హైదరాబాద్‌లో మొదటి యునానీ ఆస్పత్రి ఏ నిజాం రాజు కాలంలో ఏర్పడింది?

Adhvith
0

TSPSC Group 1, 2, 3, 4 practice questions in telugu, TSPSC Practice Questions in Telugu, TS Police Practice Questions

1. దేవదాసి విధానాన్ని నిర్మూలించేందుకు కృషి చేయాలని ఏ ఆంధ్రమహాసభలో తీర్మానించారు?

-ఖమ్మంలో 1935లో జరిగిన 3వ మహాసభ 

2. నిజాం ప్రభుత్వంలోని హైదరాబాద్‌  హైకోర్టులో మొదటి హిందూ న్యాయమూర్తి ఎవరు?

-కేశవరావు కోరాట్కార్ 

3. ఏ సంవత్సరంలో సరోజినీ నాయుడు బ్రిటీష్‌ ప్రభుత్వం ఇచ్చిన కైజర్‌-ఇ-హిండ్‌ గోల్ట్‌మెడల్‌ను వెనక్కి ఇచ్చారు?

- 1919

4. 1933 లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విశ్వ భారతికి హైదరాబాద్‌ 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఎంత విరాళం ఇచ్చాడు?

- రూ.1లక్ష

5. హైదరాబాద్‌లో తొలిసారి యునానీ ఆస్పత్రి ఏ నిజాం రాజు కాలంలో ఏర్పడింది? (The first Unani Hospital in Hyderabad was established during the reign of which Nizam?)

- 7వ నిజాం, మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌

6. నిజాం రాజ్యంలో హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ పాఠశాల స్థాపన జరిగింది. ఈ ప్రథమ పాఠశాలను స్థాపించిందెవరు? (A private school was established in Hyderabad during the rule of the Nizam. Who founded this first school?)

-1904లో మహారాష్ట్రీయుడైన రంగారావు కాళోజీ రెసిడెన్సీ బజార్‌లో నెలకొల్పాడు

7. నిజాం ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి గ్రంథాలయోద్యమానికి అంకితం అయింది ఎవరు? (Who quit his government job in the Nizam's government and devoted himself to the book movement?)

- మాడపాటి హనుమంతరావు

8. 1895లో బాలగంగాధర్‌ తిలక్‌ను ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాన్ని బహిరంగంగా నిర్వహించింది ఎవరు? 

- అర్య సమాజీకులు

9. 16వ దశాబ్దంలో హైదరాబాద్‌ నగరాన్ని నిర్మించిన రాజులు ఎవరు? ఏ సంవత్సరంలో నిర్మించారు? (Which king built the city of Hyderabad in the 16th century? In what year was it built?)

- కుతుబ్‌షాహీలు 1591-1592 లో నిర్మించారు.

10. 6వ నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, అధిక పలుకుబడి కలిగిన 'అర్మినియా' దేశ యూదుడెవరు? 

- అబిద్‌ ఇవాన్స్‌ విదర్‌, హైదరాబాద్‌ రచయిత

11. క్రీ.శ.1687లో నల్లగొండ ముట్టడిలో ఔరంగజేబు సైన్యానికి అధ్యక్షత వహించిన ఘియాజుద్దీన్ ఫీరోజ్‌జంగ్‌ కుమారుడెవరు?

- మీర్‌ ఖమ్రద్దీన్‌ చిన్‌ ఖిలిచ్‌ఖాన్‌-1వ నిజాం

12. ఒద్దిరాజు సీతారామచంద్రరావు “రుద్రమదేవి నవల ఏ సంవత్సరంలో ఎక్కడ ముద్రించారు?

- బెజవాడ 'మారుతీ' ప్రెస్‌, 1918

13. సంస్థానంపై పోలీస్‌ చర్య జరగక ముందు నిజాం రాజుకు ఆస్టేలియా నుంచి చిన్న ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తి ఎవరు?

- సిడ్నీకాటన్‌

14. కేంబ్రిడ్డి విద్యార్థి 'రహమత్‌ అలీ' హైదరాబాద్  నిజాం రాజ్యానికి ఏ పేరు పెట్టాలని సూచించాడు? 

- ఉస్మానిస్థాన్‌

15. క్రీ.శ.1687లో తానీషా కూచిపూడి నృత్య కళాకారులకు కూచిపూడి గ్రామాన్ని దానమిచ్చినట్లు తెలిపే చారిత్రక ఆధారం ఏది? 

- మాచుపల్లి కైఫీయత్‌'

16. నిజాం రాజ్యంలో నిజాం వ్యవహార భాష ఉర్దూ కాగా పరిపాలనా భాష ఏది? (Which was the official language of Nizam's State)

- పర్షియన్‌

17. అచల సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన రామడుగు శివ రామదీక్షితులు 'బృహద్వాశిష్టం' గ్రంథాన్ని ఏ సంవవత్సరంలో రాశారు?

