జాతీయాదాయ గణన

Adhvith
0
How to Calculate National Income in Telugu

జాతీయాదాయం గణించేటప్పుడు మినహాయించవలసిన అంశాలు

  • పెన్షన్‌
  • గతంలో ఉత్పత్తి చేసిన వస్తువులు
  • విదేశాల నుంచి బదిలీలు
  • కంపెనీ బాండ్ల అమ్మకం.
  • విశ్రాంతి
  • సెక్యూరిటీల అమ్మకాలు, కొనుగోళ్లు.
  • Purchase of second hand machine of a domestic service
  • Purchase of new shares of a domestic firm
  • ప్రభుత్వం విద్యార్థులకిచ్చే స్కాలర్‌ షిప్‌లు
  • ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత వైద్యం.
  • ప్రభుత్వ రుణంపై వడ్డీ.
  • లాటరీల ద్వారా వచ్చే ఆదాయం.
  • Remittances from abroad

జాతీయాదాయం గణించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాల్సి అంశాలు (చేర్చాల్సిన అంశాలు)

  • షేర్లను అమ్మే కమిషన్‌ ఏజెంట్ల ఆదాయం
  • యజమాని ఉంటున్న ఇంటి సేవలు : Imputed Value గా చెప్పవచ్చు. జాతీయాదాయంలో చేర్చాలి.
  • డాక్టర్‌ యొక్క కన్సల్టేషన్‌ ఫీజు
  • రోగి మందుల వ్యయం
  • నర్సులకు అందించిన ఉచిత యూనిఫాంలు
  • బోనస్‌
  • WHO లో పనిచేసే భారతీయుల ఆదాయం.
  • Provident Fund నకు ఉద్యోగుల వాటా
  • నూతన ఇండ్ల నిర్మాణము
  • సుప్రీంకోర్టు జడ్జికిచ్చే జీతం
  • ఎంపీకి ఇచ్చే అలవెన్స్‌

జాతీయాదాయ గణనలో - భారతదేశంలో అవలంబించే పద్దతి  

మన దేశంలో నమ్మదగిన దత్తాంశాలు లేకపోవుట వలన ఏ ఏ ఒక్క పద్ధతిని ఉపయోగించి సంపూర్ణంగా జాతీయాదాయాన్ని కొలవలేము.

ఉదా: వ్యయసాయ రంగంలో ఆదాయ పద్ధతి ద్వారా దత్తాంశ సేకరణ జరగదు. అందువలన మన దేశంలో వివిధ రంగాల్లో వివిధ పద్ధతులను అలంభిస్తున్నారు. అందుచే మన దేశంలో అనుసరించే పద్ధతి మిశ్రమ పద్ధతి అంటాము.

how to Calculate National Income in Telugu,national income calculation notes in telugu,indian economy national income calculation telugu,notes4govtjob

అంటే జాతీయాదాయం గణనలో మన దేశంలో మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

CSO రంగాల వారి విభజన

CSO వారు మన ఆర్థిక వ్యవస్థను స్థులంగా క్రింది విధంగా విభజించిరి. ఈ విభజనలలో పరిశ్రమలు కనపడవు.

1) ప్రాథమిక రంగం

  • ఎ) వ్యవసాయం (పశుపోషణ దీనిలో భాగం)
  • బి) అటవీ సంపద
  • సి) మత్స్య సంపద
  • పై మూడు అంశాలను కలిపి విశాల అర్ధంలో  Agriculture, Forestry, Fishing అందురు.
  • డి) గనులు త్రవ్యకం

ఈ నాల్గవ (డి) అంశాన్ని పైమూడు (ఎబి,సి) అంశాలకు కలిపితే ప్రాథమిక రంగము వచ్చును. ఈ కార్యకలాపాలన్నీ ప్రకృతిపై ఆధారపడినవి.

