జాతీయాదాయాన్ని మదించే పద్ధతులు

Adhvith
0
Indian Economy National Income Study Material in Telugu

తలసరి ఆదాయం (Per Capita Income)

  • జనాభాలో తలా ఒక్కంటికి వచ్చే ఆదాయాన్ని తెలుపును.
  • జాతీయాదాయాన్ని దేశ జనాభాచే భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం.
తలసరి ఆదాయం(PCI) = జాతీయాదాయం / జనాభా (సం॥ మధ్య జనాభా)
  • జాతీయాదాయం పెరిగినా, జనాబా తగ్గినా, రెండూ జరిగినా, తలసరి ఆదాయం పెరుగును. PCI అనేది ప్రజల జీవన ప్రమాణాన్ని సూచించును.
  • ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని గణిస్తే నామ మాత్రపు తలసరి ఆదాయం వచ్చును.
నామ మాత్రపు తలసరి ఆదాయం = ప్రసుత ధరలలో జాతీయాదాయం / జనాభా
  • స్థిర ధరలలో తలసరి ఆదాయాన్ని గణిస్తే వాస్తవ తలసరి ఆదాయం వచ్చును.
  • వాస్తవ తలసరి ఆదాయం = స్థిర దరలలో (వాస్తవ) జాతీయాదాయం / జనాభా
  • వాస్తవ తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణ స్థాయి వృద్ధి చెందును
  • ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయాన్ని స్థిర ధరలు (వాస్తవ) లోకి మార్చవచ్చును.
 స్థిర ధరలలో తలసరి ఆదాయం = (ప్రస్తుత ధరలలో జాతీయాదాయం/జనాభా) X 100

తలసరి ఆదాయ వృద్ధిరేటు

  • జాతీయాదాయ వృద్ధిరేటు నుంచి, జనాభా వృద్ధిరేటును తీసివేస్తే తలసరి ఆదాయ వృద్ధిరేటు వచ్చును.
  • తలసరి ఆదాయ వృద్ధిరేటు = జాతీయాదాయ వృద్ధిరేటు - జనాభా వృద్ధిరేటు
  • ఉదా: జాతీయాదాయపు వృద్ధిరేటు 5%, జనాభా వృద్ధిరేటు 2%, అయినా తలసరి ఆదాయపు వృద్ధిరేటు ?
  • తలసరి ఆదాయ వృద్ధిరేటు = 5% - 2% = 3%
  • ఒక ఆధార సంవత్సరంలో గల ధరలచే ప్రస్తుత సంవత్సరంలో గల అంతిమ వస్తు సేవలను లెక్కిస్తే దానిని స్థిర ధరలలో జాతీయాదాయమందురు.
  • ఉదా: 2015-16 సంవత్సరంలో జరిగిన ఉత్పత్తిని 2011-12 సంవత్సరపు ధరలలో లెక్కిస్తే దానిని స్థిర ధరలలో జాతీయాదాయమందురు.
  • ప్రస్తుత ధరలలో ఆదాయాన్ని లెక్కిస్తే, ధరలు 'పెరుగుదల' వల్ల ఆదాయం పెరగవచ్చు. కాబట్టి అది ఆర్థిక వ్యవస్థ వాస్తవ సామర్థ్యాన్ని సూచించదు. అందుచే స్థిర ధరలలో లెక్కిస్తారు. దీనిని వాస్తవ జాతీయాదాయమందురు.
  • ధరల సూచీనే సర్దుబాటు చేయుట ద్వారా ప్రస్తుత ధరలలో ఆదాయాన్నీ, స్థిర ధరలలోకి మార్చవచ్చు.

