III. సైమన్ - కుజ్‌నట్స్ వృద్ధి దశలు
- ఇతని సిద్ధాంతాన్ని “Inverted-U-Hypothesi” (తిరగేసిన U-పరికల్పన సిద్దాంతం) అంటారు.
- స్థూల జాతీయ ఉత్పత్తి స్థూల దేశీయ ఉత్పత్తి అనుభవాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాడు.
3 దశలు :
- 1) కుజ్‌నట్స్ ప్రకారం ఆర్థికాభివృద్ధి ప్రారంభ దశలో వ్యవసాయం పాత్ర ఎక్కువ.
- 2) ఆ దశ తర్వాత సాంకేతిక అభివృద్ధి వలన ద్వితీయ రంగం వాటా పెరిగి ప్రాథమిక రంగం వాటా తగ్గుతుంది మరియు శ్రామిక శక్తి కూడా ప్రాథమిక రంగం నుండి ద్వితీయ రంగానికి తరులుతుంది.
- 3) చివరి దశలో లేదా పెట్టబడి దారి దశలో శ్రామిక శక్తి ద్వితీయ నుంచి తృతీయ రంగంలోకి మారుతుంది.
విమర్శ :
- 1) నార్వే మరియు మధ్య పాశ్చ్య దేశాలలో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా ఎక్కువ ఉన్నప్పటికీ ఇవి అభివృద్ధి చెందాయి.
- 2) భారతదేశ 'ఆదాయంలో సేవారంగం వాటా 50%కి మించినా భారత్ అభివృద్ధి చెందలేదు. కారణం ఉపాది తక్కువ.
వృద్ధి సిద్ధాంతాలు లేక వ్యూహాలు
వృద్ధి సిద్ధాంతాలు లేక వ్యూహాలలో ముఖ్యమైనవి.
- బిగ్‌పుష్ సిద్ధాంతం
- సంతులిత వృద్ధి సిద్ధాంతం
- అసంతులిత వృద్ధి సిద్ధాంతం
- గున్నార్ మిర్దాల్ సిద్ధాంతం
- వకీలు బ్రహ్మానందం వేతన వస్తు వ్యూహం
- స్వర్ణయుగం
- కనీస కృషి సిద్ధాంతం
- అపరిమిత శ్రామీక సప్లై సిద్ధాంతం
- అల్పస్థాయి సమతౌల్య సిద్ధాంతం
- నవకల్ప సిద్ధాంతం
- హరడ్ & డోమర్ సిద్ధాంతం
- పి.సి. మహల్‌నోబిస్ 4 రంగాల నమూనా
- వృద్ధి స్తబ్దత సిద్ధాంతం
- కాల్డర్ వృద్ధి నమూనా
- కేంద్ర ఉపరితల వైవిద్య సిద్ధాంతం
- ఆధారిత సిద్ధాంతం
1. బిగ్‌పుష్ సిద్ధాంతం (Big Push Theory)
- 1943 లో రోజెన్‌స్టీన్ రోడాన్ ప్రతిపాదించాడు...
- ఇతని గ్రంథం - “The problems of industrialization of eastern & south eastern european nations"
- రోడాన్ పరస్పరం అనుబంధం ఉండే- రంగాలలో పెట్టబడులు భారీగా ఉండాలని సూచించాడు లేదా పెట్టుబడులు కో-'ఆర్డినేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో జరగాలని అంటాడు.
- ఉదా: చక్కెర పరిశ్రమ - చెరకు పంటలు
- విమానం పైకి ఎగరాలంటే ఒక స్థాయి వేగం పొందుటకు వేగంగా పరుగు తీయాలి ఆ తరువాతే పైకి ఎగురుతుంది.
- ఇదే విధంగా పేద దేశాలు అభివృద్ది సాధించుటకు భారీస్థాయిలో పెట్టుబడులు సమకూర్చాలి.
- భారీ పెట్టబడుల వలన అవిభాజ్యాలు బహిర్గత ఆధారాలు లభిస్తాయి.
- రోడాన్ ప్రకారం మూడు రకాలైన అవిభాజ్యాలు వస్తాయి.
- 1) ఉత్పత్తి ఫలంలో అవిభాజ్యాలు
- 2) పొదుపులో అవిభాజ్యాలు
- 3) డిమాంద్‌లో అవిభాజ్యాలు
- అవిభాజ్యాలు అనగా విడదీయుటకు అవకాశం లేని ప్రయోజనాలు.
- చిన్న మొత్తాలలో పెట్టుబడులను సమకూర్చుట ద్వారా ప్రయోజనం ఉండదు.
- భారీస్థాయిలో పెట్టుబడులు సమకూర్చుతూ ఆర్థిక వ్యవస్థకు ఒక ఊపును అందించుటనే “బిగ్ పుష్” అంటారు.
- ఉదా. Shoe ఫ్యాక్టరీ తీసుకున్నాడు
- సాంప్రదయ ఆర్థిక వేత్తల ప్రకారం ఆర్థికవ్యవస్థ స్థిర సమతుల్య పరిస్థితులు (Static Equilibrium) కలిగి ఉంటుంది.
- పెట్టుబడుల వల్ల కొన్ని అవిభాజ్యాలు ఏర్పడి వృద్ధి ప్రక్రియ కొన్ని ఒడిదుడుకులకు (Discontinuities and Jumps) లోనవుతుంది.
