ఆర్ధికాభివృద్ధి కొలమానాలు /మాపనలు:
1) GNP: Gross National Product (స్థూల జాతీయ ఉత్పత్తి)
- ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల మార్కెట్ విలువ. ఇది ప్రస్తుత లేదా మార్కెట్ ధరలలో చెప్పబడుతుంది.
- ప్రారంభంలో ఆర్థికాభివృద్ధికి ఈ సూచికను ఉపయోగించారు.
పరిమితులు:
- GNPలో ధరల పెరుగుదల ప్రభావం పడుతుంది.
- GNP లో జనాభా పెరుగుదలను పరిగణించరు.
- పంపిణిని సూచించదు.
- గుణాత్మక మార్పులు/ నాణ్యతను సూచించదు.
2) వాస్తవ GNP:
- దీనిని సైమన్ కుజ్‌నట్స్, మీడ్, వీనర్, ఫ్రాంకెల్ సమర్థించారు.
- RGNP ని ఆధార సం॥ లేదా ప్రాతిపదిక.సం॥ర ధరల్లో లెక్కిస్తారు.
RGNP = [నామమాత్రపు GNP/మార్కెట్ ధరలలో GNP/ప్రస్తుత ధరలలో GNP / ధరల సూచిక (PI)] X 100
ధరల సూచిక (PI) = (P1/P0) X 100
పరిమితులు:
- జాతీయ ఆదాయం పెరిగి, జనాభా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది కాబట్టి ఇది ఆర్థికాభివృద్ధిని సూచించదు.
- ఇది జనాభా పెరుగుదల ప్రభావాన్ని పరిగణించదు.
- ఉత్పత్తిలో గుణాత్మక మార్పులు తెలుపదు.
3) తలసరి ఆదాయం:
- GNP కంటే ఇది మంచి సూచీ
- జాతీయ ఆదాయాన్ని జనాభా చేత భాగించగా తలసరి ఆదాయం వస్తుంది.
PCI = జాతీయ ఆదాయం / దేశ జనాభా
పరిమితులు:
- ధరలు పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరిగి తలసరి ఆదాయం పెరగవచ్చు. కాబట్టి ఇది నిజమైన ఆభివృద్ధి
4) వాస్తవ తలసరి ఆదాయం:
RPCI = [వాస్తవ జాతీయ ఆదాయం/దేశ జనాభా (or) - నామమాత్రపు తలసరి ఆదాయం/ధరల సూచిక] X 100
పరిమితులు:
- జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం రెండూ ఆదాయ సూచికలే ఇది పంపిణీ యొక్క స్వభావాన్ని సూచించవు.
- ఉత్పత్తి పెరుగుదలను సూచించును.కానీ, ఆ ఉత్పత్తులు నిత్యవసర వస్తువులు, విలాస వస్తువులను తెలుపదు.
- వస్తువులలో గుణాత్మక మార్పులను సూచించదు.
- తలసరి ఆదాయం ఒక సగటు సూచిక. ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని సంక్షేమాన్ని సూచించదు.
5) తలసరి వినియోగం:
- తలసరి వినియోగ స్థాయి అనేది ఆర్థికాభివృద్ధి, వృద్ధి మాపణులలో ముఖ్యమైనది.
- కొంతమంది ఆర్థికవేత్తలు తలసరి ఆదాయం కంటే తలసరి వినియోగం ఉత్తమ సూచికగా పేర్కొంటారు.
- వ్యక్తిగత ఆదాయ వ్యయాలను సూచించి, ప్రజల వినియోగస్థాయి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని అంచనా వేయవచ్చు.
6) ఆర్థిక సంక్షేమ కొలమాణం - MEW (Measure of Economic Welfare):
- దీనిని విలియం నర్డ్ వుస్, జేమ్స్ టోనీబ్ రూపొందించారు
- ఇది సామాజిక సంక్షేమాన్ని గణిస్తుంది.
- మూడు అంశాల ఆధారంగా రూపొందించారు.
