భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు

Adhvith
0
National Income Estimates in India in Telugu

భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలు (National Income Estimates in India)

  • బ్రిటీష్‌ పరిపాలన కాలంలో జాతీయ ఆదాయాన్ని ప్రభుత్వపరంగా లెక్కించలేదు. కానీ కొంత మంది వ్యక్తులు వ్యక్తిగతంగా లెక్కించారు.

1. దాదాబాయ్‌ నౌరోజీ:

  • 1867-68 సంవత్సరానికి గాను లెక్కించారు. 1876లో లెక్కించాడు. జాతీయ ఆదాయం 3840 కోట్లు, తలసరి ఆదాయం రూ.20, జనాభా 17 కోట్లు అని పేర్కొన్నాడు.
  • భారతదేశ పేదరిక సమస్యలను "Poverty of Unbritish Rule in India" అనే [గ్రంథంలో వివరించాడు. ఈ గ్రంధంలో డ్రైయిన్‌ థియరీ గురించి వివరించాడు.
  • భారతదేశ సంపదను Home Charges రూపంలో ఇంగ్లాండ్‌ ప్రభుత్వం ఎలా దోచుకుందో వివరించారు.

2. Dr. V.K.R.V Rao (విజయేంద్ర కస్తూరి రంగ వరద రాజరావు)

  • ఇతను 1925-29లో "An Essay on Indian National Income" అనే వ్యాసం రాసాడు.
  • 1931-32లో “బిటీష్‌ ఇండియాలో జాతీయ ఆదాయం” (National Income in British India) అనే గ్రంథం రాశాడు.
  • ఇతని లెక్కల ప్రకారం జాతీయాదాయం  → 1689 కోట్లు, తలసరి ఆదాయం → రూ.62/-
  • Dr. V.K.R.V Rao ఆర్థిక వ్యవస్థను రెండు రకాలుగా విభజించాడు.
    • i) వ్యవసాయ రంగం: వ్యవసాయం, అటవీ సంపద, గనులు, పశుపోషణ, చేపల పెంపకం మొదలైనవి.
    • ii) కార్పొరేషన్‌ రంగం: పరిశ్రమలు, నిర్మాణం, వ్యాపారం, రవాణా ప్రభుత్వ సేవలు మొదలైనవి.
      • వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మదింపు పద్దతి ద్వారా మరియు కార్పొరేషన్‌ రంగంలో ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని గణించాడు.
      • ఇతడి జాతీయ ఆదాయ గణనను శాస్త్రీయ విధానంగా భావిస్తారు.

3. అట్మిన్‌సన్‌ :

  • 1875లో జాతీయ ఆదాయ గణన చేసాడు
  • ఇతని ప్రకారం జాతీయ ఆదాయం → 574 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.31/-

4. బెరింగ్‌ & బార్బర్‌:

  • 1888లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు.
  • ఇతని ప్రకారం. జాతీయ ఆదాయం → రూ.574 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.27/-

5. లార్డ్‌ కర్ణన్‌ (1897-98):

  • 1897-98 సం॥ని జాతీయ ఆదాయ గణన చేశారు.
  • జాతీయ ఆదాయం → రూ.675/-
  • తలసరి ఆదాయం → రూ.80/-

6. విలియం డిగ్బీ :

  • 1899లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు.
  • ఇతని ప్రకారం జాతీయ ఆదాయం → 428 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ. 19/-

7. బి.ఎన్‌.శర్మ :

  • 1911లో జాతీయ ఆదాయ గణన చేశారు.
  • జ తలసరి ఆదాయం → రూ.50/-

8. వాడియా & జోషి:

  • 1913-14లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు.
  • ఇతని ప్రకారం జాతీయ ఆదాయం → 1087 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.44/-

9. షా & కంబట్టా:

  • 1921-22లో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు.
  • వీరు Wealth & Taxable Capacity of India అనే గ్రంథంలో జాతీయ ఆదాయాన్ని వివరించాడు.
  • ఇతని ప్రకారం జాతీయ ఆదాయం → 2364 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.76/-

10. ఫిండ్లే షిరాన్‌:

  • ఇతను జాతీయ ఆదాయాన్ని అత్యదిక సార్లు లెక్కించాడు. (1911, 1922, 1981 సం॥లలో మూడుసార్లు లెక్కించాడు)
  • 1911 → జాతీయ ఆదాయం →  రూ.1942/-, తలసరి ఆదాయం → రూ.80/-
  • 1931 → జాతీయ ఆదాయం → రూ.1689 కోట్లు, తలసరి ఆదాయం → రూ.62/-

11. బి.నటరాజన్‌:

