జాతీయ మానవ హక్కుల కమిషన్
- పార్లమెంట్ 1993లో ఒక చట్టం ద్వారా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 2006లో దీనికి సవరణ చేసారు. దీని ప్రకారం రాష్ట్ర పరిధిలో కూడా మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసే విధంగా సవరణలు చేశారు.
- ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతే తొలగిస్తారు. దీనికి చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అయుండాలి.
- మానవహక్కుల ఉల్లంఘన, ఇతర అంశాలకు సంబంధించి విచారణ జరిపి నివేదికలు సమర్పిస్తుంది.
- మొట్టమొదటి చైర్మన్- జస్టీస్ రంగనాథ్ మిశ్రా
- ప్రస్తుత (7వ) ఛైర్మన్- జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా
జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
- 2007లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
- దీనిలో ఒక చైర్మన్ 6గురు సభ్యులు ఉంటారు.
- వీరిని కేంద్రప్రభుత్వం 3 సంవత్సరాల కాలానికి నియమిస్తుంది.
- బాలల హక్కుల ఉల్లంఘనలకు సంబందించి వివిధ రక్షణ సౌకర్యాలు పరిశీలించి తగిన సిఫారసులు చేస్తుంది.
- చైర్మన్ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. సభ్యులకు 60 సంవత్సరాలు.
- మొట్టమొదటి చైర్‌పర్సన్- శ్రీమతి ప్రొఫెసర్ శాంతా సిన్హా
- ప్రస్తుత చైర్‌పర్సన్- ప్రియాంక్ కనుంగో
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్
- ప్రభుత్వ పాలనలో అవినీతిని అరికట్టడానికి 1964లో K సంతానం కమిటీ సూచన ద్వారా దీనిని ఏర్పాటు చేశారు.
- 1998 లో ఆర్జినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తూ బహుళ సభ్య కమిషన్‌గా మార్చారు. దీనికోసం 2008లో పార్లమెంట్ ఒక సమగ్ర చట్టాన్ని చేసింది.
- ఇందులో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి 4 సంవత్సరాల కాల పరిమితికి నియమిస్తారు.
- వీరి పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు.
- రాష్ట్రపతికి వీరిని తొలగించే అధికారం ఉంది.
- మొట్టమొదటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ - నిట్టూరు శ్రీనివాసరావ్
- ప్రస్తుత సెంట్రల్ విజిలెన్స్ చీఫ్ కమీషనర్ - CVC సంజయ్ కొఠారి
లోక్‌పాల్- లోకాయుక్త వ్యవస్థ
- ఉన్నత స్థాయిలో అవినీతి ఆరోపణలపై విచారణ చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేసారు
- స్కాండినేవియా దేశాల్లో (స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే) ఈ వ్యవస్థను అంబుడ్స్ మన్ అంటారు.
- లోకాయుక్తను మొదటిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం - మహారాష్ట్ర (1971)
- కేంద్రంలో లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొదటిసారిగా 1968 లో దీనిని ప్రవేశపెట్టారు. కానీ చట్టరూపం దాల్చలేదు.
- లోక్‌పాల్ బిల్లు 2013ను పార్లమెంట్ డిసెంబర్ 18న అమోదించింది.
- ఈ బిల్లు ప్రకారం కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్ పాల్ అవుతుంది.
- లోక్‌పాల్ ఏర్పాటైన సంవత్సరం లోగా రాష్ట్రాలు లోకాయుక్తను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది.
- లోక్‌పాల్ చైర్మన్‌తో పాటు గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిని ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నస్పీకర్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడ్డు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది.
- వీరి పదవీ కాలాన్ని 5 సం. లేదా 75 సం. వయసు వచ్చేవరకు కొనసాగుతారు
- ప్రధానమంత్రి (కొన్ని షరతులకు లోబడి) కేంద్రమంత్రులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ మాత్రమే. దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు.