స్థిర ధరలలో జాతీయాదాయం. = (ప్రస్తుత ధరలలో జాతీయాదాయం/ప్రస్తుత సంవత్సర ధరల సూచీ) X 100

జాతీయాదాయాన్ని మదించే పద్ధతులు 

  • ఉత్పత్తికారకాలను ఉపయోగించి వస్తు సేవలు ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తి విలువ ఉత్పత్తి కారకాలకు ఆదాయాలుగా పంచబడును. ఈ ఆదాయం వినియోగ, పెట్టుబడి వస్తువులపై వ్యయం చేయబడును. వ్యయం తిరిగి ఉత్పత్తికి దోహదపడును.
  • ఉత్పత్తి వల్ల ఆదాయం సృష్టించబడును. ఆదాయం వస్తు సేవలకు డిమాండ్‌ను కల్పించును. డిమాండ్‌ వల్ల వస్తు సేవలపై వ్యయం జరుగును. వ్యయం తిరిగి ఉత్పత్తికి దారితీయును.

  • అందుచే వీటిని Production - Distribution - Disposition గా చూపుతారు.
  • కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయి. అందుచే జాతీయాదాయాన్ని మూడు పద్ధతుల్లో గణిస్తారు.

  1. ఉత్పత్తి మదింపు పద్ధతి (Net Product Method (or) Value Added Method)
  2. ఆదాయ మదింపు పద్దతి (Income Method)
  3. వ్యయ మదింపు పద్ధతి (Expenditure Method)

ఉత్పత్తి మదింపు పద్ధతి

  • దీనిని Product Method, Value Added Method, Industrial Origin Method, Net Output Method అని పిలుస్తారు.
  • సైమన్‌ కుజినెట్స్‌ దీనిని ఉత్పత్తి సేవా పద్ధతి అని పిలిచెను.
  • ఆర్థిక వ్యవస్థలో సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని చేరిస్తే నికర ఉత్పత్తి వచ్చును.
  • ఆర్థిక వ్యవస్థలో గల ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలలో జరిగిన ఉత్పత్తిని చేరిస్తే మొత్తం ఉత్పత్తి (Gross Output) వస్తుంది. అయితే ఒక రంగంలో జరిగిన ఉత్పత్తిని మరొక రంగంలో ఉత్పత్తి కారకం (మధ్యంతర వస్తువు)గా వాడవచ్చు. అట్లాంటప్పుడు వాటి విలువను తీసివేయాలి.
  • ఉదా: మారుతీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ Steels, Tyres మొదలైన వాటిని కొని మారుతీ కార్లను ఉత్పత్తి చేస్తే, నికర ఉత్పత్తిలో జాతీయోత్పత్తి గణించేటప్పు మొత్తం Steels, Tyres కార్ల ఉత్పత్తిని కాకుండా ప్రతి దశలో అదనంగా చేరిన విలువనే (Value Added) తీసుకోవాలి. అనగా కార్ల విలువ నుంచి దాని తయారీకి ఉపయోగించిన మధ్యంతర వస్తు విలువ (Steels, Tyres) ను తీసివేయాలి.
  • Gross Value Added = Gross Value of Output - Intermediate Consumption
  • Net Value Added (NVA) = Gross Value Added (GVA) - Depreciation
  • NVAFC = NVAFC- Net Indirect Taxes
  • NVAFC గగన ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి అందరు. దీనికి NFIA చేరిస్తే NNPFC వచ్చును, ఇదే జాతీయాదాయం

ఉత్పత్తి మదింపు పద్ధతిలో తీసుకోవలసిన జాగ్రత్తలు (Precautions)

1. ఒకే వస్తువు రెండుసార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలి. ఇందుకుగాను

    ఎ) అంతిమ వస్తువులనే లెక్కలోకి తీసుకోవాలి. (లేదా)

    బి) విలువ చేర్చిన పద్ధతినైనా వాడాలి.

2. ధరల పెరుగదల ప్రభావం లేకుండా చూడాలి. దీనికై రెండు మార్గాలున్నాయి.