-క్రీ.శ.1712లో

18. 1985లో వచ్చిన జీవో 610 ప్రకారం స్థానికేతరులు ఏ తేదీలోగా వెనక్కి వెళ్ళాలి?

- 1988 మార్చి31లోగా

19. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో 'ధూమ్‌ధామ్‌' అనే సాంస్కృతిక కార్యక్రమ రూపకర్త ఎవరు? 

- రసమయి బాలకిషన్‌

20. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అన్నపూర్ణ సినీ స్టూడియో కోసం 22 ఎకరాలు కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరు? 

- జలగం వెంగళరావు

21. తెలంగాణ ఉద్యమ కాలంలో శ్రీకృష్ణ కమిటీ ఏ సంవత్సరంలో మొదటిసారిగా తెలంగాణలో పర్యటించింది? (In which year did the Srikrishna Committee visit Telangana for the first time during the Telangana movement?)

-2010 ఫిబ్రవరి 12న

22. హైదరాబాద్‌లో రాజ్యాంగ సంస్కరణలు అనే పుస్తక రచయిత ఎవరు?

- కోదాటి నారాయణ రావు

23. వరంగల్‌ దగ్గర కొండపర్తిలోని చౌడేశ్వరాలయం నిర్మించింది ఎవరు?

- క్రీశ. 1208లో గణపతిదేవుని సేనాని మాల్యాల. (దౌండ సేనాని వేయించిన కొండపర్తి శాసనం ఆధారం ఇది తెలుస్తుంది)

24. వీర శైవ మత ప్రచారకుడైన బసవేశ్వరుని వివాహ ఘట్టంలో “కోలాటం' నృత్య ప్రదర్శన కూడా చేసినట్టు రాసిన కవి ఎవరు? ఏ గ్రంథంలో?

- పాల్కురికి సోమనాథుడు-“బసవపురాణం”

25. కాకతీయుల కాలంలో గొప్ప విప్లవ కవి, వీర శైవ మత ప్రచారకుడెవరు?

-పాల్కురికి సోమనాథుడు

26. కాకతీయ 'మైలాంబ' నర్తకీ మణులకు గృహ దానాలు చేసినట్లుగా ఉన్న ఆధారం ఏది?

- పానగల్లు శాసనం 

27. కూలీ కుతుబ్ షా భగ్యనగర్ పేరును హైదరాబాద్ గా ఎవరి జ్ఞాపకార్థం మార్చాడు?

- ఇస్లాం నాల్లో ఖలీఫా హజ్రత్ అలీహైదర్‌

28. తెలుగు, సాహిత్యంలో భక్తి భావనను సాంప్రదాయంలోకి తీసుకొచ్చిన తొలికవి ఎవరు? 

- మల్లికార్జున పండితారాధ్యుడు

29. హైదరాబాద్‌ నిజాం కళాశాల ప్రథమ ప్రిన్సిపల్‌గా పనిచేసింది ఎవరు?

- అఘోరనాథ చటోపాధ్యాయ

30. జీవన చిత్రాలు మనుషులు మారినవేళ అనే నవలను రాసిన తెలంగాణ అడబిడ్డ ఎవరు? 

- కె. సూర్యముఖి (మహీధర సోదరి, వీరిది బాలసముద్రం)

31. మహాకవి క్షేతయ్య ఏ కుతుబ్‌షాహి వంశ రాజ దర్భార్‌ను దర్శించాడు

- అబ్బుల్లా కుతుబ్‌షా దర్బార్‌

32. క్రీ.శ 1832లో హైదరాబాద్‌ సంస్థాన దివాన్‌ చందూలాల్‌కు తాను రామదాసు, వారసుడినని విన్నపం చేసుకున్నది ఎవరు?

- వరదరామదాసు

33. తెలంగాణ పాత తరం నటుడు డాక్టర్‌ ఎం. ప్రభాకర్‌ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన సినిమా ఏది?

- చివరకు మిగిలేది

34. నిజాం రాజు హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ను నిషేధించిన వెంటనే స్వామి రామానంద తీర్ధను ఎక్కడ అరెస్టు చేశారు?

- 1938 సెప్టెంబర్‌ 9న సుల్తాన్‌ బజార్‌ క్లాక్‌ టవర్‌ దగ్గర

35. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు, మహాతాత్వికుడు ఖలీల్‌ జిబ్రాన్‌ రచించిన ది ప్రొఫెట్‌ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన తెలంగాణీయుడెవరు?

-శ్రీ కాళోజి నారాయణరావు జీవనగీత

36. భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్‌లో వందేమాతరం గీతాన్ని ఏ రోజున నిజాం ప్రభుత్వం రద్దు చేసింది?