- విద్యా, ఆరోగ్యంపై చేసే ఖర్చు దీనిని మానవ మూలధనంగా పేర్కొన్నారు.
- మన్నిక గల వినియోగ వస్తువులు, విశ్రాంతి పరిగణలోకి తీసుకున్నారు.
- పట్టణీకరణ ప్రభావాన్ని తీసుకున్నారు. అనగా పట్టణీకరణ వల్ల అయ్యే ఖర్చును తీసివేసారు.
- దీనిని Sustainable Measure of Economic Welfare (MEW-S) అనవచ్చును
7) నికర ఆర్థిక సంక్షేమ సూచీ NEWI (Net Economic Welfare Index):
- MEW ని ఆధునికరించి పాల్‌సామ్యుల్ సన్ రూపొందించారు.
- NEWI = Real GNP + విశ్రాంతి సమయం + మార్కెటేతర కార్యకలాపాలు (గృహణి సేవలు) - పర్యావరణ కాలుష్యానికి అయ్యే ఖర్చు.
- పట్టణీకరణ వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. ఇది NEWI తగ్గిస్తుంది.
- పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి జాతీయ ఆదాయంలో కొంత వాటా కేటాయించాలి. అందుకే దీనిని మినహాయించాలి/తీసివేయాలి.
- Note: అభివృద్ధి చెందిన దేశాలలో ప్రజలు తక్కువ సమయం పనిచేసి ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల జాతీయ ఆదాయం తగ్గిన నికర ఆర్థిక సంక్షేమం పెరుగుతుంది.
- జాతీయ ఆదాయం NEWI ఎక్కువ అర్థవంతమైన సూచీక
8) భౌతిక జీవన ప్రమాణ సూచిక - Physical Quality of Life Index (PQLI):
- దీనిని 1979లో మోరిస్ డేవిడ్ మోరిస్ రూపొందించాడు.
- ఆర్థికాభివృద్ధిని అంచనా వేయడంలో ఆదాయసూచికలపై విమర్శలు రావడం వలన ఆదాయేతర సూచీలను రూపొందించారు.
- ఇది “మిశ్రమసూచి” లేదా “సామాన్య సమీకృత సూచీ” (Simple Component Index)
- 1979లో మోరిస్ 23 దేశాలకు PQLI ని లెక్కించి అభివృద్ధిని గణించాడు.
- ఇది 3 అంశాల మిశ్రమ సూచి.
- ప్రజల ఆయురార్ధం / Life Expectancy at age one (LEI)
- శిశు మరణాల రేటు / Infant Mortality Rate (IMR)
- అక్షరాస్యత రేటు / Base Literacy Index (BLI)
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
అంశ సూచి (Component Index)= (వాస్తవ విలువ - కనిష్ట విలువ) / (గరిష్ట విలువ - కనిష్ట విలువ)
- ప్రతి సూచికకు స్కేలుపై 0 నుండి 100 వరకు రేటింగ్ ఇస్తారు. 0 అనేది దయనీయమైన పనితీరును సూచిస్తుంది. 100 అనేది అత్యుత్తమ పనితీరుని సూచిస్తుంది.
- Note: సాధారణంగా తక్కువ తలసరి ఆదాయం గల దేశాలలో PQLI విలువ తక్కువగా మరియు ఎక్కువ తలసరి ఆదాయం గల దేశాల్లో PQLI విలువ ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ జరిగినది.
- అయితే కొన్ని దేశాలలో మాత్రం పై విషయానికి విరుద్ధంగా కనిపించినది.
PQLI లోని లోపాలు :
- జీవన ప్రమాణస్థాయిని సూచించే ఎన్నో సామాజిక, మానసిక అంశాలలో 3 మాత్రమే తీసుకోవడం సరియైనది కాదు.
- ఈ సూచీలోని 3 అంశాలు సమాన ప్రాధాన్యత కలిగినవి కావు.అందువల్ల ఈ ౩ అంశాలు తీసుకోవడం సరియైనది కాదు.