  • 1938-39లో జాతీయ ఆదాయం గణన చేశారు.
  • ఇతని ప్రకారం జాతీయ ఆదాయం → 1482 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.67/-

12. వాణిజ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం:

  • 1945-46లో జాతీయ ఆదాయం గణన చేశారు.
  • జాతీయ ఆదాయం → 6284 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.198/-

13. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ:

  • 1949లో భారత ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. దీనినే High Power Export Committee అంటారు.
  • దీని అధ్యక్షుడు → P.C Mahala Nobis
  • సభ్యులు → 1) D.R. Gadgil    2) V.K.R.V. Rao
  • సైమన్‌కుజ్‌నట్స్‌ & స్టోన్‌ అనే అంతర్జాతీయ ఖ్యాతి గణించిన ఆర్థికవేత్తలు ఈ కమిటీకి సహకరించారు.
  • మొదటిసారిగా ఈ కమిటీ దేశం మొత్తానికి జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కించినది.
  • ఈ కమిటీ మొదటి నివేదికను 1951లో, చివరి నివేదికను 1954లో సమర్పించినది.
  • ఈ కమిటీ జాతీయ ఆదాయాన్ని 1948-49 ధరలలో లెక్కించినది..
  • ఈ కమిటీ లెక్కల ప్రకారం జాతీయ ఆదాయం → 8,710 కోట్లు
  • తలసరి ఆదాయం → రూ.225
  • 1940లో సాంఘిక గణన మొదటిసారిగా మిడ్‌ & స్టోన్‌ అనే ఆర్థికవేత్తలు ప్రవేశపెట్టారు.
  • భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మిశ్రమ పద్ధతిలో లెక్కిస్తారు.
  • ఇండియాలో జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థ కేంద్ర గణాంక సంస్థ (CSO-1951)
  • జాతీయ ఆదాయాన్ని CSO 1954 నుండి గణిస్తుంది.
  • CSO జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలలో మరియు స్థిర ధరలలో లెక్కిస్తుంది.
  • ప్రారంభంలో CSO గణాంకాలను వైట్‌ పేపర్‌గా పిలిచేవారు. దీనినే 1977 నుండి National Accounts & Statistics (NAS)పేరుతో ప్రచురిస్తున్నారు.

జాతీయాదాయ - అంచనాలు

  •  CSO జాతీయాదాయ అంచనాలు మనకు 3 శ్రే ణుల్లో లభిస్తాయి.
  • అవి: 1. సాంప్రదాయక శ్రేణులు (Conventional Series)
  • 2. సవరించిన శ్రేణులు (Revised Series)
  • 3. నవ్య శ్రేణులు (New Series)

1. సాంప్రదాయక శ్రేణులు:

  • ఈ శ్రేణులలో జాతీయాదాయాన్ని ప్రస్తుత ధరల్లో 1948-49 ధరల్లో లెక్కించారు.
  • ఈ శ్రేణులలో 1948-49 సంవత్సరం నుంచి 1964-65 సంవత్సరం వరకు జాతీయాదాయ వివరాలు తయారు చేశారు.
  • సాంప్రదాయక శ్రేణులలో ఆర్థిక వ్యవస్థను 13 రంగాలుగా విభజించడం జరిగింది.
  • వీటిలో వ్యవసాయం, పశుపోషణ, అడవులు, మత్స్య పరిశ్రమ, గనులు, పరిశ్రమలు, మొదలైన 6 రంగాలను ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా, చిన్న తరహా సంస్థలు, బ్యాంకింగ్‌, గృహ బంధమైన ఆస్తులు, వ్యాపారం, రవాణా మొదలైన రంగాలలో ఆదాయ..మదింపు పద్ధతి ద్వారా జాతీయాదాయాన్ని లెక్కించారు.

2. మొదటిసారి సవరించిన శ్రేణులు(1960-61):

  • జాతీయాదాయాన్ని ప్రస్తుత ధరల్లో 1960-61 ధరల్లో, 1960-61 సంవత్సరం నుంచి 1975-76 సంవత్సరం వరకు లెక్కించారు.

3. రెండవ సవరించిన శ్రేణులు(1970-71):

  • 1960-61కి బదులుగా 1970-71ని ఆధార సంవత్సరంగా తీసుకొని జాతీయాదాయాన్ని లెక్కించడమైంది.
  • ఈ సవరించిన శ్రేణుల ప్రకారం ఆర్థిక వ్యవస్థను 15 రంగాలుగా విభజించారు. అవి

  1. వ్యవసాయం 
  2. పెద్ద తరహా పరిశ్రమలు 
  3. రవాణా-కమ్యూనికేషన్స్‌
  4. అడవులు 
  5. చిన్న తరహా పరిశ్రమలు 
  6. వ్యాపారం-నిల్వలు
  7. మత్స్యపరిశ్రమ 
  8. విద్యుచ్చక్తి 
  9. హోటళ్లు - బ్యాంకింగ్‌ - భీమా
  10. గనులు 
  11. గృహా సంబంధమైన ఆస్థులు  
  12. నిర్మాణం
  13. ప్రభుత్వ పరిపాలన-రక్షణ ఇతర సేవలు 
  14. గ్యాస్‌-నీటి సరఫరా 
  15. విదేశీ వ్యాపార వ్యవహారాలు.