- ప్రస్తుత లోక్‌పాల్- పినాకి చంద్రఘోష్
లోకాయుక్త వ్యవస్థ
- రాష్ట్రస్థాయిలో పాలనా యంత్రాంగం పని తీరు, అవినీతి అరోపణలు, అధికార దుర్వినియోగం మొదలైన అంశాలను విచారణ చేయడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
- ఉమ్మడి రాష్ట్రంలో 1983లో దీనిని ఏర్పాటు చేశారు.
- ఇందులో ఒక లోకాయుక్త, ఉప లోకాయుక్త ఉంటారు. వీరిని గవర్నర్ 5 సంవత్సరాల కాలానికి నియమిస్తారు.
- ప్రస్తుత లోకాయుక్త జస్టీస్ - సీవీ రాములు
ప్రణాళికా సంఘం
- ఇది రాజ్యాంగేతర, చట్టేతర సంస్థ. కేబినెట్ నిర్ణయం ద్వారా 1950 మార్చి 15 న ఇది ఏర్పాటయింది.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షునిగా ఉంటారు.
- కేంద్రంలోని కేబినెట్ మంత్రులు తాత్కాలిక సభ్యులుగా అలాగే 4 నుంచి 6 వరకు నిష్ణాతులైన వారు పూర్తికాల సభ్యులుగా ఉంటారు.
- దీనికి ఒక డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఇతడిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది.
- దీని యొక్క మొదటి ఉపాధ్యక్షుడు - గుల్జారీ లాల్ నందా.
- ప్రస్తుతం దీని స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారు.
నీతి అయోగ్
- NITI - National Institution for Transforming India (జాతీయ పరివర్తన సంస్థ)
- దీనిని “విధాన రూపకల్పన సంఘం” అని పిలుస్తారు.
(నీతి-విధానం, ఆయోగ్- సంఘం)
- 1950 మార్చి 15న పేదరిక నిర్మూలన, నిరుద్యోగం, ఆదాయ అసమానతలను తగ్గించడం వంటి లక్ష్యాలతో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన స్థాపించిన ప్రణాళికా సంఘం సఫలీకృతం అయినప్పటికీ అశించిన స్థాయిలో లక్ష్యాలు సాధించలేదు.
- నీతిఅయోగ్ రాజ్యాంగేతర (Extra Constitutional) శాసనేతర (Non Stationary) సంస్థ.
- నీతి ఆయోగ్ యొక్క నినాదం- సబ్ కా సాథ్ సబ్కా వికాస్ (అందరితో కలిసి, అందరి అభివృద్ధి)
- నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం: యోజన భవన్ (న్యూ ఢిల్లీ)
- నీతి ఆయోగ్ అధికారిక పత్రిక: యోజన
- నీతిఅయోగ్‌ను రెండు ప్రధాన ఉద్దేశాలతో ఏర్పాటు చేశారు. అవి
- 1. Team India Hub (రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా పనిచేయడం)
- 2. Knowledge and Innovation Hub (నీతిఅయోగ్‌ను నూతన ఆలోచనల భాండాగారంగా నిర్మించడం)
ప్రత్యేక ఆహ్వానితులు
- నితిన్ గడ్కారీ (కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి)
- పీయూష్ గోయల్ (రైల్వే, వాణిజ్యం)
- థావర్‌చంద్ గెహ్లాట్ (సామాజికన్యాయం, సాధికారత)
- రావ్ ఇంద్రజీత్ సింగ్ (స్టాటిస్టిక్స్, ముఖ్యమంత్రులు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ప్రణాళిక)
- ముఖ్య కార్య నిర్వాహక అధికారి - అమితాబ్ కాంత్ (2016 నుండి)
- నీతి ఆయోగ్ పాలక మండలి (NAGC)
నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులు
- ప్రధానమంత్రి (అధ్యక్షుడు )
- నీతి ఆయోగ్ ఉఫాధ్యాక్షుడు
- నీతి ఆయోగ్‌లోని ప్రత్యేక ఆహ్వానితులు
- నీతి ఆయోగ్‌లోని పూర్తికాల సభ్యులు
- నీతి ఆయోగ్‌లోని పదవి రీత్యా సభ్యులు
- అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- శాసన సభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు
- అండమాన్, నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్
- నీతిఅయోగ్ పాలకమండలి సమావేశాలను టీమ్ ఇండియా గా వ్యవహరిస్తారు.