    ఎ) స్థిర ధరలలో జాతీయోత్పత్తిని గణించాలి (లేదా)

    బి) ప్రస్తుత ధరలలో గణించినప్పటికీ, డిప్లేటర్‌ సహాయంతో వాస్తవ ఆదాయంలోకి మార్చాలి. .

3. స్వయం వినియోగం (Self Consumption) మార్కెట్‌ దరలలోకి రాదు కాబట్టి చేర్చాలి.

    ఉదా: రైతు సొంతానికి వాడుకున్న ఆహార.-ధాన్యాలు

4 సొంతంగా యజమాని ఉంటున్న ఇంటి సేవలు చేర్చాలి.

    ఉదా: Imputed Rent, Imputed Interest

5. గృహిణి సేవలు (Services of House Wives) ద్రవ్య రూపంలో అంచనా వేయలేం. కాబట్టి జాతీయాదాయ పన్ను నుంచి మినహాయించాలి.

    ఉదా: వంట చేయుట, పిల్లల సంరక్షణ

6. Second - Hand Goods (or) Existing Commodities క్రయ, విక్రయాలు చేర్చరాదు.

    ఉదా: పాతకారు, పాత ఇల్లు, పాత పెయింటింగ్‌ల అమ్మకం చేర్చరాదు.

నోట్‌: అయితే పాత వస్తువులు అమ్మేటప్పుడు బ్రోకర్‌ (Broker) కమిషన్‌ చేర్చాలి (అతని సేవలు ప్రస్తుత సంవత్సరానికి చెందినవి కాబట్టి)

7. Bonds and Shares అమ్మకాలు జాతీయాదాయం నుంచి మినహాయించాలి. (దీని వల్ల ఆస్తులు బదిలీ అవుతాయి కానీ, నూతనంగా ఏవీ సృష్టించబడవు) అయితే Shares, Bonds అమ్మేటప్పుడు బ్రోకర్‌ సేవలు లెక్కించాలి.

8. మధ్యంతర వస్తువులను జాతీయాదాయంలో చేర్చరాదు.

నోట్‌: ఇన్వెంటరీలలో పెరుగుదల జాతీయాదాయంలో చేర్చాలి. తరుగుదలను తీసివేయాలి.

2. ఆదాయ మదింపు పద్దతి (Income Method)

  • దీనిని Factor payment method, Distributed shared method, Income paid method, Income received method అని పిలుస్తారు.
  • ఉత్పత్తి కారకాలు (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన) తమ సేవలు అందించుట ద్వారా ప్రతిఫలాలు (బాటకం, వేతనం, వడ్డీ లాభాలు) పొందుతాయి. ఈ ప్రతిఫలాలను కలిపితే జాతీయాదాయం వస్తుంది.
  • ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తి జరుగుతుంది. ఆ ఉత్పత్తి విలువ ఉత్పత్తి కారకాలకు చేరుతుంది. ఆ కారక ప్రతి ఫలాలన్నీ కలిపితే జాతీయాదాయం వచ్చును. జాతీయాదాయం = బాటకం + వేతనం + వడ్డీ + లాభాలు + మిశ్రమ ఆదాయం.
  • ఉత్పత్తి కారకాలను వచ్చే ఆదాయం రెండు రకాలుగా విభజింవచ్చు.
  • ఎ) దేశీయ కారక ఆదాయం (Domestic Factor Income)
  • బి) నికర విదేశీకారక ఆదాయం (Net Factor Income from Abroad)

ఎ) దేశీయ కారక ఆదాయం

దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.

  1. శ్రమను అందిస్తే వచ్చే ఆదాయం (Labour Income/Compensation of Employees)
  2. మూలధనం / ఆస్తుల నుంచి ఆదాయం (Property Income/Operating Surplus)
  3. మిశ్రమ ఆదాయం (Mixed Income) ఒకే వ్యక్తిపై రెండింటిని అందిస్తే వచ్చే ఆదాయం.

