికిని అధిక ఆదాయం ఉన్న వారితో తక్కువ ఆదాయం ఉన్న ప్రజలను పోల్చి చెప్పుటనే సాపేక్ష పేదరికం.
  • సమాజంలో పైనున్న 5-10% ఆదాయ వర్గాల వారిని మరియు క్రిందవున్న 5-10% గల ఆదాయ వర్గాల వారికి మధ్య గల తేడా / వ్యత్యాసాన్ని “పోల్చి చెప్పేది” సాపేక్ష పేదరికం.
  • ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ కనిపిస్తుంది.
  • ఉదా : యుఎస్‌ఎ, యుకె
  • దీనిని లారేంజ్‌ వక్రరేఖ (గిని గుణకం) ద్వారా కొలవవచ్చు.
  • “జీవన ప్రమాణ స్థాయిని పోల్చి చెప్పే పేదరికమే” - సాపేక్ష పేదరికం.
  • ఇది ఆదాయ అసమానతలకు సూచిక
  • దీనినే “అసమానతల పరిశీలన” అని కూడా అంటారు
  • ఆదాయ సమానత్వం సాధిస్తే పేదరికం కనుమరుగు అవుతుంది.

పేదరిక రేఖ (Poverty Line):

  • దారిద్య్ర రేఖ: ఒక వ్యక్తి జీవించడానికి కావలసిన కనీస జీవితావసరాలను నిర్ణయించి వాటిని పొందేందుకు చేయవలసిన కనీస వ్యయంను నిర్ధారిస్తారు. ఈ కనీస వ్యయమే దారిద్య్ర రేఖ.
  • దారిద్య్రరేఖ కంటే తక్కువ వ్యయం “చేసేవారిని పేదరికపు రేఖకు దిగువన (BPL)   ఉన్నవారనీ అంతకంటే ఎక్కువ వ్యయం చేసేవారిని పేదరిక రేఖకు పైన (APL) ఉన్నవారు అంటారు.
  • పేదరిక రేఖను రూపొందించినది - నీలకంఠ రత్‌ & దండేకర్‌. వీరి గ్రంథం - "Poverty in India" (1960-61)
  • దాదాబాయి నౌరోజీ రచించిన గ్రంథం - "Poverty and Unbritish Rule in India" (1868)
  • 1962 సం॥రంలో ప్రణాళిక సంఘంచే నియమించబడ్డ వర్కింగ్‌ గ్రూప్‌ అంచనాల ప్రకారం ఐదుగురు కుటుంబ సభ్యులు కలిగివున్న కుటుంబ పరిమాణపు కనీస వినియోగ వ్యయం 1960- 61 ధరలలో గ్రామీణ ప్రాంతాలలో నెలసరి రూ.100/-లేదా తలసరి రూ.20/-గాను, పట్టణ ప్రాంతాలలో ఈ వ్యయం నెలకు రూ.125/- లేదా తలసరి రూ.25/-గా పేర్కొన్నది.
  • 1969 సం॥లో పౌష్టికాహార నిపుణుల సలహా మేరకు ప్రణాళిక సంఘం లభ్యమయ్యే కేలరీల శక్తిని బట్టి కనీస పోషకాహార స్థాయిని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,400. కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2,100 కేలరీలు శక్తినిచ్చే ఆహారాన్ని ప్రాతిపదికగా తీసుకుని పేదరికంను నిర్వచించారు.
  • 1973-74 సం॥ను పేదరికపు గీత నిర్ణయించడంలో, జీవన ప్రమాణంను అంచనా వేయడానికి ప్రాతిపదికగా తీసుకుని నెలసరి తలసరి వినియోగ వ్యయం (Monthly per capita consumption expenditure - MPCE)ని గ్రామాల్లో రూ.49/- గాను, పట్టణాల్లో రూ.56/-గాను తీసుకున్నారు. కాలానుగుణంగా ఇది పెరుగుతూ వచ్చింది.
  • NSSO వారి 68వ రౌండ్‌లో గ్రామాల్లో MPCE రూ.816/- (రోజుకి రూ.27.2) గాను, పట్లణాలో రూ.1000/- (33.83 రోజుకి) గానూ నిర్ణయించారు. మన దేశంలో Large Sample Survey ద్వారా NSSO ప్రతి 5 సం॥ల కొకసారి కుటుంబ వ్యయంను అంచనా వేస్తారు. 
  • నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) మే 2019 వరకు భారత ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వ శాఖ కింద పనిచేసింది. 23 మే 2019న, భారత ప్రభుత్వం NSSO ని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (CSO)తో విలీనం చేసి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌ను ఏర్పాటు చేయాలనే ఉత్తర్వును ఆమోదించింది. (NSO) గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) నేతృత్వంలో NSO కి నాయకత్వం వహిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

