శ్రమ సాంద్రత పద్దతి

Adhvith
0
Simon Kuznets economic structure and change notes in telugu

17. ఉత్పత్తి ఎంపిక పద్దతి (Choice of Techniques):

  • ఆర్థికాభివృద్ధి వ్యవస్థలో దేశంలో ఉత్పత్తిని గరిష్టం చేయుటకు శ్రమ, మూలధనం ప్రాత ఉత్పత్తి పద్దతుల ఎంపిక తెలుపును.
  • ఒక ఆర్థిక వ్యవస్థకు అందుబాటులో ఉన్న వివిధ ఉత్పత్తి పద్దతుల నుండి అనువైన ఒక ఉత్పత్తి పద్దతిని ఎంపిక చేసుకునే ప్రక్రియను ఉత్పత్తి పద్దతుల ఎంపిక అంటారు.

ఎ.కె సేన్‌

  • ఇతని ప్రకారం ఆర్థికాభివృద్ధికి వివిధ రకాల ఉత్పత్తి పద్దతులు వివిధ వ్యూహాలను సూచిస్తాయి. మరియు వాటి ప్రభావాలు భిన్నంగా ఉండును.
  • ఉత్పత్తి కారకాల్లో ముఖ్య పద్దతులైన శ్రమ, మూలధనంలో శ్రమ ధర వ్యయం తక్కువ ఉంటే శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్దతి, మూలధన ధర వ్యయం తక్కువగా ఉంటే మూలధన సాంద్రత పద్దతి అంటారు.

శ్రమ సాంద్రత పద్దతి (Labour Intensive Technique)

శ్రామికుల ద్వారా జరిగే వస్తు ఉత్పత్తి ప్రక్రియనే శ్రమ సాంద్రత పద్దతి అంటారు. యు.డి.సి లు శ్రమ సాంద్రత ఉత్పత్తి పద్దతులను ఎంపిక చేయాలని నర్క్స్, లూయిస్‌. మేయర్‌, బాల్డావీస్‌,  కండల్‌ బర్గర్‌ ప్రతిపాదించారు.

శ్రమ సాంద్రత పద్దతి వలన కలిగే లాభాలు

  1. ఉపాధి-ఉద్యోగితపెంపు
  2. మూలధన కొరత పరిష్కారం
  3. విదేశి మారకం ఆదా
  4. వికేంద్రీకరణ
  5. ద్రవోల్బణ నివారణ
  6. అనుకూల ఆదాయ పంపిణి.

2 మూలధన సాంద్రత ఉత్పత్తి పద్దతులు (Capital Investment)

  • మూలధనం ద్వారా వస్తు ఉత్పతి జరిగితే ఆ ప్రక్రియను మూలధన సాంద్రత పద్దతి అందురు. గాలెన్‌సన్‌, లెబాన్‌ స్టీన్‌ సాంకేతిక పరిజ్ఞానం అధిక స్థాయి వినియోగం ఆర్థికాభివృద్ధి కి దోహదం చేస్తుందని తెలిపారు.
  • మూలధన సాంద్రత పద్దతి వలన కలిగే లాభాలు

  1. సత్వర అభివృద్ధి
  2. దీర్జకాలంలో ఉపాధి పెరుగుట
  3. అల్ప ఉత్పత్తి వ్యయం ధర
  4. సాంఘిక అవస్థాపన మూలధనం
  5. జీవన ప్రమాణ స్థాయి పెరుగును
  6. శ్రామిక- ఉత్పాదకతలో పెరుగుదల కనిపించును 

  • లోపాలు

  1. యు.డి.సి లకు ఇది అన్వ యించదు.
  2. విదేశీ చెల్లింపుల సమస్యలు
  3. మూలధనం వృధా
  4. నైపుణ్యం గల శ్రామికుల కొరత
  5. సాంఘిక అవస్థాపనాలు లోపించి ఉండుట.