1) శ్రమను అందిస్తే వచ్చే ఆదాయం (Labour Income/Compensation of Employees)

  • శ్రామికులు, ఉద్యోగస్థులు తమ శ్రమను అందించుట ద్వారా పొందే పరిహారం (ప్రతిఫలాలు) మూడు విధాలుగా ఉండును
  • ఎ) ద్రవ్య రూపంలోగల వేతనాలు, జీతాలు .
    • ఉదా: జీతం, డి.ఎ., హెచ్‌ఆర్‌ఎ., ఓ.టి.ఎ., బోనస్‌, కమిషనర్‌, LTC (Leave Travel Concession) etc.
  • బి) వస్తు రూపంలో అందించే పరిహారం (Compensation in kind)
    • ఉదా: ఉచిత గృహం, వైద్యం, ఉచిత యూనిఫాం, ఆహారం, ఉచిత 'విద్య, రవాణా, వడ్డీ లేకుండా రుణ సదుపాయం, Creches for children of employees etc.
  • సి) యాజమాన్యం ఉద్యోగులకిచ్చే సాంఘిక భద్రతా చెల్లింపులు (Employers contribution to social security schemes)
    • ఉదా: పి.ఎఫ్‌, జీవిత బీమా, రిటైర్‌మెంట్‌ పెన్షన్‌కి అందించే వాటా, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, గ్రాడ్యూటీ మొదలైనవి  

2. మూలధనం / ఆస్తుల నుంచి ఆదాయం (Property Income/Operating surplus)

  • మూల ధనాన్ని యాజమాన్యాన్ని కల్గి ఉండుట వల్ల వచ్చే ఆదాయం, అంటే ఆస్తులు, వ్యవస్థాపన నుంచి వచ్చే ఆదాయం (Income from property and entrepreneurship)
  • ఎ) భూములు, భవనాలు కల్గి ఉండుట వల్ల బాటకం వచ్చును. Rent of self-occupied house (Imputed Rent) కూడా బాటకంలో భాగమే.
  • రుణాలపై, డిపాజిట్‌లపై వచ్చే వడ్డీ
  • గనులు లీజుకిచ్చినప్పుడు వచ్చే రాయల్టీ, పేటెంట్‌ హక్కులు, కాఫీ రైట్స్‌పై వచ్చే రాయల్టీలు దీనిలో భాగం. 
  • Rent, Interest, Royalties అనేవి Income from property గా చెప్పవచ్చు
  • బి) కంపెనీ వాటాదారులకు పంచె డివిడెండ్‌లు
  • పెద్ద కంపెనీలు తమ మొత్తం ఆదాయాన్ని షేర్‌ హోల్టర్స్‌కి డివిడెండ్‌ల రూపంలో పంచి పెట్టవు. కొంత ఆదాయాన్ని పంచిపెట్టకుండా ఉంచుతాయి. దీనిని పంచిపెట్టబడని లాభాలు (Undistributed Profits) అందురు.

3. మిశ్రమ ఆదాయం (Mixed Income)

  • ఉత్పత్తి ప్రక్రియలో ఒకే వ్యక్తి శ్రమను, మూలధనాన్ని అందిస్తే వచ్చే ఆదాయం మిశ్రమ ఆదాయం. అంటే కొంత Labour income కాగా, కొంత property of entrepreneurship నుంచి వచ్చే ఆదాయమగును.
  • ఉదా: సొంత వ్యాపారం, Carpenters ఆదాయం, సొంత క్లినిక్‌ వద్ద డాక్టర్‌ అందించే సేవలు, తన పొలంలో పనిచేసే రైతు 

నికర విదేశీ కారక ఆదాయం (NFIA)

  • నికర విదేశీ కారక ఆదాయం (NFIA) = కారకాలను అందించినందుకు విదేశాల నుండి పొందిన ఆదాయం (R)  - దేశ భూభాగంలో విదేశస్థులు అందించిన కారకసేవలకు చెల్లించే చెల్లింపులు (P)
  • NDPFC = ఉద్యోగుల పరిహారం + Operating Surplus + మిశ్రమ ఆదాయం.
  • NNPFC = NDPFC + NFIA దీనినే జాతీయాదామందురు.
  • జాతీయాదాయం = (COE + OS + Mixed Income) + NFIA = దేశీయ కారక ఆదాయం + విదేశీ నికర కారక ఆదాయం.