పేదరికంను లెక్కించే పద్ధతులు

  • MPCE ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తారు.

లెక్కించే పద్దతులు :

  1. తలల లెక్కింపు పద్ధతి (Head Count Ratio)
  2. గినీ సూచి (Gini Index)
  3. సేన్‌ సూచి (Sen-Index)
  4. పేదరిక అంతర సూచి (Poverty Gap Index)

1. తలల లెక్కింపు నిష్పత్తి (Head Count Ratio):

  • దీనిని రూపొందించినది - నీలకంఠ రథ్‌ & దండేకర్‌
  • ప్రపంచ వ్యాప్తంగాను & భారతదేశంలోనూ ఈ పద్దతి ద్వారానే పేదరికాన్ని కొలుస్తున్నారు.
  • ఈ విధానంలో “పేదరిక రేఖ” ఆధారంగా పేదవారి సంఖ్యను లెక్కిస్తారు
  • ఈ పద్ధతిని నిరపేక్ష పేదరికాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు.
  • ఇది పేదరికాన్ని లెక్కించడానికి ఉత్తమమైన పద్దతి.
  • ఇది కేవలం పేదరిక శాతాన్ని గణిస్తుంది. కానీ పేదరికంలోని తీవ్రతను తెలుపదు.
  • పేదరికపు శాతం = (BPL ప్రజలు/మొత్తం జనాభా) * 100
  • H = \frac{q}{n} \times 100
  • H = HCR, q = BPL ప్రజలు, n = మొత్తం జనాభా

2. గిని సూచి (Gini Index)

  • దీనిని రూపొందించినది - గినీ, అభివృద్ధి పరిచినది - లారెంజ్‌.
  • దీని ద్వారా “సాపేక్ష పేదరికాన్ని” లెక్కించవచ్చు.
  • గిని సూచిక ఆధారంగా లారెంజ్‌ అనే ఆర్థికవేత్త “లారెంజ్‌ వక్రరేఖొను నిర్మించాడు.
  • లారెంజ్‌ వక్రరేఖ అనేది “ఆదాయ వాస్తవ పంపిణీ రేఖ”
  • లారెంజ్‌ వక్రరేఖ ఆదాయ సమవిభజన రేఖ కాదు. మరియు “ఆదాయ సమపంపిణి రేఖ” కాదు

  • 1912లో ఇటలీకి చెందిన ప్రొఫెసర్‌ గిణి Variability and Mutability రచించారు. ఇతను అసమానతలు లెక్కించేందుకు గిణి గుణకం ప్రతిపాదించారు.
  • గిణి గుణక విలువ 0-1 మధ్య ఉంటుంది
  • '0' అంటే ఆదాయ అసమానతలు ఉండవు. (సంపూర్ణ సమానత్వం)
  • '0' దగ్గరగా ఉంటే - ఆదాయ అసమానతలు తక్కువ
  • '1' దగ్గరగా ఉంటే - ఆదాయ అసమానతలు ఎక్కువ

3. సేన్‌ పేదరిక సూచి (Sen-Index / P-Index):