సముచిత సాంకేతిక పరిజ్ఞానం (Appropriate Technology)

  • శ్రమ, మూలధన ఉత్పత్తిల పద్దతులలోనూ లాభాలు, నష్టాల (లోపాలు) ఉన్నాయి. దీని వలన ఆర్థికాభివృద్ధి. వినియోగం ఉపాధిలలో పెరుగుదల జరగాలంటే ఈ రెండు పద్దతులను సముచిత సముదాయంలో వినియోగించాలి
  • యు.ఎన్‌.ఒ ప్రకారం ఆర్థికాభివృద్ధి ప్రారంభ దశలో శ్రమ సాంద్రత పద్దతులను ఉపయోగించి, ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న తరువాత మూలధన సాంద్రత ఉత్పత్తి పద్దతి వినియోగించాలని పెర్కొన్నారు
  • ఏదైనా ఒక దేశం వినియోగ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తే ప్రస్తుత అవసరాలు తీరుతాయి కానీ భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.
  • ఒకవేళ మూలధన లేదా ఉత్పాదక వస్తువులకు ప్రాధాన్యత ఇస్తే ప్రస్తుతం సమస్యలు ఉన్నప్పటికీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
  • ఒక దేశం తన ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తూ వారికి కావలసిన వస్తువులను ఉత్పత్తి  చేస్తుంది - ఇవి వినియోగ వస్తువుల ఉత్పత్తి.
  • అలాగే చెరువులు, కాలువలు, పరిశ్రమలు, రోడ్లు మొ॥. ప్రజలకు అవసరమైన నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది- మూలధన వస్తు ఉత్పత్తి.

ద్వై విద్య ఆర్థిక వ్యవస్థ నమూనా (Fei-Rains)

  • అల్పాభివృద్ధి దేశాలు స్తబ్దత నుండి న్యయం పారంపర్య వృద్ధికి చేరే ప్రక్రియను గాస్ట్రావ్‌ రానిస్‌, జాన్‌ఫై వివరించారు.
  • ఈ వ్యవస్థలో 2 రంగాలు ఉంటాయి.
  • 1. వ్యవసాయ రంగం 2. పారిశ్రామి రంగం
  • వ్యవసాయరంగంలో ఉన్న మిగులు శ్రామికులను పారిశ్రామిక రంగానికి తరలిస్తే ఆర్థిక వ్యవస్థలో
  • ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.
  • వ్యవసాయరంగంలో మిగులు శ్రామికుల ఉత్పాదకత శూన్యం వీరిని పారిశ్రామిక రంగానికి తరలించినచో ధనాత్మక ఉత్పాదక శ్రామికులు అవుతారు.

స్థిర పారంపర్య వృద్ధి (Steady Growth)

  • ఈ వ్యవస్థను కీన్స్‌ తరువాత పలువురు ఆర్ధిక వేత్తలు అభివృద్ధి పరిచారు
  • స్థిర పారంపర్య వృద్ధి అనేది ధీర్ఘకాలిక భావన
  • ఈ భావన అభివృద్ధి పరిచినది హారడ్‌ మరియు డోమర్‌ వృద్ధి నియమాలు
  • జాన్‌ రాబిన్‌సన్‌ ఆచార్య కాల్డర్‌ అనే ఆర్థిక వేత్తలు ఈ భావన విపులీకరించారు.
  • ఆచార్య మాధుర్‌ ప్రకారం స్థిర పారంపర్యం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క సాంకేతిక నిర్మాణ మార్పులు విశ్లేషణ అధ్యయనం
  • ఇలాంటి ఆర్థిక వ్యవస్థలో అన్నిరంగాలలో సమతౌల్య వృద్ధి రేటు ఉంటుంది.
  • ఈ వృద్ధి రేటు ఒక కాలం నుండి మరొక కాలంనకు పరిక్షించుబడుతుంది. దీనినే మాధుర్‌ ద్రవ్యోల్బణరహిత స్థిరపారంపర్యాభివృద్ధి అంటారు.

తక్కువ స్థాయి అసమతౌల్య స్తంభన (Low Level Equilibrium Trape)

  • దీనిని అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ఆర్‌.ఆర్‌ నెల్సన్‌ అల్ప స్థాయి సమతుల్య స్తంభనను వివరించాడు.
  • ఇది లెబాన్‌ స్టేయిన్‌ యొక్క కనీస కృషి సిద్దాంతంలాగా మాల్టస్‌ జనాభా సిద్దాంతం పై ఆధారపడి ఉంది.
  • ఇక్కడ పొదుపు పెట్టుబడులు తగ్గడం వలన జనాభా పెరుగుదలతో తిరిగి తలసరి ఆదాయం జీవనోధారస్థాయికి చేరును.
  • సోలో నిర్వచనం ప్రకారం క్రమవృద్ధి అనేది శ్రామిక శక్తి సాంకేతిక అభివృద్ధి విస్తరణ పై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
  • హరాడ్‌-డీమర్‌ నమూనా మూలధన సంచయన ప్రాముఖ్యతను తెల్పుతుంది
  • Problems of Industrialization Eastern and South Eastern Europe - Rodan
  • అభిలాషణియ స్వర్ణయుగాన్ని సాధించడమే అభివృద్ధి లక్ష్యం - ఆచార్య గౌతమ్‌ మాధుర్‌.
  • స్వతంత్ర ఆర్థికాభివృద్ధిని కారణంగా చేసుకోని సాంకేతిక ప్రగతిని గుర్తించని ఆర్థికవేత్త - కాల్డార్‌
  • ఆర్థిక వనరుల కన్నా సాంకేతిక ప్రగతికే ప్రాముఖ్యత నిచ్చిన ఆర్థికవేత్త - ఘంపీటర్‌.