- స్థిర సమతుల్య సిద్ధాంతాల మీద ఆధారపడిన సంప్రదాయ విశ్లేషణ అవిభాజ్యాలను గానీ, తద్వారా ఆర్థిక వ్యవస్థలో జనించే బాహ్య ఆదాలను గానీ లెక్కలోకి తీసుకోదు. దీని వల్ల వృద్ధి ప్రక్రియ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొనవలసి వస్తుంది.
- పై వాటికి తోడు, వెనుకబడిన దేశాలలోని మార్కెట్ వ్యవస్థ అసంపూర్ణం. పరిమిత మార్కెట్‌ను విస్తరింపచేసి, ఆర్థిక వ్యవస్థను స్థిర సమతుల్య పరిస్థితుల నుంచి వలన సమతుల్య పరిస్థితులకు (Dynamic Equilibrium) మార్చి, అభివృద్ధి నిరోధకాలను తొలగిస్తే వృద్ధి ప్రక్రియ సాఫీగా సాగుతుంది.
- సాంప్రదయ శాస్త్రవేత్తలు పట్టించుకోని అవిభాజ్యాలకు, తద్వారా జనించే బాహ్య ఆదాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి, ఆర్థిక వ్యవస్థను చలన సమతుల్య పరిస్టితి కల్పించిన ఆర్థికవేత్త రోజెన్‌స్టీన్ రోడాన్.
- బాహ్య ఆదాలపై ఆధారపడి రచించిన ఇతని అభివృద్ధి నమూనాను Big-Push సిద్ధాంతంగా పేర్కొనవచ్చును.
- Rodan అభిప్రాయంలో చిన్న చిన్న మోతాదులలో ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలలో ఎన్ని పెట్టుబడులు పెట్టిన ఫలితం శూన్యం.
- ఆర్థికాభివృద్ధి సాధించుటకు అవిభాజ్యాల వల్ల జనించే బాహ్య ఆదాలు ఎక్కువగా ఉన్న రంగాలలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి, ఆర్థిక వ్యవస్థకు ఒక ఊపును తీసుకురావటం కనీస ధర్మం.
- కొంత కనీస స్థాయిలో ఊపును కలిగిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ వేగం అందుకుని, ఆర్థిక వృద్ధి రహదారిలో ప్రయాణిస్తుంది.
2. సంతులిత వృద్ధి సిద్ధాంతం. (Balanced Growth Theory)
- అభివృద్ధి చేసినది - రాగ్నార్ నర్క్స్
- ఇది రోడాన్ పేర్కొన్న "పరిమిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థ" ఆధారంగా వివరించాడు.
- ఈ సిద్ధాంతం J.B. Say ప్రతిపాదించిన మార్కెట్ సూత్రం అయిన “Supply Creates Its Own Demand" అనే ప్రమేయంపై ఆధారపడి రూపొందించబడినది. ఇది J.B. Say Market Law పై ఆధారపడి ఉంటుంది.
- ఇతని గ్రంథం - “Problems of capital formulation in under developed countries-1953”ఆర్థిక వ్యవస్థలో. వివిధ రంగాలలో లేదా పరిశ్రమలలో ఏక కాలంలో పెట్టుబడి పెట్టి వాటిని అభివృద్ధి పరుచుటను సంతులిత వృద్ధి సిద్ధాంతం అని అంటారు.పరిమిత మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు కారణం పేదరిక విష వలయాలు.పేదరికం విషవలయం అను భావనను మొదటిసారిగా నర్క్స్ ప్రతిపాదించాడు.
- పేదదేశాలు ఈ విషవలయంలో చిక్కుకొనుట వలన అభివృద్ధి సాధించలేక పోతున్నాయి.
- నర్క్స్ ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు మూలధనం కొరత వలన పేదరిక విషవలయంలో చిక్కుకొంటున్నాయి. వీటిని 2 రకాలుగా వివరించాడు.
- 1) Demand వైపు విషవలయాలు
- 2) Supply వైపు విషవలయాలు
Demand వైపు విషవలయాలు
- నర్క్స్ డిమాండ్ వైపు విషవలయాలు ఛేదించడానికి పేద దేశాలు వస్తు సేవలకు డిమాండ్‌ను సృష్టించాలని సూచించాడు.
- డిమాండ్‌ని పెంచడానికి ప్రభుత్వాలు మార్కెట్ సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రైవేటు పెట్టబడిదారులని ప్రోత్సహించాలని సూచించాడు.
అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం:
- ప్రదర్శన ప్రభావాన్ని మొదటగా పేర్కొన్నది - “డ్యూసెన్ బెర్రి దీన్ని అభివృద్ధి పరిచినది - రాగ్నార్ నర్క్స్.
- పేద దేశాలలోని ధనిక వర్గాలు అభివృద్ధి చెందిన ప్రజల జీవన ప్రమాణాలను అనుసరిస్తూ విలాసవంతమైన వస్తువులను దిగుమతి చేసుకుంటారు దీని వలన దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. దీనినే “అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం” అంటారు.
- రాగ్నార్ నర్క్స్ డిమాండ్ వైపు విషవలయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఎందుకనగా పెట్టుబడికి ప్రోత్సాహం ఇచ్చేది డిమాండ్ మార్కెట్ యొక్క పరిమాణం.
Supply వైపు విషవలయాలు :.