-1938 నవంబర్‌ 28న

37. చిత్రకళకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన తెలంగాణకు చెందిన కొండపల్లి శేషగిరిరావు ఎక్కడ జన్మించారు?

-1924, మరిపెడ గ్రామం

38. కరీంనగర్‌ జిల్లాలోని కోరుట్ల వద్ద ఉన్న బాదన్‌కుర్తికి ఆ పేరెలా వచ్చింది?

- బారి అనే బుద్ధుని శిష్యుని పేరుతో (ఆధారం బుద్ధఘోషుడు రాసిన “పరమార్థ జ్యోతిక")

39. చరిత్ర కారుడు వి.వి. కృష్ణ శాస్త్రి ప్రకారం అచార్య “ద్విజ్నాగూ'ని సాంతగ్రామం తెలంగాణలో ఎక్కడ కలదు?

- కోటిలింగాల ప్రక్కన 'పాశాయిగాం

40. తెలంగాణలోని కోటిలింగాలలో ప్రథమ రాజ్యం శాతవాహన రాజ్యం. ప్రథమరాజు శ్రీముఖుడు కాగా అంతకుముందే పరిపాలించినట్టు వారి నాణేలు లభించాయి. వారి పేర్లేమిటి?

- సామగోపుడు, గోబద్రుడు.

41. కన్నడ కవిత్రయంలో ఒకరు పంపకవి తెలంగాణీయుడు. ఇతని గురువు పేరేమిటి?

- దేవేంద్రముని

42. కౌసలీయ చరిత్ర అనే ఐదు అశ్వాసాలు(చాష్టర్స్) మహాకావ్యాన్ని రచించిన “లయ, 'గ్రాహి గరుడాచల' కవి ఏ సంస్థానంలో పని చేశాడు 

- బోరవెల్లి సంస్థానం (గద్వాల సోమ భూపాలునికి సమకాలికుడు)

43. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన అనేక సంస్థల్లో తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్‌ ఎవరు?

- ప్రొఫెసర్‌ టి. వివేక్‌

44. “దేశోద్ధారక” కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు స్మారక చిహ్నంగా వట్టికోటఆళ్వారు స్వామీ స్థాపించినది?

- 1938లో దేశోద్ధారక గ్రంధమాల

45.నేటి సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గర కందిబండలో గ్రంథలయాన్ని నిర్వహించినదెవరు?

-1930లో వట్టికోట ఆళ్వారుస్వామి.

46. ఆసియాలోనే అతిపెద్ద జాతర సమ్మక్క- సారక్క జాతరలో ఎదురుకోళ్ళు ఉంటుంది. ఎదురుకోళ్లు అంటే?

- కోళ్లను గాలిలోకి ఎగురవేయడం

47. తెలంగాణలో ఏ రచయితకు అభినవ వ్యాసుడు అనే బిరుదు కలదు?

- దాశరథి

48. నిజాం రాజుల కాలంలో దివాన్‌గా పనిచేసిన 1వ సాలార్‌జంగ్‌ క్రీ.శ. 1864లో 'జిల్లాబందీ' విధానం ప్రవేశ పెట్టాడు జిల్లాబందీ అంటే ఏమిటి?

- రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించడం

49. తెలంగాణలోనీ బంజారాలు శ్రీశ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని ఏ రోజున జరుపుకొంటారు? 

- ఫిబ్రవరి 15న

50. 2010 ఫిబ్రవరి 22న ఢిల్లీలోని 'జంతర్‌ మంతర్‌' దగ్గర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం ధర్నా నిర్వహించింది ఎవరు?

- తెలంగాణ న్యాయవాదులు 

51. సిపాయిల తిరుగుబాటు కాలంలో రెసిడెన్సీపై దాడి చేసిన తుగ్రేబాజ్‌ఖాన్‌ 1859లో మెదక్‌ జిల్లా తుప్రాన్‌ గ్రామంలో పట్టుబడటానికి కారణమైన వ్యక్తి ఎవరు?

- కుర్బాన్ అలీ

52. సింహాసన ద్వాత్రింశిక రాసిన కొరివి గోపరాజు తెలంగాణలో ఏ ప్రాంతం వాడు?

- నిజామాబాద్‌ జిల్లా (వేముగల్లు) భీమగల్లు

53. తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1969లో తెలంగాణ మహిళా దినం ఏ రోజున జరుపుకుంటారు? 

- జూన్‌ 17న

54. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని రాయి, కట్టె ఏయే దేశాల నుంచి తెప్పించి కట్టించారు?

- ఇటలీ నుంచి చలువరాయి ఇంగ్లండ్‌ నుండి కట్టె (దీనిలో ప్రపంచంలో పెద్దదైన డైనింగ్‌ టేబుల్‌ కలదు)

55.తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచడానికి నిజాం వేసిన కమిషన్‌ అధ్యక్షుడెవరు?

