Poverty Estimates in India
దేశంలో పేదరికం - అంచనాలు
1. దాదాబాయ్ నౌరోజీ
- స్వాతంత్ర్యానికి పూర్వం దాదాబాయ్ నౌరోజీ పేదరికం అంచనా వేశారు.
- ఇతని గ్రంథం "Poverty and Unbritish Rule in India"
- ఈ గ్రంథంలో Jail Cost of Living పేరుతో పేదరికంను అంచనా వేసారు. పేదరికాన్ని లెక్కించుటకు జైలు ఖైదీల సగటు ఆహారానికి అయ్యే ఖర్చును ఆధారంగా తీసుకుని లెక్కించుట వలన ఈ పద్ధతిని Jail Cost Method అంటారు.
2, నీలకంఠ రథ్ & దందేకర్:
- వీరు రచించిన గ్రంథం "Poverty in India"
- ఈ గ్రంథంలో పేదరికాన్ని అంచనా వేశారు.
- వీరు మొదటిసారిగా సగటున ఒక రోజుకు 2,250 కేలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని ప్రామాణికంగా
- తీసుకుని పేదరికాన్ని అంచనావేశారు.
- వీరు 1960-61 ధరలలో పేదరికాన్ని అంచనా వేశారు. తలసరి నెలసరి వినియోగ వ్యయం MPCE గ్రామాలలో రూ. 15/-లు మరియు పట్టణాలలో రూ. 22.50/-లుగా తీసుకున్నారు. ఈ ప్రకారంగా దేశంలో పేదరికం 41%గా నమోదు అయినది.
- వీరు పేదరికాన్ని తలల లెక్కింపు నిష్పత్తి (Head Count Ratio) పద్ధతిన లెక్కించారు.
- 1962 సంవత్సరంలో నీలకంఠ రథ్ & దండేకర్ పేదరిక కొలమాన పద్ధతిని ఆమోదించి, ఆహార వినియోగ వ్యయం ఆధారంగా' పేదరికం లెక్కింపు జరిగినది.
3. పి.డి. ఓజా:
- ఇతను 1960-61లో పేదరికాన్ని లెక్కించారు.
- Head Count Ratio (తలల లెక్కింపు నిష్పత్తి) పద్ధతిన, 2250 కేలరీల శక్తిని ప్రామాణికంగా తీసుకుని లెక్కించారు.
- ఇతని అంచనాల:'ప్రకారం భారతదేశ పేదరికం 44%గా నమోదయినది.
4. మిన్హాస్:
- ఇతని గ్రంథం "Planning and the Poor" అనే గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేశారు.
- మిన్హాస్ తన గ్రంథంలో 1951 నుండి భారతదేశం ప్రణాళికలను, ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థను అమలు పరుస్తున్నప్పటికీ ప్రణాళిక వ్యూహాలు ఆశించిన స్థాయిలో పేదరికం తగ్గించుటకు సహకరింలేదని వివరించారు.
- ఓజా, బర్దన్, చాటియా, మాంటెక్‌సింగ్, అహ్లు వాలియా, డకోస్టా మొదలైన ఆర్థికవేత్తలు భాతర దేశంలో పేదరికాన్ని అంచనావేశారు. వీరు పేదరిక్షాన్ని ఆహార కెలరీల ప్రాతిపాదికగా లెక్కించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో పేదరికం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
- 5,6 ప్రణాళికల నుండి భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక పథకాలను అమలు చేయుట ప్రారంభించారు.
- 7వ ఆర్థిక సంఘం ప్రైవేటు వ్యయానికి ప్రభుత్వ వ్యయం చేర్చి వృద్ధి చేసిన పేదరికపు రేఖ (Augmented Poverty Line) అనే భావనను అభివృద్ధి చేసినది.
పేదరికంపై వేసిన కమిటీలు:(Committees on Poverty in India) Committees on Poverty in India
- డా. వై.కె.అలఘ్ కమిటీ - 1977
- లక్డావాలా కమిటీ - 1993 నివేదిక
- సురేష్ టెండూల్కర్ కమిటీ - 2009 నివేదిక
- N.C. సక్సేనా కమిటి - 2008
- S.R. హసీం కమిటి - 2010
- రంగరాజన్ కమిటి - 2012
1. డా. వై.కె. అలఘ్ కమిటీ: (Y K Alagh Committee on Poverty in Telugu)
- 1977 ఏర్పాటు / ఈ కమిటీ 1977లో నివేదిక సమర్పించింది.