Supply వైపు విషవలయాలను ఛేదించుటకు పొదుపురేటుని ప్రోత్సహించి పెట్టుబడులను సేకరించాలి.
- అభివృద్ధి చెందిన దేశాలలో పొదుపు తక్కువగా ఉండటానికి గల కారణం
- ధనిక వర్గ ప్రజలకు ఆదాయం ఎక్కువగా ఉన్న అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం వలన దిగుమతి వస్తువులను ఉపయోగిస్తారు.
- పేదవారికి పొదుపు చేసే శక్తి ఉండదు.
ప్రచ్చన్న నిరుద్యోగం
- వ్యవసాయ రంగంలోని ప్రచ్చన్న నిరుద్యోగులను “నిజపొదుపుగా” ఉపయోగిస్తూ మూలధన. కల్పన ఉపయోగించవచ్చని నర్క్స్ పేర్కొన్నాడు.
- ప్రచ్చన్న నిరుద్యోగులను వ్యవసాయేతర రంగాలైన నిజమూలధనం కల్పించే సామాజిక, వ్యవస్థాపూర్వక పెట్టుబడుల వైపు మరలించడాన్ని సూచించాడు. అనగా నీటిపారుదల, మురుగునీరు, రైళ్లు, రహదారులు, గృహ వసతులు, కర్మాగారాలు మొదలైన వాటిలో నియమించవచ్చును.ఈ పథకాలు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మూలధనాన్ని కల్పిస్తాయి.
- వెనుకబడిన దేశాలు ఆర్థికంగా వెనుకబడి ఉండడం వల్ల ప్రచ్చన్న నిరుద్యోగులను పారిశ్రామిక రంగాలకు గాని, ఇతర రంగాలకు గాని తరలించలేవు.
- ఈ సిద్ధాంతాన్ని విమర్శించినది - సింగర్, పాల్‌స్ట్రీటన్, కురిహర, హార్ష్ మన్ లాంటి ఆర్థికవేత్తలు ప్రచ్చన్న నిరుద్యోగులను - పొదుపు గా వాడడాన్ని విమర్శించారు.
3. సంతులిత వృద్ధి సిద్ధాంతం (Unbalanced Growth Theory)
- హార్ష్‌మన్ ప్రతిపాదించాడు.
- ఇతడు సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని విమర్శించి దీనిని ప్రతిపాదించాడు.
- దీనిని మొదటిగా అనుసరించిన దేశం - రష్యా
- ఈ సిద్ధాంతాన్ని సింగర్, పాల్‌స్ట్రీటన్, కిండర్‌బర్గర్ సమర్థించారు.
- మూలధన కొరత వలన అన్ని రంగాలలో ఒకేసారి పెట్టుబడులు సమకూర్చుట సాధ్యం కాదు. అందువలన ఎంపిక చేసిన లేదా మౌళిక లేదా గుర్తించబడిన లో పెట్టుబడులు పెట్టాలనీ సూచించారు.
- హర్ష్‌మన్ ముందు, .వెనుక అనుబంధాలు కలిగిన పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని సూచించాడు.
- ప్రతి పరిశ్రమ తన ఉత్పాదకాల కోసం ఇతర పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. దీనిని “వెనుక అనుబంధాలు” (Backward Linkages) అంటారు.
- ప్రతి పరిశ్రమ తన ఉత్పత్తిని ఇతర పరిశ్రమలకు ఉత్పాదకం అమ్ముతుంది. దీనిని “ముందు అనుబంధాలు” (Forward Linkages) అంటారు.
- ఉదా: ఇనుము, ఉక్కు పరిశ్రమ (Mother of Industry)
- స్టీల్ పరిశ్రమ వలన ముందస్తు రంగంలో గనుల త్రవ్వకాలు, రవాణా, హోటల్ మొ! పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.
- స్టీల్ ఉత్పత్తుల ఆధారంగా గృహనిర్మాణ రంగం ఇతర అనుబంధ రంగాలు ప్రగతిని సాధిస్తాయి. ఈ సిద్ధాంతాన్ని భారత్ 2వ ప్రణాళిక కాలంలో అనుసరించింది.
అసంతులిత వృద్ధికి 2 రకాల పెట్టుబడులను సూచించారు.
- 1) SOC (Social Overhead Capital) - సాంఘీక వ్యవస్థాపరమైన మూలధనం
- 2) DPA (Directly Productivity Achvities) - ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలు
సాంఘీక వ్యవస్థాపరమైన మూలధనం SOC (Social Overhead Capital) :
- ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలకు పనికివచ్చే ఉత్పాదకాలను అందజేస్తుంది. ఉదా: రవాణా సౌకర్యాలు, విద్యుచ్చక్తి, శాంతి భద్రతలు, ప్రజాఆరోగ్యం, విద్యాబోధన, ప్రసారసాధనాలు, నీటిపారుదల, మొదలైనవి.
ప్రత్యక్ష ఉత్పాదక కార్యకలాపాలు DPA (Directly Productivity Audivity)
- అల్పాభివృద్ధి చెందిన దేశాల ప్రజలకు చొరవలేదు. జడత్వంగా ఉంటారు. దీనిని అధిగమించడానికి ఉద్దేశపూర్వకంగా కొరతలను ఒత్తిడులను సృష్టించాలి. తిరిగి ఈ అసమానతలను సరిదిద్దాలి.