నీతి ఆయోగ్ విధులు
- విధానాల రూపకల్పనలో రాష్ట్రాలు భాగస్వాములయ్యే విధంగా ఒక 'సహకార సమాఖ్య' (కో ఆపరేటివ్ ఫెడరలిజం)ను రూపొందించడం (భారత సమాఖ్యను గ్రాన్‌విల్లే ఆస్టిన్ సహకార సమాఖ్య' అని పేర్కొన్నాడు)
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వైజ్ఞానిక, సాంకేతిక సలహాలను అందించే మేధోకేంద్రం (Think Tank) (నూతన ఆలోచనల భాండాగారం) గా వ్యవహరించడం.
- గ్రామస్థాయి ప్రణాళికలను ఉన్నత స్తాయి ప్రణాళికలతో అనుసంధానం చేయడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందించడం.
- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న విషయాల్లో, విద్యా విధాన పరిశోధనా సంస్థలకు సూచనలు చేస్తుంది.
- అభివృద్ధి ఎజెండా లో భాగంగా వివిధ రంగాలు, వివిధ శాఖల మధ్య ఒక పరిష్కార వేదికగా నిలుస్తుంది.
- ఆర్థికాభివృద్ధి ద్వారా లబ్ధి పొందలేని సామాజిక వర్గాల అభ్యన్నతి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.
- ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు, ప్రోత్సాహకాల అమలును పర్యవేక్షిస్తుంది.
- 2015 మార్చి16న నీతిఅయోగ్ పేదరిక నిర్మూలన, వ్యవసాయ అభివృద్ధిపై 2 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది.
- 2016 జూన్ 30 న వ్యవసాయ బీమాపై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసారు.
- పేదరిక నిర్మూలనపై టాస్క్‌ఫోర్స్‌కు వైర్మన్-నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
- వ్యవసాయ అభివృద్ధిపై టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్- నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు
- వ్యవసాయ బీమాపై టాస్క్‌ఫోర్స్‌కు చైర్మన్-పీకే అగర్వాల్
- వ్యవసాయ బీమాపై టాస్క్‌ఫోర్స్ సెక్రటరీ- J P మిశ్రా (నీతి ఆయోగ్ సలహాదారుడు)
- CCAFS - Climate Change, Agriculture Food Security
- ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల ప్రాంతీయ సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి వీటిని ఏర్పాటు చేస్తారు. వీటికి ఒక నిర్దిష్టకాల వ్యవధి ఉంటుంది.
- ఈ ప్రాంతీయ మండళ్లకు నీతిఅయోగ్ చైర్మన్ (ప్రధానమంత్రి) లేదా ఆయన నియమించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటారు.
జాతీయాభివృద్ధి మండలి
- ఇది కూడా రాజ్యాంగేతర సంస్థ
- 1952లో క్యాబినెట్ నిర్ణయం ద్వారా ఏర్పాటు చేశారు.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
- ప్రణాళికా సంఘంలోని సభ్యులందరూ ఇందులో సభ్యులే.
- ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను ఆమోదిస్తుంది. అమలు తీరును పరిశీలించి ప్రాధాన్యతను మార్చు చేస్తుంది.
- గమనిక: దీనిని ప్రస్తుతం రద్దు చేశారు.
జాతీయ సమైక్యత మండలి
- ఇది కూడా రాజ్యాంగేతర సంస్థే.
- 1961లో దీనిని ఏర్పాటు చేశారు.
- 2010లో పునర్‌వ్యవస్టీకరించారు.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
- దేశ ఐక్యత, సమగ్రతలకు సంబంధించి ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం దీని ఉద్దేశం దేశ ఐక్యత, సమగ్రతలకు సబంధించి ప్రజల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం.
జాతీయ భద్రతా మండలి
- 1998లో ఏర్పాటైంది.
- దీనికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉంటారు.
- జాతీయ రక్షణ కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రభుత్వానికి సలహాలను ఇస్తుంది.