- గ్రామీణ ప్రాంతాలలో 2400 కేలరీల శక్తి.ఇచ్చే ఆహారం, పట్టణ ప్రాంతాలలో 2100 కెలరీల శక్తిని ఇచ్చే ఆహారాన్ని ప్రతిపాదితగా తీసుకుని పేదరికాన్ని లెక్కించాలని సిఫారసు చేసినది.
2. లక్డావాలా కమిటీ: (Lakdawala Committee on Poverty in Telugu)
- ఈ కమిటీని 1989 లో ప్రణాళిక సంఘం నియించినది
- 1998లో నివేదికను సమర్పించారు
- పేదరికంపై వేసిన మొట్టమొదటి కమిటీ
లక్డావాలా కమిటీ సూచనలు (Lakdawala Committee Suggestions on Poverty)
- URP (Uniform Recall Period) పద్దతిని అనుసరించాలని సూచించినది.
- గ్రామీణ ప్రాంతవాసులు ఒక రోజుకి సగటున 2400 కెలరీల శక్తినిచ్చే ఆహారం, పట్టణ ప్రాంత వాసులు
- రోజుకి సగటున 2100 కెలరీల శక్తినిచ్చే ఆహారం ఆధారంగా పేదరికాన్ని లెక్కించారు. ఈ రెండింటిని నెలవారి రూపంలోనికి మార్చాలి.
- HCR (Head Count Ration)పద్దతి ఆధారంగా ఉపయోగించి వివిధ రాష్ట్రాల వారిగా పేదరికాన్ని లెక్కించాలని సూచించారు.
- రాష్ట్రాల వారీగా పేదరికాన్ని లెక్కించాలి
- ఈ కమిటీ రాష్ట్రాల మధ్య ఉండి, ధరల వ్యత్యాసం బట్టి ఆయా రాష్ట్రాలు ప్రత్యేక వినియోగదారుల ధరల సూచి ఆధారంగా పేదరికాన్ని గణించాలని సూచించింది
3. సురేష్ టెండుల్కర్ కమిటీ: (Suresh Tendulkar Committee on Poverty in Telugu)
- పేదరికపు అంచనా పద్దతిని సమీక్షించేందుకు సురేష్ టెండూల్కర్ అధ్యక్షతన నిపుణుల కమిటీని 2005 డిసెంబర్‌లో ప్రణాళిక సంఘం నియమించింది.
- ఈ కమిటి 2009లో నివేదిక సమర్పించినది.
- నివేదికలోని ముఖ్యాంశాలు :
- ఎ) NSSO ద్వారా సేకరించిన ప్రైవేటు (గృహ) కుటుంబ వినియోగ వ్యయం ఆధారంగానే పేదరిక అంచనాలు ఆధారపడి ఉండాలి.
- బి) ప్రస్తుతం ఉన్నURP పద్దతికి బదులుగా MRP (Mixed Recall Period) పద్దతిని అనుసరించారు.
- సి) పేదరిక అంచనాలకు కేవలం కెలరీల వినియోగం మాత్రమే ప్రామాణికంగా ఎంచుకోరాదు. దీనికి బదులుగా Cost of Living Index ను ఉపయోగించాలి.
- డి) MRP (Mixed Recall Period) వద్ద్ధతిలో Urban Poverty Basket Line (UPLB) ను ఉపయోగించాలి.
- ఇ) ఈ కమిటీ పేదరికపు గీతను నిర్ణయించుటకు నెలవారి ఆహార వ్యయంతోపాటు అధనంగా ఐదు అంశాలపై వార్షిక సగటు వ్యయాలు కూడా తీసుకోవాలని సూచించినది. ఆ ఐదు అంశాలు
- 1. వస్త్రాలు 2. విద్య 3. సంస్థాగత వైద్యం 4.మన్నికగల వస్తువులు 5. పాదరక్షలు.
- నోట్: 2009 డిసెంబర్ నుంచి ప్రణాళిక సంఘం లక్టావాలా కొలమాన పద్ధతిని రద్దుచేసి, దాని స్థానంలో సురేష్ టెండుల్కర్ కొలమాన పద్ధతిని ప్రామాణికంగా పరిగణిస్తున్నట్లు ప్రకటన చేసినది.