- డి.పి.ఎ.లో సాధారణంగా అన్ని రకాల వినియోగ, మూలధన వస్తువుల ఉత్పత్తి జరుగుతుంది. ఉదా: ఇనుము, ఉక్కు బొగ్గు, యంత్రాలు మొదలైన పరిశ్రమలు.
- అసంతులిత వృద్ధి 2 రకాలుగా జరుపవచ్చునని Harshman పేర్కొన్నాడు.
- SOC కొరత ద్వారా అభివృద్ధి → ఈ మార్గంలో మొదట డి.పి.ఎ. పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారు.
- SOC ఆధిక్యత ద్వారా అభివృద్ధి → దీని ద్వారా, అవస్థాపన సౌకర్యాలు పెరిగి తక్కువ వ్యయంకి లభిస్తాయి. ఇవి డి.పి.ఎ. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తాయి.
- SOC లద్వారా కొన్ని రంగాలలో అసమతుల్యాన్ని సృష్టిస్తే ఇది మరికొన్ని రంగాలలో అభివృద్ధి శక్తులను ప్రేరేపిస్తుంది.
- ఈ అసమతౌల్యతల వలన ఆర్థికాభివృద్ధి వేగంగా సాధించవచ్చని Harshman పేర్కొన్నాడు.
- SOC బహిర్గత ఆదాలను సృష్టిస్తాయి, DPA వీటిని ఉపయోగించుకుంటాయి.
- హర్ష్‌మన్ ప్రకారంప్రోత్సాహకర, ఒత్తిడి శక్తుల వలన అభివృద్ధి వేగవంతం అవుతుంది:
- Note: అంతిమ వినియోగ వస్తువులుగా మార్చే పరిశ్రమలను చివరి దశ పరిశ్రమలను, దిగుమతి ప్రత్యామ్నాయ పరిశ్రమలను మొదటగా ప్రారంభించాలని సూచించాడు.
- "Last Industries First" అని హర్ష్‌మన్ పేర్కొన్నాడు.
- Harshman ప్రకారం తుది పరిశ్రమలకు ఎక్కువ వెనుక అనుబంధ ఫలితాలుంటాయి.
- దిగుమతుల ప్రత్యామ్నాయాల ద్వారా ఎగుమతులను ప్రోత్సహించే వ్యూహాన్ని అభివృద్ది చెందుతున్న దేశాలు అనుసరించాలి.
- Harshman కన్వెర్జంట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ మరియు డైవెర్జెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి చెప్పాడు.
- Convergences Investments ఏకముఖమైనవి / అభిసరించే పెట్టుబడులు
- దీని వలన పెట్టుబడితో పోల్చితే లభించే ఆదాయం/ ఉత్పత్తి / ప్రయోజనం తక్కువగా ఉంటాయి.
- Divergnets Investments వ్యాపించునవి / అపసరించే పెట్టుబడులు
- దీని వలన పెట్టుబడితో పోల్చితే లభించే ఆదాయం/ ఉత్పత్తి / ప్రయోజనం ఎక్కువ. కావున ప్రభుత్వాలు వీటిని గుర్తించి పెట్టుబడులు చేయాలి.
- Harshman కూడా మార్కెట్ యంత్రాన్ని పెట్టుబడిదారి విధానాన్ని సమర్థించుటం వలన ఇతని వ్యూహంతో ప్రణాళికకు తావులేదు. శాశ్వత ప్రభుత్వ జ్యోక్యానికి స్థానం లేదు. ప్రభుత్వ విధానాల పాత్ర తాత్కాలికం. ఇది ప్రారంభ దశలో మాత్రమే ఉంటుంది.
4. Spread Effects & Back Wash Effects:
- దీనిని స్వీడన్‌కి చెందిన గున్నార్ మిర్దాల్ వివరించాడు.
- ఇతని గ్రంథం - Asian Drama
- ఈ సిద్ధాంతాన్ని “థియరీ ఆఫ్ సర్కులర్ కాజేషన్” అని కూడా అంటారు.
- అభివృద్ధి అనే ప్రక్రియలో చైనా, ఇండియా, పాకిస్థాన్ మొదలైన ఆసియా దేశాలు అభివృద్ధిని సాధిస్తూ ఒక కొత్త నాటకం సృష్టిస్తున్నాయని గున్నార్ మిర్దాల్ పేపేర్కొన్నాడు
Back Wash Effects:|
- అధిక విస్తరణ కలిగిన ప్రాంతాల యువకులను మరియు అధిక చైతన్యవంతమైన. ప్రజలను ఆ ప్రాంతాల వైపు ఆకర్షించుకుంటాయి.
- వెనుకబడిన ప్రాంతాలలోని పరిశ్రమలు ఈ విధానంతో నష్టపోతాయి.
- అభివృద్ధి చెందిన వారి ప్రాంతాల ఆదాయం పెరగడం వలన దాని చుట్టుప్రక్కల ఉండే ఇతర ప్రాంతాలలో చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు మొ॥। క్షీణిస్తాయి.
- Back Wash Effects వలన ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి.
Spread Effects:
- ఒక ప్రాంతం విస్తరించడం వలన ఇతర ప్రాంతాలలో చెడు ప్రభావంతో పాటు మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి.
- దీనిలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు, సాంకేతిక ప్రగతి మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించి అభివృద్ధిని ప్రేరేపిస్తుంది.
- ఉదా: కరాఛీ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి సాధించటంలో గ్రామాల నుండి యువకులు & పెట్టుబడులు కరాచీకి తరలి వెళ్ళడం వలన ఈ నగరం అభివృద్ధి సాధిస్తూ మరింత విస్తరణ జరిగింది.
- అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా వెనుకబాటు తనానికి గురై Back Wash Effects ఫలితంగా అసమానతలు మరింతగా పెరిగాయి.
- Spread Effects Positive గా పనిచేస్తాయి. వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి.
- Back Wash Effects Negative గా పనిచేస్తాయి. వీటిని ప్రభుత్వాలు ప్రోత్సహించకూడదు.
5. వకీలు బ్రహ్మానందం వేతన వస్తు వ్యూహం :
- ఇతని గ్రంథం - Planning for an Expanding Economy
- ఇతను మహాలనోబిస్ 4 రంగాల నమూనాను వ్యతిరేకించాడు
- శ్రామికుల వేతనాలు పెంచుతూ సాధారణ ప్రజలు ఉపయోగించే వస్తువులను అధికంగా ఉత్పత్తి చేసే సూక్ష్మ & మధ్య తరహా పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించాలని సూచించాడు.
- ఇది 7వ ప్రణాళిక లో అమలుపరచబడింది.
6. Golden Age (స్వర్ణయుగం):
- శ్రీమతి జాన్ రాబిన్‌సన్ వివరించారు.
- ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ సూత్రంపై ఆధారపడి ఉంటుంది.
- Books - 1) The Accumilation of Capital - 1953 2) Essay in the Theory of Economic Growth - 1963
- పేద దేశాలలో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రమశక్తికి కొరత ఉండదు. కానీ ఈ దేశాలలో పెట్టుబడి కొరత ఉంటుంది. జనాభావృద్ధి రేటును మించి పెట్టుబడి రేటు ఉండాలి.
- జనాభా పెరుగుదల రేటు, మూలధన పెరుగుదలకు సమానమైనపుడు ఆ దేశాలలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి ఉంటుంది.
- పేదదేశాలు మెరుగైన సాంకేతిక ప్రగతిని అనుసరించడం ద్వారా అభివృద్ధిని సాధించవచ్చును.
- సంపూర్ణ ఉద్యోగితతో కూడిన క్రమవృద్ధిని సాధించుటనే Golden Age అనవచ్చు.
- Growth Rate of Population = Growth Rate of Capital = Full Employment
- జనాభివృద్ధి రేటు = పెట్టుబడి వృద్ధిరేటు = సంపూర్ణ ఉద్యోగిత.
7. కనీస కృషిసిద్ధాంతం (Critical Minimum Efforts):
- దీనిని Lebian Stain వివరించాడు. ఇతని గ్రంథం “Economic Backwardness & Economic Growth" ఇతని ప్రకారం ఆదాయం జనాభా పెట్టుబడుల మధ్య సంబంధం ఉంటుంది.
- 1) జనాభా ఆదాయాన్ని తగ్గించే కారకం
- 2) పెట్టుబడి ఆదాయాన్ని వృద్ధి చేసే కారకం
- ఆదాయాన్ని వృద్ధి చేసే కారకం బలంగా ఉందాలి. దీనికి కావలసిన పెట్టుబడినే Critical Minimum Effort అంటారు లేదా తక్కువ అభివృద్ధి దశ నుండి దేశాలు బయటపడుటకు చేసే కనీస పెట్టుబడిని Critical Minimum Effort అంటారు.
- పేదరిక విషవలయం తక్కువ తలసరి ఆదాయం అనే సమస్యలను పరిష్కరించడానికి చేసే పెట్టుబడులను Critical Minimum Effort అని అంటారు.
8. అపరిమిత శ్రామిక సరఫరా సిద్ధాంతం (Unlimited Supply of Labour) :
- దీనిని ఆర్ధర్ లూయిస్ ప్రతిపాదించాడు.
- ఈ సిద్దాంతం “శ్రామికుల మిగులు” మీద ఆధారపడి ఉంటుంది.
- ఇతని గ్రంథం - “Economic Development with Unlimited Supply of Labour"
- అర్ధిక వ్యవస్థలో 2 రంగాలుంటాయి.
- జీవనాధార రంగం
- పెట్టుబడిదారీ. రంగం
- జీవనాధార రంగంలో వేతనాలు వారి జీవనానికి మాత్రమే సరిపోతాయి.
- పెట్టుబడిదారీ రంగంలో వేతనాలు ఎక్కువగా లభిస్తాయి. అందువలన పేద దేశాలలోని అపరిమితమైన శ్రామికులను ఈ రంగానికి తరలించడం వలన అభివృద్ధి సాధించవచ్చు.
9. అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం (Low Level Equilibrium Trap):
- దీనిని నెల్సన్ వివరించాడు.
- అల్ప అభివృద్ధి చెందిన దేశాలు జీవనాధార స్థాయి తలసరి ఆదాయం వద్ద నిలకడయైన సమతౌల్యంలో ఉంటాయి. ఈ స్థితిలో పొదుపు పెట్టుబడులు తక్కువగా ఉంటాయి.