ద్విఅంతరం నమూనా (Two gap Model of AID)

  •  చినరీ ప్రతిపాదించాడు.
  • యు.డి.సి.ల్లో పొదుపు, పెట్టుబడుల అంతరం పూరించుటకు లోటు బడ్జెట్‌ అనుసరించిను.
  • ఎగుమతలు తక్కువ కాబట్టి విదేశీ మారక నిల్వల అంతరం ఏర్పడును దీనినే ద్వి అంతరం నమూనా అంటారు.

ద్విఅంతరం నమూనా

  1. పొదుపు-పెట్టుబడులు (Saving Gap
  2. ఎగుమతులు-దిగుమతులు (Foreign Exchange Gap)

  • ఈ అంతరాలను పూరించుటకు Foreign Aid సహాయపడుతుది. UDC దేశాలలో పొదుపు తక్కువ ఉండుట వలన పెట్టుబడులు లేదా మూలధనంకు కొరత ఉంటుంది (Saving Investments).

ఆడమ్‌స్సిత్‌ :

  • ఇతను అర్థశాస్త్ర పితామహుడు.
  • Wealth of Nations (1776)గ్రంథకర్త.
  • సంపద నిర్వచనం ఇచ్చాడు.
  • స్వేచ్భా వ్యాపార విధానాన్ని / సిద్ధాంతాన్ని రూపొందించాడు.
  • సహజ సూత్రం (Natural Law) వివరించాడు.
  • అదృశ్య హస్తం/ కనిపించని హస్తం / Invisible Hand/Unseen Hand వివరించాడు.
  • శ్రమ విభజన (Division of Labour) సిద్ధాంతం రూపొందించాడు.
  • గుండు సూదుల సూత్రం ఉదాహరణతో వివరించాడు.

T.R. మాల్థూస్: 

  • The Principle of Political Economy (1820)
  • జనాభా సిద్ధాంతం (Population Theory)
  • సరఫరా (Supply)కి సమానంగా సమిష్టి డిమాండ్‌ ఉండదు అని మొదట చెప్పాడు.

డేవిడ్‌ రికార్డో :

  • బాటక సిద్ధాంతం (Rent Theory) ప్రతిపాదించాడు.
  • Book - Principles of Political Economy & Taxation (1817)
  • భూమికి ఉన్న సహజమైన నసింపు లేని శక్తులకు లభించేదే బాటకం.
  • దీనినే వైవిధ్యపు మిగులు అంటారు.
  • 1) బాటక సిద్ధాంతం
  • 2) స్థబ్ధత స్ధితి (Stationary State)

సాంప్రదాయ సిద్ధాంతాలు (Classical Theories)

ఆడమ్‌స్మిత్, రికార్డో, మాల్థూస్ , జె.ఎస్‌.మిల్‌ ఈ క్రింది సిద్ధాంతాలను ప్రతిపాదించారు.

  1. స్వేచ్భా వ్యాపార విధానం (Laissaz Faire)
  2. స్తబ్దత స్థితి (Stationary State)
  3. పెట్టుబడికి ప్రేరణ లాభాలు (Profit the Intensive to Investment)
  4. ఒక దశ తర్వాత లాభాలు క్షీణించే ధోరణి (Tedency of Profits to Declain)
  5. మూలధన సంచయనం అవసరం (Capital Accumulation)
  6. సమతౌల్యం
  7. అగోచర హస్తం
  8. సంపూర్ణ ఉద్యోగిత
  9. ప్రభుత్వ జోక్యం ఉండరాదు
  10. ధరల యంత్ర
  11. వేతన కోత సిద్ధాంతం
  12. సరఫరా (Supply) డిమాంద్‌ను సృష్టిస్తుంది.