- 2009 వరకు యు.ఆర్.పి. పద్ధతి ప్రామాణికంగా ఉండేది.
4. N.C.సక్సెనా కమిటి - 2008 డిసెంబర్: (NC Saxena Committee on Poverty in Telugu)
- గ్రామీణ ప్రాంతాల్లో BPL (Below Poverty Line) కుటుంబాలను గుర్తించేందుకు సరియైన పద్దతిని సూచించడానికి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2009 నియమించినది. (BPLసెన్సెస్ లెక్కించడానికి; పేదరిక అంచనాలకు కాదు)
- ఈ కమిటీ 2009 ఆగష్టు 21న నివేదిక సమర్పించినది.
- 3 రకాల విధానాలు సూచించారు.
1వ పద్దతి: అటోమెటిక్ ఎక్స్‌క్లూజన్
ఈ క్రింది కుటుంబాలను బి.పి.ఎల్.నుంచి తొలగించాలని సూచించారు.
- జిల్లా వ్యవసాయ కుటుంబ సగటు కమతానికి రెట్టింపు భూమి ఉన్నవారు (పాక్షికంగా గానీ, సంపూర్ణంగా గానీ నీటి సదుపాయం ఉన్న భూమి రెండు. రెట్లు మరియు సాగునీటి సదుపాయం లేని భూమి మూడురెట్లు ఉన్నవారు.)
- మూడు లేదా నాలుగు చక్రాల వాహనం గలవారు
- వ్యవసాయ యంత్రాలు కలిగివున్నవారు (ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లు మొదలైనవి).
- నెలకు రూ.10,000/- జీతం పొందే వ్యక్తుల గల కుటుంబాలు (ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో మరియు ఎన్‌జీవో మొదలైనవాటిలో)
- ఆదాయపన్ను చెల్లింపుదారులు
- ప్రభుత్వ ఉద్యోగం గల కుటుంబాలు
- ల్యాండ్ ఫోన్, జనరేటర్ సౌకర్యం గల కుటుంబాలు
- మూడు లేదా అంతకు మించి గదులు కలిగిన పక్కా గృహాలు.
- కిసాన్ క్రెడిట్ కార్డు కలిగి రూ.50,000/- అంతకు మించి వ్యవసాయ రుణాలు పొందుటకు అర్హత గల కుటుంబాలు.
2వ పద్దతి: ఆటోమెటిక్ ఇన్‌క్లూజన్
- కొన్ని రకాల కుటుంబాలను “ఇన్‌క్లూజన్” చేయాలని సూచించినది. అనగా వీటిని BPL లో చేర్చాలని సూచించారు.
- గిరిజన గ్రూపులు
- మహాదళిత గ్రూపులు (రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన గ్రూపులు కూడా)
- వికలాంగులు ప్రధాన ఆహార సంపాదకుడిగా ఉన్న కుటుంబాలు
- కుటుంబ యజమాని ఒంటరి స్త్రీ అయిన కుటుంబాలు
- మైనర్ అయిన వ్యక్తి కుటుంబ యజమానిగా ఉన్న కుటుంబాలు
- గృహాలు లేని కుటుంబాలు
- కుటుంబంలోని ఎవరైన ఒక వ్యక్తి కట్టుబానిస గల కుటుంబాలు
3వ పద్దతి:
ఈ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు అదనముగా నిబంధనలను చేర్చి BPL కుటుంబాలుగా గుర్తించవచ్చును.
5. S.R. హసీం కమిటీ - 2010మే 01 (SR Hashim Committee on Poverty in Telugu)
- పట్టణ ప్రాంతాల్లో BPL కుటుంబాలను గుర్తించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
- ఈ కమిటీ కూడా Automatic Exclusion, Automatic Inclusion లను తీసుకోవాలని సూచించింది.
- ఈ కమిటీ మూడు పద్ధతుల విధానాన్నే సూచించినది.
1వ పద్దతీ: అటోమెటిక్ ఎక్స్‌క్లూజన్
ఈ క్రింది కుటుంబాలను BPLనుంచి తొలగించాలని సూచించారు.
- ఈ కమిటీ సిఫారసు మేరకు రిఫ్రిజిరేటర్, టూవీలర్, టెలిఫోన్, వాషింగ్ మిషన్. ఈ నాలుగింటిలో మూడింటిని కలిగి ఉండే కుటుంబాలు.