- అందువలన ఈ దేశాలు లో లెవల్ ఈక్విలిబ్రియం ట్రాప్‌లో చిక్కుకుని ఉంటాయి.
- ఈ ట్రాప్ నుండి బయటికి రావడానికి పెట్టుబడులు భారీగా అవసరమని నెల్సన్ పేర్కొన్నాడు.
10. నవకల్పన సిద్ధాంతం (Theory of Radical Innovation):
- దీనిని ఘం పీటర్ వివరించాడు
- Books:
- Business Cycles
- Theory of Economic Development
- Capitalism
- Socialism & Democracy
- ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల స్థానంలో నూతన పద్ధతిని ప్రవేశపెట్టడాన్నే నవకల్పనగా పేర్కొంటారు.
- మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నూతన వస్తువుల సృష్టినే నవకల్పన అనవచ్చును.
- అభివృద్ధి చెందుతున్న దేశాలలో నవకల్పనలు ఉపయోగించి ఆర్థికాభివృద్ధి సాధించ వచ్చును.
- నవకల్పనను 5 రకాలుగా విభజించాడు.
- నూతన ముడిసరుకులను లేదా సహజ వనరులను కనుగొనుట
- కొత్త ఉత్పత్తి పద్ధతులను సృష్టించుట
- మార్కెట్‌లో నూతన వస్తువులను సృష్టించుట
- నూతన మార్కెట్‌లను కనుగొనుట
- పాతవ్యవస్థ స్వరూపాన్ని మార్చి కొత్తవ్యవస్థను సృష్టించడం
- ఇతను ఆర్థిక వృద్ధి & ఆర్థికాభివృద్ధి మధ్య తేడాను వివరించినాడు.
- ఆర్థికాభివృద్ధి ఒక చక్రీయ రూపంలో జరుగుతుందని పేర్కొన్న వ్యక్తి - షుంపీటర్
- ఉద్యమకారులు, నవకల్పనలకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్థికవేత్త - షుంపీటర్
- షుంపీటర్ ప్రకారం పెట్టుబడులు 2 రకాలు
- ప్రేరిత పెట్టుబడి.
- స్వయం ప్రేరిత పెట్టుబడి.
- ప్రేరిత పెట్టుబడులు స్వల్ప కాలానికి సంబంధించినది. ఇది లాభాలు, ఆదాయాల చేత ప్రేరేపించబడుతుంది.
- స్వయం ప్రేరిత పెట్టుబడులు దీర్హకాలానికి సంబంధించినవి. ఇది లాభాలు, ఆదాయాల చేత ప్రేరేపించబడవు.
- స్వయం ప్రేరిత పెట్టుబడులు దీర్హకాలానికి సంబంధించినది. ఇది సాంకేతిక మార్పులు, నూతన వనరులపై చేసే పెట్టుబడి. వీటి ప్రధాన ఉద్దేశ్యం అభివృద్ధి మరియు సామాజిక ప్రగతి.
- ద్వంద్వత్వం: అభివృద్ధి చెందిన & వెనుకబడిన లక్షణాలు కలిగి ఉండటం.
- ఆర్థిక ద్వంద్వత్వం - బెంజిమెన్ హిగ్టిన్స్ ప్రతిపాదన - సంఘటిత, అసంఘటిత రంగాలు పక్కపక్కనే ఉండటం.
- అసంఘటిత రంగం - కుటీర, చేనేత, హస్తకళలు, చిన్నరైతులు, వడ్డీ వ్యాపారస్థులు.
- సంఘటిత రంగం - భారీ పరిశ్రమలు, పెద్ద రైతులు, యంత్రాలు.
- సాంఘీక ద్వంద్వత్వం - J.H. బోడే
- వినిమయ ద్వంద్వత్వం - ఇమాన్యుయల్
- సాంకేతిక ద్వంద్వత్వం - జోర్గన్‌సన్
- విత్త ద్వంద్వత్వం - మింట్
- ప్రాంతీయ ద్వంద్వత్వం - గున్నార్ మిర్దాల్
సాంఘిక ద్వంద్వత్వం:
- వెనుకబడిన దేశాలలోని పురాతన దేశీయ సంస్కృతికి సంబంధించిన ఒక సమాజం, ఆధునిక దిగుమతి చేసుకున్న సంస్కృతికి సంబంధించిన మరొక సమాజం రెండు కనబడతాయి.
II. హరడ్ (England) & డోమర్ (USA) సిద్ధాంతం: గ్రోత్ మోడల్ :
- హరడ్ రాసిన గ్రంధం - "Towards a Dynamic Economics"
- డోమర్ రాసిన గ్రంధాలు - 1) Capital Expansion 2) Rate of Growth & Development 3) Essays in the Theory of Economic Growth
- మొదటి ప్రణాళికకు HD మోడల్‌ను తీసుకున్నారు.
- 3 & 10వ ప్రణాళికలో HD మోడల్‌ను పరోక్షంగా అనుసరించారు.
- HD సిద్ధాంతం పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది.
- పెట్టుబడికి గల 2 లక్షణాలను వీరు వివరించారు.
- పెట్టుబడి ఆదాయాన్ని పెంచుతుంది.
- పెట్టుబడి ఆర్థికవ్యవస్థ యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది.