J.B.Say:

  • J.B.Say సప్లై తన డిమాండ్‌ను తానే సృష్టిస్తుంది (Supply Creates its own Demand) అని పేర్కోన్నాడు. దీనిని మార్కెట్‌ సూత్రం (Law of Markets) అంటారు.

J.M.Keynes (John Meyard Keynes):

  • ఇతనిని Father of Macro / Modern Economics అని పిలుస్తారు.
  • 1936 లో సాధారణ సిద్ధాంతం (General Theory of Employment, Interest & Money) అనే గ్రంథం రచించాడు.

  1. సార్ధక డిమాండ్‌ (సమిష్టి డిమాండ్‌, సమిష్టి సపై సమానమైన చోట సార్థక డిమాండ్‌ ఏర్పడుతుంది).
  2. ద్రవ్యోల్బణ విరామం
  3. గుణకం
  4. MEC(Marginal Efficiency of Capital) ప్రతిపాదించాడు.

  • 1929-30లో ఏర్పడిన ఆర్థిక మాంద్యానికి నివారణ మార్గాలు సూచించాడు.
  • ప్రభుత్వ పెట్టుబడి/ వ్యయానికి ప్రాధాన్యత ఇచ్చారు.
  • ఆర్థిక మాంద్య కాలంలో ప్రభుత్వ పెట్టుబడి చేత ఆర్థిక సంక్షోభాన్ని నివారించవచ్చని సూచించాడు.
  • ఆర్థిక మాంద్య కాలంలో లోటు బడ్జెట్‌ విధానం ఉపయోగకరమని సూచించాడు.
  • ఆర్థిక మాంద్య కాలంలో “పూడికలు తీయండి, పూడికలు పూర్చండి” అని నినాదం ఇచ్చాడు.

సిద్ధాంతాలు సిద్ధాంతకర్తలు:

  • సాంఘిక ఉపాంత, ఉత్పాదకత పెట్టుబడి సిద్ధాంతం - గీ... ఖాన్‌ & బి.చినారి
  • పున: పెట్టుబడి సిద్ధాంతం & ఉపాంత పెట్టుబడి సిద్ధాంతం - గాలెన్‌సన్‌ & లైబెన్‌స్టీన్‌
  • కాపిటల్‌ టర్నోవర్‌ క్రైటెరియన్‌ - పొలాక్‌ & బుకనాన్‌
  • కాళశ్రేణి  పెట్టుబడి (లేదా) కాల పరంపర పెట్టుబడి సిద్ధాంతం - అమర్త్య కుమార్‌ సేన్‌ & మారిన్‌ డాబ్‌
  • వినియోగ వస్తువుల ప్రవాహాన్ని పెంచి ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేయాలని A.K.సేన్‌ సూచించాడు.

పరిణామాత్మక, గుణాత్మక సూచికలు

ఆర్థికాభివృద్ధి సూచికలను పరిణామాత్మక, గుణాత్మక సూచికలుగా వర్గీకరించవచ్చు.

పరిణామాత్మక సూచికలు

  1. జాతీయ ఆదాయంలో పెరుగుదల
  2. తలసరి ఆదాయంలో పెరుగుదల
  3. వినియోగంలో పెరుగుదల
  4. అవస్థాపక సౌకర్యాలలో వృద్ధి
  5. విద్యా, వైద్య సౌకర్యాలలో వృద్ధి, సామాజిక వ్యవస్థను ఏర్పరచడం.
  6. అక్షరాస్యతలో పెరుగుదల
  7. వనరుల సంపూర్ణ వినియోగం
  8. పారిశ్రామిక సేవారంగాలలో వృద్ధి
  9. ధర స్థాయిలో తగ్గుదల
  10. జనాభా రేటు తగ్గుదల
  11. శిశు మరణాల రేటు తగ్గుదల
  12. నిరుద్యోగం, పేదరికం, ప్రాంతాల ఆదాయాల మధ్య వ్యత్యాసం అన్ని తగ్గుదల.

గుణాత్మక సూచికలు

  1. జీవన ప్రమాణస్థాయి పెరుగుదల
  2. మెరుగైన వాతావరణ పరిస్థితులు
  3. పరిశుభ్రత .
  4. శాంతిభద్రతల సౌకర్యం
  5. అభివృద్ధికి ప్రోత్సాహకరంగా ఉండే పద్ధతుల్లో పెరుగుదల.

Keywords: Tspsc economy notes in telugu,tspsc indian economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,economy notes,tspsc indian economy notes in telugu,group 2 indian economy notes in telugu,tspsc indian economy study material in telugu,group 2 indian economy study material in telugu 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)