- PQLI లో శిశుమరణాల రేటు, ఆయు: ప్రమాణం ప్రత్యక్షంగానూ, మరియు అక్షరాస్యతలో పరోక్షంగా జనాభాకు సంబంధించినది. ఆర్థిక అంశాలను అసలే పరిగణలోకి తీసుకోలేదని విమర్శ కలదు.
9) సమీకృత అభివృద్ధి సూచిక (Composite Development Index):
- GNP, PCI, NEWI, PQLI లలో అనేక సమస్యలు ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధితో గణనీయమైన సహ సంబంధమైన కొన్ని చలాంకాలను ఎంపిక చేసి సమీకృత అభివృద్ధి సూచికను నిర్మించుటకు ప్రయత్నించారు.
- EE హెగెన్ - 11 కొలమానాలు/కారకాలు. డొర్మాల్డ్ న్యూరోస్కి - 14 కారకాలు.
- 1970లో UNRISD (United Nations Research Institute on Social Development) 16 సూచికలతో సమీకృత అభివృద్ధి సూచికలను సూచించింది.
- దీనిలో 9 సామాజిక సూచికలు 7 ఆర్థిక సూచికలు తీసుకోవడం జరిగినది.
10) 1995 లింగ సంబంధ అభివృద్ధి సూచిక - GDI (Gender Related Development Index) :
- HDR లో భాగంగానే GDI ని రూపొందిస్తున్నారు.
- HDI లోని అంశాలనే (3) GDI లో తీసుకుంటారు.
- GDI అనేది లింగ సంబంధిత వ్యత్యాసాలు చూపుటకు ఏర్పాటు చేయబడింది.
- GDI లో మహిళలకు సంబంధించిన అంశాలనే పేర్కొంటారు. (స్త్రీల ఆయురార్థం, అక్షరాస్యత, తలసరి ఆదాయం)
- GDI స్కేల్ 0-1 మధ్య వుండును.
- స్త్రీల ఆయు: ప్రమాణం - LEI
- స్త్రీల విద్యాస్థాయి - EAI
- స్త్రీల జీవన ప్రమాణ స్థాయి - SLI
- GDI = HDI - లింగ సమానత్వం
- GDI < HDI లింగ అసమానత్వం అనగా స్త్రీల స్థానం తక్కువ ఉన్న సూచిక.
2022 రిపోర్ట్:
- మొత్తం దేశాలు = 188
- India Rank = 135 (ఐస్‌లాండ్ - మొదటి స్థానాన్ని నిలుపుకుంది)
11) స్రీల సాధికారత = GEMI (Gender Empowerment Measurement Index - 1995)
- GEMI స్త్రీల యొక్క ఆర్థిక రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనే రేటు ఆధారంగా లెక్కిస్తున్నారు. దీనిలో 3 అంశాలు కలవు.
- a) రాజకీయ భాగస్వామ్యం నిర్ణయాలు తీసుకునే శక్తి - పార్లమెంట్, అసెంబ్లీ, చట్టసభలు, స్థానిక సభలలో భాగస్వామ్యం. (కీలక అధికారాలలో స్త్రీల వాటా మరియు శ్రామికులలో స్త్రీల శాతం)
- b) ఆర్థిక భాగస్వామ్యం మరియు నిర్ణయాలు తీసుకునే శక్తి. (కీలక అధికారాలలో స్త్రీల వాటా మరియు శ్రామికులలో స్త్రీల శాతం)
- 1952 - సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలో ప్రాతినిథ్యం - 4.4%
- 2009 - 10.4% (59 మంది స్త్రీలు)
- 2014 - 11.3% (61)
- 2016 - 12.5% (66)
- 2022 - 14.86% (81)
- c) ఆర్థిక వనరులపై ఆధిక్యత :
- లింగపరమైన వ్యత్యాసాలు తక్కువ గల దేశం అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారు.
- సమాచార లేమి కారణంగా ఈ మధ్య కాలంలో భారతదేశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు.