ఆదాయ మదింపు పద్ధతి - తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  1. స్వయం, వినియోగ విలువ (Self - consumption), Imputed Rent of the Self - Occupied houses కలపాలి. 
  2. బదిలీ చెల్లింపులు చేర్చరాదు. ఉదా. నిరుద్యోగ భృతి, స్కాలర్ షిప్స్, Old age pensions etc. అవి ప్రస్తుత ఉత్పత్తికి ఎలాంటి తోడ్పాటును అందించవు. 
  3. చట్టవ్యతిరేక ద్రవ్యం చేర్చరాదు. ఉదా: స్మగ్లర్స్‌ ఆదాయం, Illegal drug traders, (ఇవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే వచ్చినవి మరియు గణింపలేనివి)
  4. జాతీయ రుణంపై వడ్డీ చేర్చరాదు. ప్రస్తుతం సాధారణంగా వినియోగ అవసరాలకే రుణం తీసుకుంటుంది అనే ప్రమేయం వల్ల రుణంపై వడ్డీ చేర్చరు (ఇది అనుత్పాదక ఉద్దేశ్యంతో తీసుకోబడింది కాబట్టి) 
  5. Second hand goods, bonds, shares అమ్మితే వచ్చే ఆదాయం చేర్చరాదు. అయితే వీటి అమ్మకాలలో బ్రోకర్‌ కమిషనర్‌ లెక్కించాలి.
  6. పైవేటు బదిలీ చెల్లింపులు చేర్చరాదు. ఉదా: తల్లిదండ్రులు పిల్లలకిచ్చే pocket money పిల్లలు వృద్ధుల కిచ్చే ద్రవ్యం మొ: (దీనిలో ఒకరినుంచి మరొకరికి కేవలం ద్రవ్యం మాత్రమే బదిలీ అగుచున్నది)
  7. గాలివాటు లాభాలు (windfall gains) జాతీయాదాయ గణనలో చేర్చరాదు. ఉదా: లాటరీల ద్వారా, prizes ద్వారా వచ్చే ఆదాయం (ఇవి కూడా ప్రస్తుత ఉత్పత్తికి ఎలాంటి తోడ్పాటును అందించవు)
  8. కార్పొరేషన్‌ పన్ను తీయకపూర్వం ఉన్న లాభాలను జాతీయ గణనలో తీసుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా కొర్పరేషన్‌ పన్నును తీసుకోనవసరం లేదు.

 3. వ్యయ ముదింపు పద్దతి (Expenditure Method)

దీనిని Income disposal method, Consumption and investment method అందురు. 

ఆర్థిక వ్యవస్థలో జరిగే అంతమ వ్యయం, లెక్కించుట ద్వారా జీడీపీని పొందవచ్చు. అంతిమ వస్తువులపై చేసే అంతిమ వ్యయం ద్వారా దీనిని గణిస్తారు. అంతిమ వస్తువులు అనేవి వినియోగానికి గాని, పెట్టుబడికి కాని కావచ్చు. అంటే అంతిమ వినియోగ వ్యయం, అంతిమ పెట్టుబడి వ్యయం కలుపుట ద్వారా దీనిని పొందవచ్చు. అందుచే దీనిని Consumption and investment method అందురు.

ఒక దేశ భూభాగంలో అంతిమ వ్యయం చేసే రంగాలు నాలుగుంటాయి.

