జాతీయాదాయం

Adhvith
0
Indian Economy National Income Study Material in Telugu

జాతీయాదాయం - National Income

Definitions of National Income

  • ఒక నిర్గీత కాలంలో, ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్‌ విలువను జాతీయ ఆదాయం అంటారు. (Definition of National Income)

1. అల్పెడ్‌ మార్షెల్‌ :

  • సహజ వనరులు మరియు ఉత్పత్తి కారకాల సహాయంచే ఉత్పత్తి చేయబడిన నికర విలువను జాతీయ ఆదాయం అంటారు. (National Income defined by Alfred Marshall)

2. ఫిషర్‌ :

  • వినియోగదారులు భౌతిక వనరుల నుండి (లేదా) మానవ వనరుల నుండి తమ అవసరాలను పొందే వస్తు సేవల సముదాయాన్ని 'జాతీయాదాయం' అంటారు  (లేదా) 
  • వస్తు సేవల జీవితకాలంలోని ఒక సంవత్సరపు వినియోగం విలువనే జాతీయాదాయం అంటారు.(National Income definition by Fisher)

3. పిగూ

  • సంఘానికి ప్రాప్తించే ఆదాయంతో పాటు, ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయమే జాతీయాదాయం. (National income definition by Pigou) ( లేదా)
  • ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన ద్రవ్యంతో కొలవదగిన వస్తు సేవలకు విదేశీ నికర ఆదాయం కలుపగా వచ్చునది జాతీయాదాయం. 

4 శామ్యూల్‌సన్‌ :

  • ఒక దేశంలో ఒక సంవత్సరకాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయాదాయం అంటారు. (National Income definition by Samuelson)

5. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ (NIC - National Income Committee)

  • ఒక నిర్ణీత కాలంలో జాతీయాదాయంను లెక్కించేటప్పుడు ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు. దీని వలన ఖచ్చితమైన జాతీయాదాయంను లెక్కించవచ్చును.(National Income definition by NIC)

6. కేంద్ర గణాంక సంస్థ (CSO - Central Statistical Organization)

  • ఒక సంవత్సర కాలంలో ఒక దేశం యొక్క ఉత్పత్తి కారకాలైన వేతనాలు, భాటకం, వడ్డీ, లాభాల రూపంలో వచ్చే ఆదాయంను జాతీయాదాయం అంటారు. (National Income definition by CSO)

7. UNO నిర్వచనం

  • ఒక సంవత్సరంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువల మొత్తం. (National Income definition by UNO)

Indian Economy Study Material in Telugu,Indian Economy Notes in Telugu,TSPSC Indian Economy Study Material in Telugu,Group2 Indian Economy Study Material in Telugu,TSPSC Indian Economy Notes in Telugu,Group2 Indian Economy Notes in Telugu,TSPSC Economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,group 2 economy study material in telugu,economy study material in telugu,economy notes in telugu,economy notes telugu,economy material telugu,indian economy notes telugu,inidan economy study material telugu,indian economy material telugu,definition of national income in telugu,define national income in telugu,what is national income,national income notes in telugu,national income study material in telugu,define national income in telugu,what is GDP,NFIA stands for,GDP stands for,define gdp
జాతీయాదాయానికి సంబంధించి కొన్ని పదాల మధ్య తేడా (Basic Distinctions)

  • జాతీయాదాయానికి సంబంధించిన. వివిధ భావనలు తెలుసుకునే ముందు, కొన్ని ముఖ్యమైన పదాల అర్థం, వాని మధ్య సంబంధం, తెల్సుకోవాల్సి ఉంది.

1. స్థూల, నికర ఉత్పత్తులు (Gross Product (Vs) Net Product)

  • ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని కొంతకాలంపాటు నిరాటంకంగా ఉత్పత్తిని అందించే వాటిని స్థిరమూల ధనం అందురు. ఉదా: యంత్రాలు, భవనాలు, పరికరాలు
  • మూలధన వస్తువులైన (స్థిరమూలధనం) యంత్రాలు, ఎక్విప్‌మెంట్‌, ఫ్యాక్టరీ బిల్జింగ్‌లు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనేటప్పుడు అరుగు, తరుగుదల (Weat and Tear) కు గురి అగును. దీనినే తరుగుదల (Depreciation)అందరు.
  • అంటే స్థిరమూలధన వినియోగాన్ని (Consumption of Fixed Capital) తరుగుదల అందురు.
  • తరుగుదల కలిసి ఉన్నదా లేదా, మినహాయించబడి ఉన్నదా అనే దానిని బట్టి స్థూల ఉత్పత్తి నికర ఉత్పత్తుల మధ్య తేడా గమనించవచ్చు.
  • తరుగుదలతో కలిపి ఉత్పత్తిని లెక్కిస్తే అది స్థూల ఉత్పత్తి, తరుగుదలను మినహాయించి ఉత్పత్తిని లెక్కిస్తే అది నికర ఉత్పత్తి.

స్థూల ఉత్పత్తి = నికర ఉత్పత్తి + తరుగుదల

నికర ఉత్పత్తి = స్థూల ఉత్పత్తి - తరుగుదల

తరుగుదల = స్థూల ఉత్పత్తి - నికర ఉత్పత్తి

తరుగుదల = స్థిర మూలధన వినియోగం (CFC)

  • స్థూల పెట్టుబడికి, నికర పెట్టుబడికి తేడా తరుగుదల. ఇది స్తూల పెట్టుబడిలో కలిసి ఉండును. కాబట్టి తరుగుదల వేస్తే నికర పెట్టుబడి వచ్చును.
  • స్థూల పెట్టుబడి ఆధారంగా దేశంలో ఉత్పత్తి లెక్కిస్తే అది స్థూల ఉత్పత్తి
  • నికర పెట్లుబడి ఆధారంగా దేశంలో ఉత్పత్తి లెక్సిస్తే అది నికర ఉత్పత్తి,

2. దేశీయ, జాతీయ ఉత్పత్తులు (Domestic (Vs) National Product) 

  • ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరుగుతున్నదా? లేదా, ఒక వేళ. జాతీయులచే (Normal Residents) ఉత్పత్తి చేయబడుతున్నదా? అనే దానిపై ఆధారపడి దేశీయ, జాతీయ ఉత్పత్తులను చెప్పవచ్చు.
  • ఒక దేశ భౌగోళిక సరిహద్దులలో (Domestic Territory) జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తి అందురు. ఒక దేశ భౌగోళిక ప్రాంతంలో జరిగిన ఈ ఉత్పత్తి దేశీయులచేగానీ, విదేశీయులచేగాని చేయబడవచ్చు. అంటే ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చును.
  • ఉదా: జర్మనీకి చెందిన వోక్స్‌వాగన్‌ కార్ల కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే అది భారత భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి జరిగింది. కాబట్టి దాన్ని దేశీయ ఉత్పత్తిలో చూపుతారు. అట్లాగే మన దేశానికి చెందిన టాటావారు మలేషియాలో నానో కార్లను ఉత్పత్తి చేస్తే అది దేశం వెలుపల ఉత్పత్తి జరిగింది కాబట్టి దానిని దేశీయ ఉత్పత్తిలో చూపరు.
  • ఒక సంవత్సర కాలంలో ఒక దేశ పౌరులచే (Normal Residents of Country) చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే జాతీయోత్పత్తి. ఈ ఉత్పత్తి ఆ దేశ భౌగోళిక సరిహద్దులలో గాని, దేశం వెలుపలగాని జరగవచ్చు. అంటే దీనిలో ప్రదేశానికన్న ఆ దేశ పౌరులకు ప్రాధాన్యత ఉంటుంది.
  • ఉదా: జర్మనీ వారి వోక్స్‌వాగన్‌ కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే, దాని విలువ జర్మనీ దేశానికి చెందాలి. ఎందుకనగా ఇది జపాన్‌ మూలధనంపై వచ్చే ఆదాయం. అట్లాగే మన దేశానికి చెందిన టాటా వారు మలేషియాలో నానో కార్లను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి విలువ భారతీయులచే చేయబడింది కాబట్టి భారతదేశానికి చెందాలి. నానో కార్ల ఉత్పత్తి విలువను చేర్చి, వోక్స్‌వాగన్‌ కార్ల ఉత్పత్తి విలువను తీసివేస్తే వచ్చేదే జాతీయోత్పత్తి.
  • భారతదేశ ఉత్పత్తి కారకాలను విదేశాలలో ఉపయోగిస్తే వచ్చే ఆదాయం నుంచి, విదేశీ ఉత్పత్తి కారకాలు భారతదేశంలో వినియోగిస్తే చెల్లించాల్సిన వ్యయం తీసివేస్తే వచ్చేదే నికర విదేశీ కారక ఆదాయం NFIA (Net Factor Income from Abroad).
  • NFIA = విదేశీయుల నుంచి వచ్చే కారక ఆదాయం (R) - విదేశాలకు చెల్లించే కారక వ్యయం (P)
  • NFIA = Received Income (R) - Payment Income (P)
  • అంటే దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తులను తేడా నికర విదేశీ కారక ఆదాయం. దేశీయ ఉత్పత్తికి NFIA చేరిస్తే జాతీయోత్బత్తి వచ్చును.