- Note: ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాలు స్త్రీలకు పరిపాలనా, రాజకీయ, కార్యకలాపాలలో పాలు మేలైన అవకాశాలు కల్పిస్తున్నాయి
12) లింగ అసమానత సూచీక GII (Gender Inequality Index - 2010)
2010 నుండి GDI మరియు GEM లకు బదులుగా GII ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం (2022) India Rank124 of 190 Countries (0.629)
మొదట - ఐస్ లాండ్
ఆఖరి - ఆఫ్ఘనిస్థాన్
GII విలువను 8 అంశాల ఆధారంగా లెక్కిస్తున్నారు.
- MMRE - Maternity Mortality Rat (ప్రసూతి మరణాల రేటు)
- 15-49 సం॥ల మధ్య వయస్కులైన వివాహిత మహిళలల్లో గర్భనిరోధక సాధనాలను వాడే వారి శాతం.
- మొదటి గర్భాధారణకు ముందుగా కనీసం ఒక్కసారైనా వైద్యున్ని సంప్రదించిన వారిశాతం.
- కౌమార దశలో సంతానం పొందిన వారి శాతం.
- శిక్షణ పొందిన వారి వద్ద ప్రసూతి పొందిన వారి శాతం.
- 25 సం॥ దాటిన మహషిళలల్లో మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారి శాతం.
- శ్రామిక శక్తిలో మహిళల శాతం.
- పార్లమెంటులో మహిళ సీట్ల శాతం.
GII - అంశాలు/ 5 - సూచికలు :
I. శ్రమ Market - 1) శ్రామికుల Participation
II. సాధికారత - 1) విద్య స్థాయి 2) పార్లమెంటుప్రాతినిధ్యం
III. Reproductivity Health - 1) Adolescent Fertility 2) Maternity Mortality
- GII స్కేలు 0-1 మధ్యన వుంటుంది.
- GII విలువ ఎక్కువగా వుంటే తక్కువ అభివృద్ధి గల దేశం (చివరి స్థానం)
- GII విలువ తర్షునా వుంటే ఎక్కువ అభివృద్ధి గల దేశం (మొదటి స్థానం)
13) HPI - I - 1997 (Human Poverty Index):
- UNDI వారు HDI లో భాగంగానే HPI ని ప్రకటిస్తారు.
- HPI యొక్క స్కెలు 0-100 వరకు ఉంటుంది.
- HPI విలువ ఎంత ఎక్కువగా ఉంటే పేదరికం అంత ఎక్కువగా “ఉన్నట్లు అర్ధం.
- HPI విలువ “0” కు దగ్గరగా వుంటే పేదరికం తక్కువగా ఉన్నట్లు భావించాలి. .
- HPI విలువ తక్కువగా వున్న దేశం HPI లో Top Rank లో ఉంటుంది.
- HPI ని 'గణించడానికి తీసుకున్న అంశాలు : 3
- 40 సం॥ వయసులోపు మరణించే వారి జనాభా శాతం.
- వయోజనులలో నిరక్షరాస్యుల శాతం.
- జీవన ప్రమాణం. దీనిని 3 అంశాలతో గణిస్తారు.
- ఎ) మెరుగైన వైద్య సదుపాయాలు లభించని జనాభా శాతం.
- బి) సురక్షిత త్రాగునీరు లభించని జనాభా శాతం.
- సి) 5సం. లోపు పిల్లలలో తక్కువ బరువు కలిగిన పిల్లల శాతం (పౌస్టికాహార లోపం)
14) HPI - II -1998 (Human Poverty Index):
- దీనిని 1998లో ప్రవేశపెట్టారు. దీనిని ప్రత్యక్షంగా అభివృద్ధి చెందిన దేశాలకు ప్రకటిస్తున్నారు. (HPI-I అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది)
- HPI-I లో తీసుకున్న 3 అంశాలకు అనుబంధంగా 4వ అంశం తీసుకున్నారు. 4వ అంశంగా - దేశ సగటు ఆదాయం కంటే 50% తక్కువ ఆదాయం కలిగిన వారి శాతం.
- i) 60 సం॥లోపు చనిపోయే జనాభా శాతం.