2) ద్వితీయ రంగం

  • ఎ) Manufacturing దీనిలో రెండు అంశాలుంటాయి.
  •     1) రిజిస్టర్‌ (ఫ్యాక్టరీ చట్టం క్రింద నమోదైనవి)
  •     2) ఆన్‌ రిజిస్టర్‌ (ఫ్యాక్టర్‌ చట్టం క్రింద నమోదు కానివి)
  • బి) విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా
  • సి) నిర్మాణ రంగము

పై మూడు (ఎ,బి,సి) అంశాలను కలిపి ద్వితీయ రంగం అందురు.

నోట్‌: 

  1. ప్రాథమిక రంగాలలో గల గనుల త్రవ్వకాన్ని తీసివేసి ద్వితీయ రంగానికి చేరిస్తే పరిశ్రమల రంగం వచ్చును.
  2. పరిశ్రమల రంగం = రంగం త్రవ్వకం + ద్వితీయ రంగం
  3. ఆర్థిక వ్యవస్థను ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలుగా విభజిస్తే గనుల త్రవ్వకం అనేది ప్రాథమిక రంగంలో భాగం. అట్లాగాక వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలుగా విభజిస్తే పారిశ్రామిక రంగంలో గనుల త్రవ్వకం అనేది భాగం.

3) తృతీయ రంగం

  • ఎ) వర్తకం, హోటల్స్‌, రెస్టారెంట్లు
  • బి) రవాణా, నిల్వ, సమాచారం
  • సి) ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, బీమా, రియల్‌ ఎస్టేట్‌ మరియు ఇతర వ్యాపార సేవలు
  • డి) సామాజిక, సాంఘిక, వ్యక్తిగత సేవలు

పై నాలుగు అంశాలను తృతీయ రంగము అంటారు.

ఆదాయ చక్రీయ ప్రవాహం

జాతీయ ఆదాయం అనేది ఒక ప్రవాహ భావన కాబట్టి ఒక రంగం నుంచి మరొక రంగానికి ప్రవహిస్తుంది.

ఆదాయ చక్రీయ ప్రవాహం 2 రకాలుగా విభజించవచ్చు.

I. వాస్తవ ప్రవాహం (Real Flow) :

  1. గృహరంగం నుంచి ఉత్పత్తి కారకాలు వ్యాపార రంగానికి ప్రవహించుట
  2. ఉత్పత్తి రంగం నుండి వస్తు సేవలు గృహ రంగానికి ప్రవహించుట.

II. ద్రవ్య ప్రవాహం (Money Flow):

  1. ఉత్పత్తి రంగం నుండి ద్రవ్య ఆదాయం గృహ రంగానికి ప్రవహించుట
  2. కుటుంబ రంగం నుంచి ద్రవ్య వ్యయాలు వ్యాపార రంగానికి ప్రవహించుట.

ఆదాయ చక్రీయ ప్రవాహంలో 4 రంగాలుంటాయి. .

  1. గృహ లేదా కుటుంబరంగం
  2. వ్యాపార లేదా ఉత్పత్తి లేదా సంస్థల రంగం
  3. ప్రభుత్వ రంగం
  4. విదేశీ రంగం

ఆదాయ చక్రీయ ప్రవాహంలో 3 నమూనాలుంటాయి

1. రెండు రంగాల నమూనా(Two Sector Model)

  • దీనిలో ఒకటి గృహ రంగం, రెండవది వ్యాపార రంగం ఉంటాయి
  • దీనిలో గృహరంగం నుండి ఉత్పత్తి కారకాలు వ్యాపార రంగానికి ప్రవహిస్తాయి. దీనివల్ల గృహ రంగానికి ఆదాయాలు ప్రవహిస్తాయి. సంస్థల రంగంలో వస్తువులు ఉత్పత్తి అవుతాయి.
  • వస్తువుల వలనే గృహ రంగం నుంచి సంస్థల రంగంకి ఆదాయం వస్తుంది
  • ఈ రెండు రంగాల నమూనాలో పొదుపు (Saving) అనేది ఆదాయ ప్రవాహ చక్రమునకు చిద్రం (Leakage) అంటారు.
  • ఈ రెండు రంగాల నమూనాను ఈ క్రింది 2 విధాలుగా చెప్పవచ్చు.