జాతీయ ఉత్పత్తి = దేశీయ ఉత్పత్తి + NFIA

దేశీయ ఉత్పత్తి = జాతీయ ఉత్పత్తి - NFIA

NFIA = జాతీయ ఉత్పత్తి - దేశీయ ఉత్పత్తి

NFIA = R- P

  • దేశీయ, జాతీయ ఉత్పత్తులలో ఏది ఎక్కువ ఉంటుంది అనేది NFIAపై ఆధారపడును.
  • NFIA విలువ ధనాత్మకమైతే (R > P) జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండును.
  • NFIA విలువ రునాత్మకమైతే (R < P), దేశీయ ఉత్పత్తి ఎక్కువగా ఉండును.
  • NFIA విలువ శూన్యమైతే (R = P), దేశీయ, జాతీయ ఉత్పత్తులు సమానంగా ఉండును.

3. మార్కెట్‌ ధరలు, ఉత్పత్తి కారకాలు ఖరీదు దృష్ట్వా ఆదాయం (Market Prices Vs Factor Cost)

  • జాతీయాదాయాన్ని లెక్కించేటప్పుడు 2 ధరలలో లెక్కిస్తారు.
  • 1) మార్కెట్‌ ధరలలో జాతీయాదాయం (National Income at Market Prices - NIMP)
  • 2) ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా (లేదా) కారక ధరల్లో (లేదా) కారక వ్యయం దృష్టా జాతీయ ఆదాయం (National Income at Factor Cost - NIFC)
  • మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం = కారక ధరల్లో జాతీయాదాయం + పరోక్ష పన్నులు -సబ్సిడీలు
  • NIMP = NIFC + Indirect Taxes - Subsidies
  • కారక ధరల్లో జాతీయాదాయం = మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం + సబ్సిడీలు -పరోక్షపన్నులు
  • NIFC = NIMP + Subsidies -  Indirect Taxes
  • Indirect Taxes = Subsidies ⇨= NIMP = NIFC 
  • Indirect Taxes > Subsidies ⇨= NIMP > NIFC 
  • Indirect Taxes < Subsidies ⇨= NIMP < NIFC 
  • పరోక్ష పన్నులు, సబ్సిడీలు సమానంగా వుంటే మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం కారకాల ధరల్లో జాతీయాదాయం సమానంగా వుంటాయి.
  • పరోక్ష పన్నులకన్నా సబ్సిడీలు తక్కువగా ఉండి, మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం కన్నా కారకాల ధరల్లో జాతీయాదాయం తక్కువగా ఉంటుంది.
  • పరోక్ష పన్నుల కన్నా సబ్సిడీలు ఎక్కువగా వుంటే, మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం కన్నా కారకాల ధరల్లో జాతీయాదాయం. ఎక్కువగా ఉంటుంది.
  • మార్కెట్‌ ధరల్లో పరోక్ష పన్నులు వుంటాయి, సబ్సిడీలు వుండవు.
  • సబ్సిడీలు అనేవి ప్రభుత్వం నుండి సంస్థలకు ఉచితంగా లభించేవి.
  • పరోక్ష పన్నులనేది సంస్థలు ప్రభుత్వానికి చెల్లించేవి.
  • పరోక్ష పన్నులు - సబ్సిడీలు = నికర పరోక్ష పన్నులు.
  • Indirect Taxes - Subsidies = Net Ti
  • మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయంలో నికర పరోక్ష పన్నులు చేర్చబడి ఉన్నాయి.
  • కారక ధరల్లో జాతీయాదాయంలో నికర పరోక్ష పన్నులు తొలగించబడ్డాయి.
  • నికర పరోక్ష పన్నులు అనేవి పరోక్ష పన్నులు, సబ్సిడీల మధ్య వ్యత్యాసం.
  • Indirect Taxes = Subsidies ⇨ Net Ti = 0 
  • Indirect Taxes > Subsidies ⇨ Net Ti ధనాత్మకం
  • Indirect Taxes < Subsidies ⇨ Net Ti  బుణాత్మకం
  • నికర పరోక్ష పన్నులు శూన్యంగా ఉంటే మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం సమానం 
  • నికర పరోక్ష పన్నులు ధనాత్మకంగా ఉంటే కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం కన్నా మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం ఎక్కువ.
  • నికర పరోక్ష పన్నులు బుణాత్మకంగా ఉంటే కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం కన్నా మార్కెట్‌ ధరల్లో జాతీయాదాయం తక్కువ.