- ii) వయోజనులు విధుల రీత్యా నిరక్షరాస్యత కలిగిన శాతం.
- iii) సంవత్సరం మొత్తం మీద నిరుద్యోగిత శాతం.
- iv) దేశ సగటు ఆదాయం కంటే 50% తక్కువ ఆదాయం కలిగిన జనాభా శాతం.
15) MPI -2010 (Multidimensional Poverty Index):
- దీనిలో ౩ అంశాలకు సంబంధించిన 10 సూచికలను తీసుకొని దీనిని ప్రకటిస్తున్నారు.
- జీవనస్థాయి - 6 సూచికలు - Assets, Floor, Water, Cooking Fuel, Electricity & Toilets
- విద్య - 2 సూచికలు - 1) Children Enrollment పిల్లల పాఠశాల నమోదు 2) Years of Schooling
- ఆరోగ్యం-2 సూచికలు- 1) Child Mortality శిశుమరణాలు 2) పౌష్టికాహార లభ్యత
- ఈ సూచిని Oxford Poverty and Human Development Initiative of Oxford University మరియు Human Development office of UNDP సంయుక్తంగా 2010లో అభివృద్ధి చేశారు.
MPI Index:
- 1) నైజర్
- 2) ఇధియోపియా
- 3) మాలి.
- 4) బుర్మినా ఫాసో
- 5) బురుండి
- నోట్ : దీనిలో ఇండియార్యాంక్ - 62 (102 దేశాలో in 2022)
16) TAI - 2001 (Technical Achievement Index):
- దీనిలో ఈ క్రింది అంశాలు ఆధారంగా లెక్కిస్తారు.
- నవకల్పనలు, ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి వీలైన వసతులు కల్పించడం మొ॥నవి.
- సాంకేతిక పరిజ్ఞానం సృష్టించుట.
- నవకల్పనలు విస్తరణ చేయుట.
- సాంకేతిక పరిజ్ఞానం అందరికి అందించాలి.
- మానవ నైపుణ్యాలు అభివృద్ధి చేయుట.
17) పచ్చదన సూచి (Green Index - G.I.):
- పర్యావరణ సంబంధిత అంశాల ద్వారా ప్రపంచ బ్యాంక్ కొనసాగించగలిగే అభివృద్ధిని అంచనా వేయడానికి Green Index ని లెక్కిస్తున్నారు. దీనిని ౩ అంశాల ఆధారంగా లెక్కిస్తారు.
- i) సహజ వనరులు Ex. భూమి, నీరు, ఖనిజ సంపద.
- ii) మానవ వనరులు Ex. విద్యాస్థాయి, నైపుణ్యం మొ॥నవి
- iii) ఉత్పత్తి చేయబడిన సాధనాలు Ex. యంత్రాలు, కర్మాగారాలు, రోడ్లు.
18) SPI (Social Progress Indicator):
- దీనిని 26 అంశాల ఆధారంగా లెక్కిస్తారు.
- మానవ అభివృద్ధిని పెంచేవి అధికంగా (అంశాలు) ఉంటే GPI విలువ పెరుగుతుంది.
- GDP కి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు.
- 26 అంశాలను 3 విభాగాలుగా వర్గీకరించారు.
- 1) Economic 2) Environment 3) Social
19) సామాజిక ప్రగతి సూచీక (Genuine Progress Indicator - GPI):
- Social Progressive Imperative అనే సంస్థ రూపొందించింది
- దీనిని ౩ - అంశాల ఆధారంగా లెక్కిస్తున్నారు.