  • HCR లోని లోపాలను సరిదిద్దటానికి అమర్య్యసేన్‌ తన -పేదరిక కొలమానిని రూపొందిచారు.
  • HCR లో ప్రధాన లోపం పేదరిక తీవ్రత గుర్తించకపోవడం.
  • ఇది నిరపేక్ష వర్గానికి చెందిన ఒక కొలమానిని.
  • పేదవారి ఆదాయాల్లో ఉండే అసమానతలు/అంతరాల పేదరిక సాంద్రతను లెక్కించుటకు & నిరుపేదలను లెక్కించుటకు ఇది ఉపయోగపడుతుంది.
  • పేదరిక రేఖను దగ్గరగా ఉన్నవారిని పైకి తీసుకొచ్చే దానికంటే, పేదరిక రేఖకు దూరంగా ఉన్న వారిని పైకి తీసుకురావడం వల్ల సమాజ సంక్షేమం ఎక్కువగా ఉంటుందని అమర్త్యసేన్‌ పేర్కొన్నాడు.
  • సేన్‌ పద్దతిని మెరుగైన పద్దతిగా భావిస్తున్నారు.
  • ఆమర్య సేన్‌కు 1998లో అర్ధ శాస్త్రంలో నోబల్‌ బహుమతి లభించింది. (ఆసియా నుంచి మొదటివాడు).
  • ఇతను సంక్షేమ అర్ధశాస్త్రంపై అధ్యాయనం చేశాడు. ఇతను రాసిన పుస్తకం - "Choices of Techniques"

4. పేదరిక అంతర సూచి (Poverty Gap Index):

  • దీనిని ప్రపంచ బ్యాంక్‌ ఆర్ధిక నిపుణులు 'గౌరవదత్‌ & మార్టిన్‌ రావాలియన్‌”లు రూపొందించారు.
  • Regional Disparties & the Poverty in India (1989) గ్రంథం రచించారు.
  • గౌరవదత్‌ రాసిన మరొక గ్రంథం - Has poverty declaimed, since Economic Reforms?
  • జాతీయ పేదరిక విలువను & వివిధ రాష్ట్రాల్లోని సగటు తలసరి నెలసరి వినియోగ వ్యయానికి మధ్య గల వ్యత్యాసాన్ని బట్టి రాష్ట్రాల్లో పేదరిక సాంద్రతను లెక్కించడానికి "Poverty Gap Index" ఉపయోగపడును.
  • పేదరిక అంతరం = (పేదరిక రేఖ - BPL ప్రజల సగటు ఆదాయం)/పేదరిక రేఖ

పేదరిక తీవ్రతను పేదలో గల అంతరాలను తెలుసుకునేందుకు దీనిని ఉపయోగిస్తారు.

MDPI (Multi Dimensional Poverty Index)

  • Oxford University & UNDP వారు అభివృద్ధి చేశారు.
  • ఆయుర్ధాయం, అక్షరాస్యత, జీవన ప్రమాణం మొదలైన అంశాల ఆధారంగా దీనిని రూపొందించారు.

పేదరిక పద్ధతులు:

NSSO వారు పేదరికాన్ని 2004-05, 61వ రౌండ్‌లో పేదరికాన్ని 2 రకాలుగా గణించెను.

అవి: 1. URP - Uniform Recall Period    2. MRP - Mixed Recall Period

  • 1. URP - Uniform Recall Period: అన్ని వస్తువులపై చేసే వ్యయంను 30 రోజులకు గాను లెక్కించదాన్ని URP అంటారు.
  • 2. MRP - Mixed Recall Period: అన్ని వస్తువులపై చేసే వ్యయమును 30 రోజులకు గాను మరియు 5 రకాల ప్రధాన ఆహారేతర వస్తువులపై 365 రోజులకు గాను లెక్కించడాన్నిMRP అంటారు.
  • 1. వస్త్రాలు 
  • 2. పాదరక్షలు
  • 3. మన్నిక గల గృహ వస్తువులు. 
  • 4. విద్య
  • 5. సంస్థాగత వైద్యం / ఆరోగ్యం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)