  1. గృహ రంగం (Household sector)
  2. సంస్థల / వ్యాపార రంగం (Business/Producing Sector)
  3. ప్రభుత్వ రంగం (Government Sector)
  4. ఇతర ప్రపంచ రంగం

  • అంతిమ వస్తు సేవలపై ఈ నాలుగు రంగాలు చేసే వ్యయం ఈ విధంగా ఉంటుంది.
  • ఎ) వినియోగ వ్యయం (Consumption Expenditure) C
  • బి) పెట్టుబడి వ్యయం (Investment Expenditure) I
  • సి) ప్రభుత్వ వ్యయం (Government Expenditure) G
  • డి) నికర ఎగుమతులు (Exports - Imports) X-M

ఎ) ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం (C)

  • వినియోగ వస్తువులు, సేవలపై గృహ రంగం, లాభ ఉద్దేశంలేని స్వచ్చంధ సంస్థలు చేసే వ్యయం దీనిలో భాగాలు.
  • మన్నిక లేని (non durable goods) ఆహారం, పానీయాలు, సబ్బులు, టూత్‌పేస్ట్‌లపై చేసే వ్యయం.
  • మన్నిక గల (durable goods) TV, ఫర్నిచర్‌, కార్లు, బైక్‌లు, ఎసీలు మొదలైన. వాటిపై వ్యయం.
  • రవాణా సేవలు, వైద్య సేవలు లాంటి సేవలపై వ్యయం.
  • వీటిపై చేసే వ్యయాన్ని మార్కెట్‌లోని రిటైల్‌ ధరలు (Retail prices) ఆధారంగా గణిస్తారు.

నోట్‌: నూతన ఇల్లు కొనుగోలు వినియోగ వ్యయం కాదు. అది పెట్టుబడి వ్యయం క్రిందికి వస్తుంది.

  1. ప్రస్తుత ఉత్పత్తిపై వ్యయమే తీసుకోవాలి. పాతకార్హు, పాత వస్తువులపై వ్యయం తీసుకోరాదు.
  2. ఉత్పత్తిదారు తనకై ఉంచిన Self-consumption కూడా వినియోగ వ్యయంలో భాగమే.
  3. Imputed rent on self-occupied houses కూడా, వినియోగ వ్యయంలో భాగమే.

బి) పెట్టుబడి వ్యయం (I)

  • భౌతిక మూలధన వస్తువుల పెరుగుదలే పెట్టుబడి. ఉదా: యంత్రాలు, ఫ్యాక్టరీలు రెసిడెన్షియల్‌ ఇండ్లు, సంస్థ ఇన్వెంటరీల పెరుగుదల.
  • పెట్టుబడి వ్యయాన్నే Gross Domestic Capital Formation (GDCF) అందరు. దీనిలో మూడు భాగాలు గలవు.
  • 1). స్థిర పెట్టుబడి / స్థూల స్థిర మూలధన కల్పన: నూతన ప్లాంట్‌, యంత్రాలు, ఎక్యూప్‌మెంట్‌, ఫ్యాక్టరీలు, రవాణా ఎక్యూప్‌మెంట్‌, “నిర్మాణపనులు (డ్యాంలు, టెలిఫోన్‌ లైన్స్‌) మొదలైన వానిపై చేసే వ్యయం
  • 2) రెసిడెన్సియల్‌ హౌస్‌పై చేసే వ్యయం: నూతన ఇండ్ల నిర్మాణంపై వ్యయం (ఇనుము, సిమెంట్‌, ఫుడ్‌, ఇటుకలు, శ్రమ మొదలైన వానిపై బిల్డర్‌ చేసే వ్యయం). దీనిని commodity flow approach అందురు. Major repairs, Renovations దీనిలో భాగమే. ఇండ్ల నిర్మాణమనేది పెట్టుబడిలో భాగం.
  • నోట్‌: Capital goods లో పెట్టుబడికి, ఇండ్ల నిర్మాణంలో పెట్టుబడికి కొద్దిగా తేడా ఉంది. ఇండ్లు అనేవి గృహరంగంచే కొనుగోలు చేయబడగా, మూలధన వస్తువులు సంస్థలచే కొనుగోలు చేయబడును.
  • 3) నిల్వలలో మార్పు (ఇన్వెంటరీలు):. ముడి సరుకు, సగం తయారైన వస్తువులు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న అంతిమ వస్తువులు (Final goods awaiting sale) మొదలైనవి ఇన్వెంటరీలు. ఈ ఇన్వెంటరీలలో వచ్చే మార్చుని పెట్టుబడి వ్యయంగా తీసుకుంటారు.
  • Change in stock = closing - opening stock
  • స్థిర పెట్టుబడి + రెసిడెన్షియల్‌ ఇండ్ల నిర్మాణం + ఇన్వెంటరీలలో మార్పుపై చేసే వ్యయాన్ని స్థూల పెట్టుబడిగా చెప్పవచ్చు. వీనిలో కొంతభాగం అరుగు, తరుగుదలకు గురి అయిన వాటి స్థానంలో పెట్టుబడి కాబడవచ్చు. ఈ Replacement amount ని తరుగుదల (Depreciation) అందురు. కాబట్టి స్థూల పెట్టుబడి నుంచి ఈ తరుగుదలను తీసివేస్తే నికర పెట్టుబడి వచ్చును.
  • Non domestic investment = Gross fixed business investment + inventory investment + gross residential investment - depreciation