4. మూడవ సవరించిన శ్రేణులు(1980-81):

  • కేంద్ర గణాంక సంస్థ (CSO) కొత్త శ్రేణులలో జాతీయాదాయ అంచనాల ఆధార సంవత్సరం 1970-71 బదులుగా 1980-81ని తీసుకుంది.
  • ఈ శ్రేణులలో జాతీయాదాయాన్ని అంచనాలు 1980-81 నుంచి 1985-86 వరకు లెక్కించడం జరిగింది.
  • అంతేకాకుండా 1980-81 నుంచి 1985-86 సంవత్సరాల ఆదాయ అంచనాలతో సరిపోల్చడానికి 1950-51 సంవత్సర తర్వాత ఆదాయ జాతీయాదాయం లెక్కించడం వల్ల వాస్తవికతను దగ్గరగా జాతీయాదాయాన్ని అంచనా వేయవచ్చు.
  • 1987-88 సంవత్సరంలో భారత దేశ స్థూల జాతీయోత్పత్తి సున్నా లేదా రుణాత్మకంగా ఉందని ప్రపంచ బ్యాంకు అంచనావేయగా నూతన శ్రేణుల ద్వారా కేంద్ర గణాంక సంస్థ స్థూల జాతీయోత్పత్తి రేటు 1.2 ఉందని అంచనా వేయడం ఇందుకు తార్కాణం.

5. నాల్గవసారి  సవరించిన శ్రేణులు(1993-94):

  • గతంలో. జనాభా లెక్కల సేకరణ వలె సేకరించిన పనివారల గణాంకాల ఆధారంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయాదాయ అంచనాలను సెన్సెస్‌ ప్రాతిపదికగా (1980-81) సవరించారు. NSSO సర్వే సేకరించిన గణాంకాలు పని వారల సంఖ్యను బాగా ప్రతిబింబిస్తాయని ఆధార సంవత్సరాన్ని 1993-94 కు మార్చి జాతీయాదాయ అంచనాలను సవరించారు.

6. ఐదవసారి  సవరించిన శ్రేణులు(1999-2000):

  • మరల ఆధార సంవత్సరాన్ని 1999-2000కు మార్చారు.

7. ఆరవసారి  సవరించిన శ్రేణులు(2004-05):

  • మరల ఆధార సంవత్సరాన్ని 2004-05 కు మార్చారు.

8. ఏడవసారి  సవరించిన శ్రేణులు(2011-12):

  • The Advisory Committee on National Accounts and Statistics (ACNAS) పైన ప్రొఫెసర్‌ K. Sundaram అధ్యక్షతన వేసిన కమిటీ ఆధార సంవత్సరాన్ని 2011-12కు మార్చాలని సూచించింది.
  • ఈ సూచనల మేరకు ఆధార సంవత్సరాన్ని 2011-12గా మార్చడం జరిగింది. 
  • ACNAS సంబరధిత ఉప కమిటీలు - చైర్మన్లు:
  1. Un Recognized Manufacturing and Serivce Sector - Prof. K.Sundaram
  2. Agriculture and Allied Sector - Prof. S.Mahendradev
  3. Private Corporate Sector including PPP's - Prof. B.N.Goldar
  4. System of Indian National Accounts - Dr. A.C.Kulshrestha
  5. Private Fund Consumption Expenditure - Prof. A.K.Adhikari
  • సుందరం కమిటీ సూచనల మేరకు జాతీయాదాయ అంచనాలకు ఆధార సంవత్సరంగా 2011-12 సం॥న్ని ప్రకటించారు. దీనిని 2015 జనవరిలో ప్రకటించారు. 

స్థూల దేశీయోత్పత్తి (GDP)ని లెక్కించుటకు ఉత్పత్తి కారకాల దృష్ట్యా GDP ( GD{P_{FC}} )కి బదులుగా మార్కెట్ ధరలలో GDP ( GD{P_{MP}} )ని తీసుకోవాలని సూచించారు.

జాతీయాదాయాన్ని పోల్చుటకు కారక ధరలలో NNP ( NN{P_{FC}} ) బదులుగా మార్కెట్ ధరలలో NNP ( NN{P_{MP}} ) పరిగణించాలని సూచించారు.