- పేద దేశాల యొక్క అభివృద్ధి రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- 1) శ్రామిక శక్తి 2) పెట్టుబడి
- పేదదేశాలలో శ్రామిక శక్తి ఎక్కువగా లభిస్తుంది. కాని పెట్టుబడి సమస్య ఉంటుంది. దీనిని తొలగించడానికి పొదుపు రేటును ప్రోత్సహించాలి.
- దేశ వృద్ధిరేటు 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది.
- పొదుపు
- ICOR (Incremental Capital Output Ratio) ICOR = ΔK/ΔO
- ICOR - అదనంగా మూలధనాన్ని ఉపయోగించడం వల్ల లభించే అదనపు ఉత్పత్తిని సూచిస్తుంది. లేదా ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన పెట్టుబడిని సూచిస్తుంది.
- ICOR తక్కువగా ఉంటే వనరుల వినియోగ సామర్ధ్యం అధికంగా ఉంది అని అర్థం.
COR = K/O Where K = Capital, O = Output
వృద్ధి రేటు (G.R.) = పొదుపురేటు / ICOR (or) పెట్టుబడి / ICOR
Ex: పొదుపురేటు 20% ICOR - 5, G.R. = ?
G.R = 4%
COR/ICOR వనరుల వినియోగ సమర్థతకు, ఆర్థిక ప్రగతికి సూచికలు
COR ను నిర్ణయించు అంశాలు :
1. ఈ క్రింది అంశాల వలన COR అధికం అవుతుంది.
- భారీ మౌళిక పరిశ్రమల స్థాపనకు COR అధికం.
- మూలధన సాంద్రత గల పరిశ్రమలకు COR అధికం.
- వనరుల లభ్యత అధికంగా ఉంటే COR అధికం.
2. ఈ క్రింది అంశాల వలన COR తగ్గుతుంది.
- 1. వ్యవసాయ, గ్రామీణ, కుటీర పరిశ్రమలకు COR తగ్గును.
- 2 శ్రమ సాంద్రత గల పరిశ్రమకు COR తగ్గును.
- ౩. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తే, ధీర్ణకాలంలో COR తగ్గును.
- 4. విద్యా ప్రమాణాలు, శ్రామిక నైపుణ్యం పెరిగితే COR తగ్గును.
హరాడ్ 3 రకాల వృద్ధి రేట్లను సూచించారు.
1) సహజ వృద్ధి రేటు (GN :Natural Growth Rate)
- GN అనేది ఆర్థిక వ్యవస్థలో సహజవనరులు, శ్రామిక శక్తి మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, భూమి, శ్రామికులు, పెట్టుబడి, వ్యవస్థాపన మొ॥ నిర్ణయిస్తాయి.
- సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి కావాల్సిన వృద్ధిరేటును సహజ వృద్ధిరేటు అంటారు.
2) సంభావ్యత వృద్ధి (GW :Waranted Growth Rate)
- ఉత్పత్తిదారులు తాము ఉత్పత్తి చేసిన వస్తువులకు సమానంగా డిమాండ్ వుండే వృద్ధిరేటు.
- ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క సంపూర్ణ ఆదాయ వృద్ధిరేటును సూచిస్తుంది.
- దీనిని ఉత్పత్తిదారులకు సంతృప్తినిచ్చే వృద్ధిరేటు అని కూడా అంటారు.
3) వాస్తవ వృద్ధిరేటు (లేదా) నిజ వృద్ధి (Actual Growth Rate)
- పొదుపులను, మూలధన ఉత్పత్తి నిష్పత్తిచే భాగించగా వచ్చేది నిజ వృద్ధి
12. P.C. మహలనోబిస్ 4 రంగాల నమూనా:
- మహలనోబిస్ 1952 లో ఏక రంగ నమూనాను 1953లో రెండు రంగాల నమూనాను, 1955లో 4 రంగాల నమూనాను రూపొందించాడు.
- ఇతని గ్రంథం - “An Operational Research Approach to Indian Planning of 4 Sector Model"
- ఇతని 4 రంగాల నమూనా అమెరికాకు చెందిన ఫీల్డ్‌మెన్ యొక్క Trickel down effect సిద్ధాంతంపై ఆధారపడి ఉంది.
- ఫీల్ట్‌మెన్ ప్రకారం భారీ, మౌళిక పరిశ్రమలను స్థాపించుట వలన, వీటి ప్రయోజనాలు దశలవారీగా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చి, ఆర్థిక ప్రగతి సాధించవచ్చును.
- మహలనోబిస్ నమూనా ప్రకారం 2వ ప్రణాళికలో భారీ మౌళిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. పెట్టుబడులను 4 రంగాలుగా విభజించారు.
- భారీ యాంత్రాలు ద్వారా ఉత్పత్తి చేయబడిన పెట్టుబడి వస్తువులు
- పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేయబడిన వినియోగ వస్తువులు (C1)
- వ్యవసాయ, గ్రామీణ, కుటీర పరిశ్రమలలో ఉత్పత్తి అయిన వినియోగ వస్తువులు (C2)
- ఆరోగ్యం, విద్యా మొ|| సేవలను ఉత్పత్తి చేసే రంగం (C3)
- మహలనోబిస్ నమూనా దేశ ప్రణాళికలో 2 నుంచి 7వ ప్రణాళిక వరకు అధిక ప్రభావం చూపినది.
13. Growth Theory of Secular Stagnation:
- భారతదేశంలో పేదరికం పెరుగుటకు మహలనోబిస్ వ్యూహం విఫలం కావటం కారణం అని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయం.
అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలను పరిశీలిస్తూ Hanson (1930) సిద్ధాంతం వివరించాడు.
దేశ ప్రగతికి సహకరించే అంశాలు
- స్వయం ప్రేరిత పెట్టుబడులు
- ప్రేరిత పెట్టుబడులు
- ప్రభుత్వ పెట్టుబడులు
- వనరులను కనుగొనే రేటు
- టెక్నాలజి ప్రగతి రేటు
- జనాభా పెరుగుదల రేటు
14. కాల్టర్ వృద్ధి నమూనా:
- ఇతను కీన్స్ మరియు HDల ప్రతిపాదికన తన సిద్ధాంతాన్ని వివరించాడు.
- ఇతని గ్రంథం - “A Model of Economic Growth Differential Saving Propensity” అను. అంశానికి కాల్టర్ ప్రాధాన్యత ఇచ్చాడు.
- ఇతను ౩ ఫలాలు (or) ప్రమేయాలు ప్రతిపాదించాడు.
- 1) Saving (పొదుపు ఫలం) 2) పెట్టుబడి ఫలం 3) సాంకేతిక ప్రగతి ఫలం
15. కేంద్ర ఉపరితల వైవిధ్య సిద్ధాంతం:
- సమేర్ అయేన్ వివరించాడు.
- ఇతను 4వ ప్రపంచ దేశాలు అని మొదటిసారిగా సంభోదించాడు.
- మొదటి ప్రపంచదేశాలు -పెట్టబడీదారివ్యవస్థ / మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ద్వారా అభివృద్ది చెందిన దేశాలు
- రెండవ ప్రపంచ దేశాలు - సోషలిజం/ కమ్యూనిజం ఆధారిత దేశాలు
- మూడవ ప్రపంచ దేశాలు - మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గల దేశాలు
- నాల్గవ ప్రపంచ దేశాలు - తక్కువగా లేదా అత్యంత వెనకబడిన దేశాలు, ఉదా : ఆఫ్రికా దేశాలు
- Note: ప్రస్తుతం ౩వ ప్రపంచ దేశాలు అనే పదాన్ని వాడుతున్నారు.
- లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రజలకు అవసరమయ్యే వస్తువులకు బదులుగా మెట్రోపాలిటన్‌లో గల సూపర్‌మార్కెట్‌ల కోసం వివిధ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. దీనినే కేంద్ర ఉపరితల వైవిధ్యం అంటారు.
16. ఆధారిత సిద్ధాంతం:
- హన్స్ సింగర్ & ప్రవేశ్ Theories on Trades & Development గ్రంథంలో ఈ సిద్ధాంతం వివరించారు.
- లాటిన్ అమెరికాలోని వెనుకబడిన దేశాల అభివృద్ది ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడి ఉంటుంది.
- అభివృద్ధి చెందిన దేశాలను చక్రీయ దేశాలు (Cyclical) అని, అభివృద్ధి చెందుతున్న దేశాలను పరివేష్టిత దేశాలు (Peripheral) అని పేర్కొన్నారు.
- అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో, వ్యాపార పెట్టుబడి సంబంధాలు పెట్టుకుంటాయి.
- సాంకేతిక వెనుకబాటుతనం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు దామినేట్ చేస్తాయి.
- అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆహారధాన్యాలు, ముడి సరుకులను అభివృద్ధి చెందిన దేశాలకు అధిక లాభాలు తెచ్చిపెడుతూ ఉంటాయి.
- వర్తక నిబంధనలు కూడా అభివృద్ధి చెందిన దేశాలకి అనుకూలంగా ఉంటాయి.
- అభివృద్ధి చెందుతున్న దేశాలు జనాభా ఒత్తిడి కారణంగా వైఫల్యం చెందుతున్నాయి అని ప్రవేశ్ పేర్కొన్నారు.
ఉత్పత్తి వద్ధతులు:
- ఒక ఆర్థిక వ్యవస్థ అందుబాటులో ఉన్న వివిధ ఉత్పత్తి పద్ధతుల నుంచి అనువైన ఒక “ఉత్పత్తి పద్ధతుల ఎంపిక" అంటారు.
- ఉత్పత్తి పద్ధతుల ఎంపిక 2 రకాలు
- శ్రమ సాంద్రత పద్ధతులు LIT (Labour Intensive Techniques)
- మూలధన సాంద్రత పద్ధతులు CIT (Capital Intensive Techniques)
- అభివృద్ధి చెందుతున్న దేశాలు శ్రమ సాంద్రత పద్ధతులు ఉపయోగించాలని నర్క్స్ మేయర్, లూయిస్, సేన్, కిండల్ బర్గర్, బాల్డ్‌విన్ పేర్కొన్నారు.
- అభివృద్ది చెందుతున్న దేశాలు సాంకేతిక పరిజ్ఞానం CIT ఉపయోగించాలని లైబిన్ స్టీన్ & గాలెన్‌సన్ సూచించారు.
- అభివృద్ధి చెందుతున్న దేశాలు LIT & CIT లకు మధ్యస్థంగా ఉండే విధానాన్నీ అనుసరించాలని షూమాకర్ సూచించాడు.
- ఉత్పత్తి పద్ధతుల ఎంపికలో శ్రామికుల నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రొఫెసర్ హేమర్ సూచించాడు.