సి) ప్రభుత్వ వ్యయం (G)

  • దీనిని ప్రభుత్వ వినియోగ వ్యయమందురు.
  • ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం = ఉద్యోగుల పరిహారం + దేశీయ మార్కెట్‌లో వస్తు సేవల నికర కొనుగోళ్లు + విదేశాల నుంచి .వస్తు సేవల నికర కొనుగోళ్లు.
  • నికర అనగా కొనుగోళ్లు విలువ, అమ్మకాల విలువ మధ్య గల తేడా.

డి) నికర ఎగుమతులు (X-M)

  • వస్తు సేవల ఎగుమతుల విలువ నుంచి దిగుమతుల విలువ తీసివేస్తే, నికర ఎగుమతులు వచ్చెను. ఇది ధనాత్మకంగా గాని రుణాత్మకంగాగాని ఉండవచ్చు. Net exports (X-M)
  • నికర ఎగుమతులు అనేవి దేశీయ ఉత్పత్తి (Domestic product) భాగం
  • Open economy లో ఒక దేశం ఇతర దేశాలతో అంతర్జాతీయ వ్యాపారం చేసి ఒక దేశం ఇతర దేశాలకు వస్తువులు, సేవలు (షిప్పింగ్‌, బీమా, బాంకింగ్‌, రవాణా, పర్యాటక సేవలు) ఎగుమతి చేయవచ్చు. అట్లాగే విదేశస్థులు ఆ దేశానికొస్తే ఆహారం handicrafts లాంటి వస్తువులను కొనవచ్చు. అదే విధంగా విదేశాల నుంచి వస్తువులు, సేలు దిగుమతి చేసుకోవచ్చు.
  • వ్యయ మదింపు పద్ధతిలో ఎగుమతులును, దిగుమతులను దేశీయ వ్యయంలో ఎందుకు తీసుకోవాలి?
  • ఎగుమతులపై విదేశస్తులు వ్యయం చేసినప్పటికీ, ఆ వస్తువులు దేశీయ భూభాగంలో ఉత్పత్తికాబడనివి. కాబట్టి అవి దేశీయ ఉత్పత్తిలో భాగం.
  • దిగుమతులు అనేవి విదేశాలలో ఉత్పత్తి కాబడినప్పటికీ, వానిపై వ్యయం అనేవి దేశీయ వినియోగపెట్టుబడి వ్యయలో భాగం.
  • అయితే ఒక దేశ భూభాగంలో ఉత్పత్తి ఎంత అయినదీ తెలుసుకోవాలంటే దిగుమతులు తీసివేయాలి.
  • నికర ఉత్పత్తి పెట్టుబడి = నికర ఎగుమతులు + NFIA
  • ఆర్థిక వ్యవస్థలో జరిగే వినియోగ, పెట్టుబడి, ప్రభుత్వ నికర ఎగుమతులు కలిపితే GDPవచ్చును.
  • GD{P_{MP}}{\rm{  =  C + I + G + (X - M)}}
  • నోట్‌: పెట్టుబడిని తీసుకొనేటప్పుడు నికర పెట్టుబడి తీసుకుంటే GDP కి బదులు NDP వచ్చును.  GD{P_{MP}}  కి NFIA చేరిస్తే  GD{P_{MP}} వచ్చును. దీని నుంచి తరుగుదల తీసివేస్తే  GN{P_{MP}}  వచ్చును. దీని నుంచి నికర పరోక్ష పన్నులు తీసివేస్తే NN{P_{FC}} వచ్చును. ఇదే జాతీయాదాయం.
  • జాతీయాదాయం NI = C + I + (X - M) + NFIA - D - Net{\rm{ }}IT