- నాలుగు చక్రాల వాహనము, ఏసీ, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఇంటర్నెట్ సౌకర్యంతో గల ఈ మూడు వస్తువులలో ఏదైనా ఒక వస్తువుగల కుటుంబాలు.
- నాలుగు లేదా అంతకు మించి గదులు ఉన్న కుటుంబాలు.
2వ పద్దతి: ఆటోమెటిక్ ఇన్‌క్లూజన్
కొన్ని రకాల కుటుంబాలను “ఇన్‌క్లూజన్” చేయాలని సూచించినది. అనగా వీటిని BPL లో చేర్చాలని సూచించారు.
- 1) గృహాలు లేని కుటుంబాలు
- 2) సాంఘిక, వృత్తిపరమైన పేదరిక సమస్యలను ఎదుర్కోనే కుటుంబాలు
- 3) ఒక కుటుంబంలోని సభ్యులు యాచక వృత్తిలో గానీ, రాళ్లు కొట్టుకునే వృత్తిలోగానీ, వీధులు ఊడ్చే వారు గానీ, పారిశుద్ధ్య పనివారు గానీ, దినసరి కూలీలుగా గానీ, పని మనుషులుగా గానీ ఉండే కుటుంబాలు.
- 4) కుటుంబ ప్రధాన పోషకుడిగా ఈ క్రింది వారు గల కుటుంబాలు
- ఎ) ఒంటరి మహిళ బి) వికలాంగులు సి) మైనర్లు డి)తీవ్ర వ్యాధిగ్రస్తులు
3వ పద్దతి :
- పేదరికానికి సంబంధిన ఇతర అంశాలు పరిగణించి BPL కుటుంబాలుగా నిర్ణయించుట.
6. రంగరాజన్ కమిటీ (Rangarajan Committee on Poverty)
- ప్రధానమంత్రి సూచనల మేరకు ప్లానింగ్ కమీషన్ ఈ కమిటీని 2012లో నియమించినది.
- సురేష్ టెండుల్కర్ సూచనల పేదరిక అంచనాలపై అనేక విమర్శలు రావడంతో రంగరాజన్ కమిటీ నియమించారు.
- సురేష్ టెండుల్కర్ కొలమాన పద్ధతిని సమీక్షించుటకు ఈ కమిటీ (రంగరాజన్ కమిటీ)ని ఏర్పాటు చేశారు.
రంగరాజన్ కమిటీలోని సభ్యులు (Members in Rangarajan Committee on Poverty in Telugu)
- ప్రొ|| మహేందర్ దేవ్
- మహేష్ వ్యాస్.
- కె.ఎల్. దత్త
- కె. సుందరం.
- ఈ కమిటీ సురేష్ టెండూల్కర్ కొలమాన పద్దతిన పున: సమీక్షించుటకు ఏర్పాటు చేయడం జరిగింది.
- ఈ కమిటీ 2014 జూన్‌లో నివేదిక ఇచ్చినది.
- కుటుంబం చేసే వినియోగ వ్యయం ఆధారంగా పేదరికాన్ని గణిస్తారు.
- చత్తీస్‌ఘడ్ - 47.9%
- మణిపూర్ - 46.7%
- ఒరిస్సా - 45.9%
- మధ్యప్రదేశ్ - 443%
- జార్ఖండ్ - 42.4%
పేదరిక శాతం తక్కువ గల రాష్ట్రాలు
- గోవా - 6.8%
- హిమాచల్ ప్రదేశ్ - 10.9%
పేదరిక శాతం ఎక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతాలు
- దాద్రానగర్‌హవేలి
- దామన్‌దడయ్యూ
పేదరిక శాతం తక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతాలు
- అండమాన్ నికోబార్ దీవులు
- లక్షదీవులు
- పుదుచ్చేరి/ పాండిచ్చేరి
- భారతదేశంలో పట్టణ పేదరికం కన్నా గ్రామీణ పేదరికం ఎక్కువ.
- భారత దేశంలో 1973-74 నుండి 2011-12 నాటికి పేదరికం సగానికి ఎక్కువగా తగ్గింది.
- భారతదేశంలో పేదరికంలో తగ్గుదల గ్రామాలలో కంటే పట్టణాలలో ఎక్కువగా తగ్గింది.