4. నామ మాత్రపు, వాస్తవ ఆదాయాలు (Nominal Vs Real Incomes)

  • ప్రస్తుత సంవత్సర ధరలలో ఆదాయాన్ని లెక్కిస్తే దానిని ప్రస్తుత ధరలలో ఆదాయం లేదా నామ మాత్రపు లేదా ద్రవ్య ఆదాయం అందురు.
  • ఉదా: 2021-22 సంవత్సరాన్ని జాతీయాదాన్ని 2021-22 సంవత్సర ధరలలో లెక్కించుట.
  • అయితే కొంతకాలంగా (Over a Period of time) దేశ జాతీయ ఆదాయాన్ని సరిపోల్చేందుకు ప్రస్తుత ధరలలో జాతీయాదాయ అంచనాలు ఉపయోగపడవు. ఎందువలననగా ఉత్పత్తి పెరగకుండానే ధరలు పెరుగుదల వల్ల జాతీయాదాయం పెరిగినట్లు కనపడవచ్చు.
  • స్థిర ధరలలో జాతీయాదాయాన్ని లెక్కిస్తే దానిని వాస్తవ ఆదాయం అందురు. ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరం (Base Year) గా తీసుకొని, ఆ సంవత్సర ధరలలో ఆదాయాన్ని లెక్కిస్తే అదే స్థిర ధరలో ఆదాయం. ఉదా: మన దేశంలో ఇప్పటి వరకు 1948-49, 1960-61, 1970-71, 1980-81, 1999-2000, 2004-05, 2011-12 సంవత్సరాలకు ఆధార సంవత్సరాలుగా తీసుకొనిరి.
  • ప్రస్తుత ధరలలో ఆదాయాన్ని గణించినప్పటికీ, దానిని స్థిర ధరలలోకి మార్చవచ్చు. దీనికై Price Deflator ని వాడుతారు.
  • స్థిర ధరలలో ఆదాయం = (ప్రస్తుత ధరలలో ఆదాయం/ ధరల సూచీ ) X 100
  • Price Deflator ని GDP Deflator అని కూడా అంటారు.
  • GDP Deflator = ప్రస్తుత ధరల్లో జాతీయాదాయం / స్థిర ధరల్లో జాతీయాదాయం
  • ప్రస్తుత ధరలలో ఆదాయం గణిస్తే → నామ మాత్రపు ఆదాయం
  • స్థిర ధరలలో ఆదాయం గణిస్తే → వాస్తవ ఆదాయం

ముఖ్యమైన తేడాలు

  • స్థూల, నికర ఉత్పత్తి మధ్య తేడా → తరుగుదల
  • దేశీయ, జాతీయ ఉత్పత్తి మధ్య తేడా → నికర విదేశీ కారకాల ఆదాయం (NFIA)
  • మార్కెట్‌ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు మధ్య తేడా → నికర పరోక్ష పన్నులు.
  • నామ మాత్రపు, వాస్తవ ఆదాయం మధ్య తేడా → మనం తీసుకునే ధరలు
Keywords: Tspsc economy notes in telugu,tspsc indian economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,economy notes,tspsc indian economy notes in telugu,group 2 indian economy notes in telugu,tspsc indian economy study material in telugu,group 2 indian economy study material in telugu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)