దీనిని ఈ విధంగా చూపవచ్చు.

C + I + G + \left( {X - M} \right)

\downarrow

GD{P_{MP}}

\downarrow

\left(  +  \right){\rm{ }}NFA

\downarrow

GD{P_{MP}}

\downarrow

\left(  -  \right){\rm{ }}Depreciation

\downarrow

NN{P_{MP}}

\downarrow

\left(  -  \right){\rm{ }}Net{\rm{ }}\left( T \right)

\downarrow

NN{P_{FC}}/National{\rm{ }}Income

నోట్: GDP లో నికర ఎగుమతులు (X-M) అనేవి భాగం. GDP కి NFIA (R-P) చేరిస్తే GNP వచ్చును 

వ్యయ మదింపు పద్ధతి లో తీసుకోవలసిన జాగ్రత్తలు  

  • అంతిమ వస్తువులన్నింటిని తీసుకోవాలి. (మార్కెట్ లో వీటిపై వ్యయం జరిగినా, జరగకపోయినా)
  • ఉదా: Self - Consumptions, Imputed Values
  • మధ్యంతర వస్తువులపై వ్యయం లెక్కించరాదు. (ఇది అంతిమ వ్యయంలో భాగం కాబట్టి)
  • Second hand goods పై చేసే వ్యయం లెక్కించరాదు. (ఇవి గత సంవత్సర ఉత్పత్తిలోకి వస్తాయి)
  • షేర్లు, బాండ్లు (Financial assets) పై చేసే వ్యయం లెక్కించరాదు. (దీనిలో యాజమాన్యం మాత్రమే బదిలీ అగును. ఎలాంటి నూతన ఆస్తులు ఉత్పత్తికావు)
  • బదిలీ చెల్లింపులపై చేసే వ్యయం లెక్కించరాదు. ఉదా: పింఛన్లు, నిరుద్యోగ భృతి.
  • భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యయానికి సంబంధించి సరియైన సమాచారం లేకపోవడం ఈ పద్ధతిని అవలంభించలేదు.
  • ఆర్థిక వ్యవస్థలో (పైవేటు, ప్రభుత్వ వ్యయాల వాటాలు తెలుసుకొనేందుకు, వినియోగం, పెట్టుబడులు తెలుసుకునేందుకు వ్యయ మదింపు పద్ధతి అవలంభిస్తారు.
Keywords: Tspsc economy notes in telugu,tspsc indian economy notes in telugu,group 2 economy notes in telugu,tspsc economy study material in telugu,economy notes,tspsc indian economy notes in telugu,group 2 indian economy notes in telugu,tspsc indian economy study material in telugu,group 2 indian economy study material in telugu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)