GDP లెక్కించుటకు తీసుకునేది - GD{P_{FC}}

జాతీయాదాయాన్ని పోల్చుటకు - NN{P_{MP}}

 9. ప్రస్తుత శ్రేణులు (2020-21):

  • మరల ఆధార సంవత్సరాన్ని 2020-21 కు మార్చారు

 PPP ⟶ Purchasing Power Parity ⟶ దీనిని గుస్తావో కాసేల్‌ అనే ఆర్థికవేత్త 1918లో మొదటిసారిగా వాడినాడు.

పొదుపు రేటు - పెట్టుబడి రేటు 

  • ఒక దేశంలో ఒక సం॥ కాలంలో దేశంలో జరిగిన మొత్తం పొదుపును ఆ సం॥ పు జాతీయాదాయంలో జి.డి:పి శాతంగా చెప్పటాన్ని పొదుపు రేట్లు అంటారు.
  • ఒక దేశంలో ఒక సం॥ జరిగిన పెట్టుబడిని ఆ సం॥పు జాతీయాదాయంలో శాతంగా చెప్పటాన్ని పెట్టుబడి రేట్లు అంటారు. (మూలధర రేటు లేదా స్థూల మూలధన రేటు (GCF - Gross Capital Formation) అని కూడా అంటారు.
  • ఒక దేశంలో పొదుపు రేట్లు కాన్నా పెట్టుబడి రేట్లు తక్కువగా ఉంటే ఉద్యమిత్త లోపం ఉందని అర్థం
  • ప్రస్తుతం భారత్‌లో పొదుపు రేటు కన్నా పెట్టుబడి రేట్లు ఎక్కువగా ఉంది.
  • స్వాతంత్ర్యం నాటికి భారత్‌లో పొదుపు పెట్టుబడి రేట్లు సుమారు 5% మాత్రం ఉండేవి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పొదుపు పెట్టుబ డి రేట్టు సుమారు 10-15% వరకు ఉంటాయి.
  • ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో పొదుపు పెట్టుబడి రేటు 40% వరకు ఉంటాయి
  • భారత్ లో పొదుపు చేస్తున్న మార్గాలు మూడు అవి 1) కుటుంబాలు 2) సంస్థలు 3) ప్రభుత్వం 

స్థిర మూలధన కల్పన రేటు  (GFCF - Gross Fixed Capital Formation)

  • ఒక దేశంలో ఒక సం॥ కాలంలో జరిగిన స్థిర మూలధన విలువను ఆ సం॥పు జాతీయాదాయంలో శాతంగా చెప్పటాన్ని స్థూల స్థిర మూలధన కల్పన రేటు అంటారు

భారతదేశంలో జాతీయ ఆదాయ వృద్ధి ధోరణలు

  • జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరలలో మరియు స్థిర ధరలలో లెక్కిస్తారు.
  • స్థిరధరలలో కంటే ప్రస్తుత ధరలలో జాతీయఆదాయ పెరుగుదల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. 
  • ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయం పెరుగుదలకు రెండు అంశాలు కారణం అవుతాయి. 1. ధరల పెరుగుదల ప్రభావం 2. ఉత్పత్తి పెరుగుదల ప్రభావం
  • ధరలలో పెరుగుదల ప్రభావం కూడా ప్రస్తుత ధరలలో జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఇది వాస్తవమైన పెరుగుదలను సూచించదు. అందువలన స్థిర ధరలలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు.
  • ప్రస్తుత ధరలలో లెక్కించిన జాతీయ ఆదాయాన్ని వాస్తవ / స్థిర ధరలలో జాతీయ ఆదాయంగా మార్చేందుకు డిప్లేటర్‌ను ఉపయోగిస్తారు.
  • బ్రిటీష్‌ వారి కాలంలో ..

    1. భారత దేశంలో జాతీయ ఆదాయ వృద్ధిరేటు → 1.2%
    2. భారతదేశంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు → 0.5%

స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో వృద్ధి రేటు: 

  • మొదటి 3 దశాబ్దాలలో (1950-80) వృద్ధిరేటు తక్కువగా ఉన్నది. జాతీయ ఆదాయ వృద్ధిరేటు 3.5% కంటే తక్కువ మరియు తలసరి ఆదాయ వృద్ధిరేటు 1.5% కంటే తక్కువగా ఉండడాన్నే ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ హిందు గ్రోత్‌ రేట్‌ అని పేర్కొన్నారు. కానీ 1980 తరువాత హిందూ గ్రోత్‌ రేట్‌ అధిగమించారు. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)