- i) ఆరోగ్యవంతమైన జీవిత కాలం శ్రేయస్సుకు పునాదులు
- ii) ప్రభుత్వ వస్తువుల లభ్యత అవకాశం
- iii) ప్రైవేటు వస్తువుల విసు గరా ప్రాథమిక అవసరాలు
20) కనీస అవసరాల దృక్పథం (Basic Needs Approach):
- దీనిని ILO అభివృద్ధి చేశారు. దీనిలో 6 అంశాలు ఉన్నాయి
21) ఆర్థిక అభివృద్ధి సూచీక (Economic Development Index - EDI):
- దీనిని. భారత్‌కు చెందిన NCAEER ( National Council for Applied Economic Research)వారు అభివృద్ధి చేశారు. దీనిలోని అంశాలు - 3
- i) విద్యాస్థాయి సూచిక
- ii) ఆరోగ్యవృద్ధి సూచిక
- iii) తలసరి ఆదాయం
22) ప్రపంచ సంతోష సూచీక
- భారత స్థానం 136 out of 146 countries (2022 ప్రకారం)
- Real GDP
- సగటు జీవితకాలం
- సామాజిక మద్ధతు
- నివాసానికి సంబంధిచిన నిర్ణయాలు తీసుకోవటంలో స్వతంత్ర్యం
- అవినీతిపై అవగాహన
- దాతృత్వం వంటి సూచికల ఆధారంగా రూపొందించారు.
కొనసాగించగలిగే అభివృద్ధి (Sustainable Development) :
- దీనిని ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమీషన్ “our common future" అనే సెమినార్ రిపోర్టులో ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించారు.
- భవిష్యత్ తరాల, వారి అవసరాలు, సామర్థ్యం దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల వారు అవసరాలను తీర్చుకోవడమే కొనసాగించగలిగే అభివృద్ధి.
- “బ్రంట్ లాండ్ కమీషన్” - 1987 లో నిర్వచించింది.
- కొనసాగించగలిగే అభివృద్ధి అనగా పర్యావరణ వనరులు మరియు పునరావృతం కాని వనరులను సంరక్షించుట.
జీవన నాణ్యత:
- వ్యక్తులకు మెరుగైన ఆరోగ్యము, సంక్షేమము, మౌలిక స్వేచ్చలు, ఎంపిక స్వేచ్చలు, రాజకీయ మరియు పౌరహక్కులను కల్పించుటయే జీవన నాణ్యతగా పేర్కొంటారు.
ఆధునిక ఆర్థిక వృద్ధి (Modern Economic Growth):
- ఆధునిక ఆర్థిక వృద్ధి గ్రంథ రచయిత - సైమన్ కుజ్‌నట్స్
- ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. కుజ్‌నట్స్ ఆధునిక అభివృద్ధికి 6 లక్షణాలు పేర్కొన్నారు. అవి
1) పరిమాణాత్మక అంశాలు - 2
ఎ) అధిక తలసరి ఉత్పత్తి, వృద్ధి రేటు మరియు జనాభా రేటు
బి) ఉత్పాదకత పెరుగుట.
2) నిర్మాణాత్మక అంశాలు - 2.
ఎ) ఎక్కువ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు
బి) పట్టణీకరణ
3) అంతర్జాతీయ విస్తరణ అంశాలు - 2
ఎ) అభివృద్ధి చెందిన దేశాల బాహ్య విస్తరణ
బి) అంతర్జాతీయ వస్తువులు జనాభా మూలధన కదలికలు లేదా గమనశీలత.
సహజ వనరులు :
- ఇవి ప్రకృతి ప్రసాదితాలు - Ex. అడవి సంపద, భూమి, ఖనిజాలు, శీతోష్ణస్థితి
- సహజవనరుల లభ్యత వలన ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయవచ్చును.
- ఖూ, బ్రిటన్‌లు సహజవనరుల ద్వారా అభివృద్ధి చెందాయి.
- Note: జపాన్ సహజ వనరులు లేకపోయినప్పటికీ అభివృద్ధి సాధించింది.
- సహజ వనరుల లభ్యత కంటే వాటి వినియోగం అతి ముఖ్యమైనది.
- మూలధన కల్పన - ఇది అతి ముఖ్యమైనది. ఇది మానవ నిర్మితమైనది.
- మూలధనమే పెట్టుబడిగా మారుతుంది.
- Capital Output Ratio (COR) ఉత్పత్తికి సగటున అవసరమైన మూలధనం.