i) పొదుపు లేకుండా ఉందే రెండు రంగాల నమూనా (Two sector model without savings): 

  • దీనినే సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారు. అనగా ఆర్జించిన మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేస్తారు.

ii). పొదుపుతో కూడిన రెండు. రంగాల నమూనా (Two sector model with savings)): 

  • దీనినే మిత వ్యయ ఆర్థిక వ్యవస్థ అంటారు.
  • దీనిలో కొద్ది మొత్తం వినియోగానికి కేటాయించి, మరికొద్దిగా పొదుపులకు కేటాయిస్తారు.
  • రెండు రంగాల నమూనాలో పొదుపు అనేది ఆదాయ ప్రవాహ చక్రమునకు చిద్రం (Leakage)గా పేర్కొంటారు.
  • ఈ పొదుపు మొత్తాన్ని బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థలు వ్యాపారానికి వ్యాపార రంగానికి తిరిగి బుణాలుగా అందిస్తారు.
  • ఈ సంస్థలు తీసుకున్న బుణాలు పెట్టుబడిగా పెడతారు
  • ఈ సంస్థలు పెట్టిన పెట్టుబడిచే ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. అందుచేత పెట్టుబడిని ఆదాయ ప్రవాహ చక్రమునకు ప్రోత్సాహకారి (Injection) లేదా అభివృద్ధి కారకం (Stipulator) గా పేర్కొంటారు.
  • a) S (Savings) = I (Investment) → ఆదాయ సమతౌల్యం
  • b) S>I → ఆదాయ ప్రవాహం తగ్గించును (Money flow decreases)
  • c) S<I → ఆదాయ ప్రవాహం పెరుగుతుంది (Money flow increases)

2. మూడు రంగాల నమూనా

  • దీనిలో గృహ రంగం, వ్యాపార రంగం, ప్రభుత్వ రంగం కలిసి ఉంటాయి.
  • ఈ మూడు రంగాల నమూనానే “పరిపాలన ఆర్థిక వ్యవస్థ” అంటారు.
  • ఈ మూడు రంగాల నమూనాలో పన్నుల ఆదాయ ప్రవాహాన్ని చిద్రం (Leakage) అంటారు.
  • ఈ నమూనాలో ప్రభుత్వ వ్యయం ఆదాయ ప్రవాహాన్ని ప్రోత్సాహకారి (Injection/Stimulator అంటారు. ఎందుకనగా ప్రభుత్వ వ్యయం ఆదాయ ప్రవాహాన్ని పెంచుతుంది.
  • ఈ వ్యయం వలన ప్రభుత్వం బదిలీ చెల్లింపులు మరియు సబ్సిడీలు చేస్తుంది.
  • Taxes = Govt. Expenditure (ఆదాయ సమతుల్యం)
  • T = G → ఆదాయ సమతుల్యం
  • T > G → ద్రవ్య ప్రవాహం తగ్గుతుంది (Money flow decreases)
  • T < G → ద్రవ్య ప్రవాహం పెరుగుతుంది (Money flow increases)

3. నాలుగు రంగాల నమూనా 

  • దీనిలో గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం కలిసి ఉంటాయి
  • ఈ నమూనానే Open Economy అంటారు.
  • ఈ నమూనాలో దిగుమతులు చక్రీయ ఆదాయ ప్రవాహానికి లీకేజీగా పిలుస్తారు. ఎగుమతులను ప్రోత్సాహకారి (Injection) గా పిలుస్తారు.

how to Calculate National Income in Telugu,national income calculation notes in telugu,indian economy national income calculation telugu,notes4govtjob


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)