- మీర్జా అలీ హైదర్‌.

56. తెలంగాణలో గరగ నృత్యాన్ని ఏ సందర్భంలో చేస్తారు? (In which context is the Garaga dance performed in Telangana?)

- బోనాల పండుగ సందర్భంలో

57. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్‌ 16న బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బతుకమ్మ పండుగ, పాటలపై పరిశోధన చేసిన వారు ఎవరు? 

- బండారు సుజాతా శేఖర్‌

58. ఎనిమిదో (అష్టమ) నిజామాంద్ర మహాసభ 1941లో చిలుకూరులో జరిగింది. దాని ఆహ్వాన సంఘ అధ్యక్షులు ఎవరు?

-వెబరె గోపాలరెడ్డి

59. ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని 1969లో సుప్రీం కోర్టులో తీర్పునిచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? (Which Chief Justice of India ruled in 1969 that the Mulkey Act was unconstitutional?)

-జస్టీస్‌ మహమ్మద్‌ హిదయకుల్లా

60. రాయల్‌ ఫొటోగ్రఫిక్‌ సొసైటీ ఆఫ్‌ బ్రిటన్‌ నుండి ఫెలోషిప్‌ పొందిన మొదటి తెలుగువాడు మన తెలంగాణీయుడే, ఎవరతను? 

- అల్లాడి రాజన్‌ బాబు, జగిత్యాల జిల్లా కోరుట్ల

61. తెలంగాణలో పుల్లూరు జాతర ఎక్కడ జరుగుతుంది? ఈ ఆలయ నిర్మాత లెవరు?

- సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు గ్రామంలో, ఇది కాకతీయుల కాలంలో నిర్మించారు.

62. కోయ భాషకు లిపిని కనుగొన్న తెలంగాణ రచయిత ఎవరు?

-వానమామలై వరదాచార్యులు

63. తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారతదేశంలో ప్రజల ప్రజాస్వామ్య స్థాపనకు ప్రథమ ప్రయత్నంగా పేర్కొన్నది ఎవరు?

-మావో, చైనా

64. హైదరాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ హుడాని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 

- 1975

65. తెలంగాణలో ఏ పట్టణాన్ని దేవాలయాల పట్టణం అంటారు?  (Which town is called as temples town of telangana)

- అలంపూర్‌

66. నల్లగొండ జిల్లాలో గల దేవరకొండ గిరి దుర్గం ఏయె నదుల మధ్య నిర్మాణం జరిగింది? 

- ఉప్పువాగు-స్వర్హముఖి

67. తెలంగాణ గవర్నర్‌ అధికార భవనం హైద్రాబాద్‌లోని రాజ్‌భవన్‌ ఏ సంవత్సరంలో నిర్మించారు. 

- 1936లో

68. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి ఉపముఖ్యమంత్రి కె.వి. రంగారెడ్డి చొరవతో కె. అచ్యుత రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన సంఘం ఏది?

- తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం 1969 ఏప్రిల్‌ 7

69. ప్రత్యేక తెలంగాణ నినాదం మొదటిసారిగా ఇచ్చినది ఎక్కడ, ఎప్పుడు?

- 1968 డిసెంబర్‌ 20న కొత్తగూడెంలో జె. చొక్కరావు ఇచ్చారు

70. తొలి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రజాసమితి విద్యార్థి కార్యచరణ సంఘం, తెలంగాణ మహాసభ, సంయుక్త సోషలిస్టు పక్షాల, రాష్ట్రాల శాఖలు కలిసి ఏ రోజున తెలంగాణ కోర్కెల దినం జరపాలని నిశ్చయించారు?

-మే 1న 1969 తెలంగాణ కోర్కెల దినం 

71. తెలంగాణ మృత వీరుల దినం ఏరోజున జరపాలని ప్రకటించారు. 

-1969 మే 14న

72. “రేలా -ధూల-మేలా' సభ ఎక్కడ, ఎప్పుడు జరిగింది. ఈ సభను ఎవరు ప్రారంభించారు?

- తెలంగాణ మహాసభ కన్వీనర్‌ డా. చెరుకు 'సుధాకర్‌ అధ్యక్షతన కేశవరావ్‌ జాదవ్‌ నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 2001 డిసెంబర్‌ ౩1న జరిగింది.

73. తెలంగాణ సాయుధ పోరాటం గురించి రక్తసారం అనే నవల రాసింది ఎవరు?

- అంపశయ్య నవీన్‌

74. “తెలంగాణాలో అంధ్రోద్యమం' పుస్తక రచయిత ఎవరు? 

-మాడపాటి హన్మంతరావు


    

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)